Ramakrishna Ghosh | చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్కు కీలక సమయంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయపడిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ రామకృష్ణ ఘోష్ పేరు చేరింది.
CSK టీమ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కాలికి ఫ్రాక్చర్ కావడంతో రామకృష్ణ ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్ తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తన IPL అరంగేట్రం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్ కెరీర్ లో మొదటి వికెట్ దక్కించుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో కొత్త ఆటగాడు రామకృష్ణ ఘోష్ కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందని CSK టీమ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అతను IPL 2026 సీజన్ లో తదుపరి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. తన అరంగేట్రం మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి విల్ జాక్స్ కావడంలో కీలకంగా వ్యవహరించాడు. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఘోష్ గాయపడటం చెన్నై జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు.

