Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Crime Thriller OTT : ప్రేమిస్తే హీరో క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Crime Thriller OTT : ప్రేమిస్తే హీరో క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

ABP దేశం 2 weeks ago

Bharat Niwas's Crime Investigation Thriller Panchanama OTT Streaming : క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అందులోనూ సస్పెన్స్ ఉండే కంటెంట్‌ను ఇష్డపడని మూవీ లవర్స్ ఉండరు. తాజాగా మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి ఆ మూవీ ఏంటి... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రేమిస్తే హీరో మూవీ

'ప్రేమిస్తే'తో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు భరత్. ఆయన ప్రధాన పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమా పంచనామా (Panchanama). ఈ మూవీకి త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఫేమ్ మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా... మేధ హీరోయిన్‌గా నటించారు. ఉదయభాను, అపూర్వ కీలక పాత్రలు పోషించారు.

ఈ మూవీ డైరెక్ట్‌ అండ్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'జైరామ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దర్యాప్తు ఇప్పుడు మొదలవుతుంది.' అంటూ అఫీషియల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. మర్డర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో స్టోరీ సాగనున్నట్లు అర్థమవుతోంది.

The Paradise Yeshanagula Song : యేష నాగుల కట్ట మీద యేసె ఉయ్యాల - నాని, కీర్తి సురేష్ మాస్ బీట్... హుషారెత్తించే లిరిక్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam