Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dhanush : సీఎం విజయ్‌కు పోటీగా ధనుష్ - పాలిటిక్స్‌లోకి మరో కోలీవుడ్ స్టార్?

Dhanush : సీఎం విజయ్‌కు పోటీగా ధనుష్ - పాలిటిక్స్‌లోకి మరో కోలీవుడ్ స్టార్?

ABP దేశం 1 week ago

Kasthuri Raja About Dhanush Political Entry : కోలీవుడ్ స్టార్ ధనుష్ ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా?... దీనికి అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

ధనుష్ తండ్రి కస్తూరి రాజా రీసెంట్గా ఓ ప్రైవేట్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

'ఎవరైనా పాలిటిక్స్లోకి రావొచ్చు'

చెన్నైలోని సాలిగ్రామంలో ఓ ప్రైవేట్ ఈవెంట్కు హాజరైన ధనుష్ తండ్రి, ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజాకు ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. 'ధనుష్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయా?' అని అడగ్గా... 'ఎవరైనా కోరుకుంటే రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చు. నా కొడుకు, మనవళ్లు కూడా పాలిటిక్స్లోకి రావొచ్చు. ఫ్యూచర్లో వారు ఈ మార్గాన్ని అన్వేషించవచ్చు.' అంటూ కామెంట్ చేశారు. దీంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Ram Charan : ఫ్యాన్స్ కోసం రక్తం చిందిస్తా... పెద్ది ఆడలేదు పోరాడాడు - రామ్ చరణ్ స్పీచ్ హైలెట్స్

కోలీవుడ్ ఇండస్ట్రీకి పాలిటిక్స్కు బాండింగ్ చాలా బలంగా ఉంది. రీసెంట్ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ 108 స్థానాల్లో విజయం దక్కించుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పాలనలోనూ తనదైన స్టైల్, స్పీడ్తో అదరగొడుతున్నారు. రైతు రుణ మాఫీ దగ్గర నుంచీ అమ్మ క్యాంటీన్ల కొనసాగింపు వంటి కీలక నిర్ణయాలతో ప్రజల మనసులు గెలిచారు.

పాలిటిక్స్లోకి రాక ముందు అభిమాన సంఘాల ద్వారానే విజయ్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. విజయ్లానే ధనుష్ కూడా తన అభిమాన సంఘాల ద్వారా కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

Also Read : Janhvi Kapoor : తెలుగులో స్పీచ్ అదరగొట్టిన జాన్వీ - ట్రెడిషనల్ లుక్లో అచ్చియమ్మ

పాలిటిక్స్లోకి వచ్చిన కోలీవుడ్ స్టార్స్

ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి ఫేమస్ నటులు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ముఖ్యమంత్రులుగా మారారు. ఆ తర్వాత సీఎం విజయ్ టీవీకే పార్టీ రీసెంట్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎలక్షన్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ హిస్టారికల్ మూమెంట్గా నిలిచింది. విజయ్తో పాటు కమల్ హాసన్, శరత్ కుమార్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

మరోవైపు, ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో కర మూవీ చేశారు. ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. నటుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'D55' మూవీ చేస్తున్నారు. ధనుష్తో పాటు మమ్ముట్టి కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్. ఆ తర్వాత డైరెక్టర్ తమిళరసన్ పచ్చముత్తుతో 'D56', మారి సెల్వరాజ్తో 'D57' మూవీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇక 'వడ చెన్నై 2' కూడా అనౌన్స్ చేశారు.

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Ganesh Guptha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam