Dasari Narayana Rao Death Anniversary: దాసరి నారాయణ రావు పేరు తెలియని తెలుగు సినీ ప్రముఖులు, పరిశ్రమలో కార్మికులు ఎవరూ ఉండరు. కేవలం దర్శక రత్నగా గొప్ప గొప్ప సినిమాలు అందించడం మాత్రమే కాదు...
చిత్రసీమ పెద్దగా ఎంతో మంది కార్మికుల కష్టాలు తీర్చిన నాయకుడు ఆయన. అటువంటి దాసరి సమాధి దిక్కులేకుండా ఉందిప్పుడు. కనీసం ఆయన వర్ధంతి రోజు కూడా ఎవరూ పట్టించుకోలేదు.
దిక్కులేని దాసరి సమాధి...
పట్టించుకునే నాథుడు ఎవరు?
Dasari Narayana Rao Vardhanthi: మే 30న దాసరి నారాయణ రావు వర్ధంతి. ఈ లోకాన్ని విడిచి తొమ్మిది ఏళ్ళు అవుతోంది. మే 30, 2017లో ఆయన మరణించారు. దాసరి జీవించి ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలోని ఫిల్మ్ నగర్ సమీపంలో ఉండేవారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్లే దారిలో ఆయన ఇల్లు ఉండేది. మరణించిన తర్వాత మొయినాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ సమాధి కట్టారు. ఇప్పుడు అది దిక్కు మొక్కు లేకుండా ఉంది.
Also Read: Upcoming Telugu Movies In June 2026 - జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'
దాసరి నారాయణ రావు వర్ధంతి నాడు కూడా ఆయన సమాధిని కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించులేదు. శుభ్రం చేయడం వంటివి చేయలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సరే దాసరిని తలుచుకునే వ్యక్తులు ఎక్కువ. తమ దైవం దాసరి అని, తమకు బ్రేక్ ఇచ్చేది దాసరి అని చెప్పుకున్న లెజెండరీ నటులు ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆయన సమాధి వీడియో ఓ యాంకర్ షేర్ చేయగా... వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన మంచు మనోజ్... అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు.
దర్శక నిర్మాతగా తెలుగు చిత్రసీమకు ఎంతో సేవ చేసిన దాసరి... రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. కేంద్ర సహాయ మంత్రిగా చేశారు. ఆయన తనయుడు అరుణ్ హీరోగా కొన్ని సినిమాలు చేశారు. కానీ సక్సెస్ కాలేదు. దాసరి వారసులు ఎవరూ ఇండస్ట్రీలో లేరు. అందుకే ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు.
Author : S Niharika

