Trump Threatens Iran: యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సయోధ్యనో.. సమరమో.. రేపు రాత్రి లోగా తేల్చుకోవాలని డెడ్లైన్ విధించారు.
ఆ తర్వాత ఇరాన్లో ఏ ఒక్క బ్రిడ్జి మిగలదని.. దేశంలోని పవర్ ప్లాంట్లన్నింటినీ నాశనం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. White House దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ట్రంప్ ఈసారి చాలా తీవ్రమైన, స్పష్టమైన హెచ్చరికలు చేశారు. “మంగళవారం అర్థరాత్రి (GMT) కల్లా డీల్కు ఓకే చెప్పాలి. లేకపోతే . ఏం చేయాలో ఎలా చేయాలో పక్కా ప్లాన్ ఉంది. నాలుగు గంటల్లో ఇరాన్లో ఉన్న అన్ని బ్రిడ్జిలు, పవర్ప్లాంట్లను నామరూపాలు లేకుండా చేస్తాం” అని హెచ్చరించారు.
నేనేం చేస్తానో నాకే తెలీదు
ఇరాన్ విషయంలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు ట్రంప్ .. “నాకు తెలియదు” అని సమాధానం ఇచ్చారు. “నేనేం చేస్తానో నాకే తెలీదు” అని కామెంట్ చేశారు. ఇరాన్ విషయంలో ఏం చేయాలన్నది వాళ్లపైనే ఆధారపడి ఉందన్నారు. ఇరాన్ వారం రోజులు గడవు అడిగిందని కానీ తాను కనికరించి పదిరోజులు టైమ్ ఇచ్చానని ఆ గడువు ముగుస్తోందన్నారు. మంగళవారం ఈస్టర్న్ టైమ్ 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30) గంటలకల్లా ఏదో ఒకటి తేల్చారని షరతు విధించారు.
ఇరాన్ను వందేళ్లు వెనక్కు పంపిస్తా
రెండు రోజులుగా ఇరాన్పై ట్రంప్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం అయితే బాస్టర్డ్స్ అంటూ బూతులు కూడా తి్ట్టారు. Harmuz Strait తెరవకపోతే నరకం చూపిస్తానన్నారు. అన్నట్లుగానే ట్రంప్ మిలటరీ జాయింట్ చీఫ్ Dan Caine ని పక్కన పెట్టుకుని మాట్లాడారు. ఎన్నిట్రూప్లు ఇరాన్కు పంపుతున్నామో బహిరంగంగా చెప్పి బెదిరించాలనుకున్నారు కానీ.. Caine అది సీక్రెట్గా ఉంచుతున్నామన్నారు. ఇంత వరకూ చూడని భారీ దాడిని అమెరికా చేపట్టబోతోందని.. ఇరాన్ను తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఏ వంతెనని.. పవర్ప్లాంట్ను మిగల్చమని హెచ్చరించారు
NATO నా మాట వినలేదు అయినా పర్లేదు
డోనాల్డ్ ట్రంప్ నాటో పై తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. ఒక్క నాటో దేశం కూడా తమకు సాయం చేయలేదని నిష్టూరమాడారు. నాటో దేశాలే కాదు.. ఆస్ట్రేలియా, సౌత్ కోరియా, జపాన్ దేశాలు కూడా సాయానికి రాలేదని... పైగా తమ దేశాల్లోని సైనిక స్థావరాలను వాడుకునేందుకు కూడా ఒప్పుకోలేదని ట్రంప్ అన్నారు. అయినా అవన్నీ మాకక్కర్లేదు.. రేపేంటో మేం చూపిస్తాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు
ఇరాన్ ప్రజలే బాంబులు వేయమంటున్నారు
ఇరానీయున్లు అమెరికా చర్యలను సమర్థిస్తున్నారని ట్రంప్ చెప్రుకొచ్చారు. బాంబుు వేసి ఖమైనీ ప్రభుత్వాన్ని ఖతం చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే తమకు స్వేచ్చ దొరుకుతుందని అక్కడి వారు విశ్వసిస్తున్నారని చెప్పారు.
Author : ARYA

