Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం

ABP దేశం 1 month ago

Indian Athlets Great Show In CWG 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిశాక ఇండియా పతకాల సంఖ్యను చూస్తే కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. ఇండియా 39 మెడల్స్ (13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్) తో కామన్వెల్త్ ప్రయాణాన్ని ముగించింది.

1998 కౌలాలంపూర్ గేమ్స్ తర్వాత ఇండియా 50 కంటే తక్కువ పతకాలు సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే కేవలం పతకాల సంఖ్యతో మాత్రమే ఈ విజయాన్ని చూడకూడదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈసారి కామన్వెల్త్ లో 19 క్రీడలకు బదులుగా కేవలం 10 క్రీడలను మాత్రమే నిర్వహించారు. ష్యూరిటీగా పతకాలు తెచ్చే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీలను రద్దు చేసినప్పటికీ ఇండియా గ్రేట్ కంబ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ ని మెప్పించింది.

మెయిన్ ఈవెంట్స్ రద్దు.. అయినా 4వ స్థానంలో ఇండియా సంచలనం
గతంలో 30 పతకాలు అందించిన 5 ప్రధాన క్రీడలు లేకపోయినా ఇండియా వెనక్కి తగ్గలేదు. అందుబాటులో ఉన్న 10 క్రీడల్లోనే బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడాల తర్వాత 4వ పొజిషన్ లో నిలిచింది. హోస్ట్ కంట్రీ స్కాట్లాండ్ ని సిల్వర్ మెడల్స్ టైబ్రేకర్ లో వెనక్కి నెట్టి ఇండియా ఈ ఘనత సాధించింది. ప్రతీ స్పోర్ట్ లో యావరేజ్ గా 3.90 పతకాలు సాధించి ఇండియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

బాక్సింగ్ రింగ్ లో గోల్డెన్ పంచ్.. జూడోలో హిస్టారిక్ విజయం
బాక్సింగ్ టీమ్ ఈసారి విధ్వంసం సృష్టించింది. 14 మంది బాక్సర్ల బృందం ఏకంగా 10 పతకాలు సాధించగా, అందులో 7 గోల్డ్, 3 సిల్వర్ ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీలో ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి బంగారు పతకాలు సాధించగా, మెన్స్ లో సచిన్ శివాచ్, అంకుష్ పంగాల్ గోల్డ్ కొట్టారు. జూడోలో హర్ష్ సింగ్, అస్మిత డే హిస్టారిక్ గోల్డ్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. యామిని మౌర్య సిల్వర్, ఉన్నతి శర్మ బ్రాంజ్ తెచ్చారు.

అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్ డోమినేషన్.. మీరాబాయి చాను హ్యాట్రిక్ గోల్డ్
అథ్లెటిక్స్, పారా స్పోర్ట్స్ కలసి టోటల్ గా 16 పతకాలు అందించాయి. నీరజ్ చోప్రా సిల్వర్ గెలుచుకోగా, గుల్వీర్ సింగ్ టూ మెడల్స్ సాధించి రికార్డు కొట్టాడు. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్ లో బ్రాంజ్ సాధించాడు. పారా అథ్లెటిక్స్ లో షర్మిలా ధంకర్, దిలీప్ గావిత్, సోమన్ రాణా గోల్డ్ కొట్టారు. వెయిట్ లిఫ్టింగ్ లో స్టార్ అథ్లెట్ మీరాబాయి చాను కంటిన్యూయస్ గా థర్డ్ టైమ్ గోల్డ్ సాధించింది. ఇండియా ప్రైమ్ క్రీడలు లేకపోయినా కొత్త విభాగాల్లో కంబ్యాక్ ఇచ్చి సత్తా చాటిందని స్పోర్ట్స్ అనలిస్ట్స్ పేర్కొంటున్నారు.

Author :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam