Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Drinking water After Meals: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య  మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

Drinking water After Meals: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

ABP దేశం 2 months ago

Drinking water After Meals: మనం రోజూ సాధారణంగా వినిపించే తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు అని. మధ్య మధ్యలో కూడా నీళ్లు తాగడం మంచిది కాదని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు.

ఒక వైపు ఆయుర్వేదం భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీళ్లు తాగొద్దని చెబుతుంటే ఆధునిక వైద్యం మాత్రం నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి హాని లేదని చెబుతోంది.

జీర్ణక్రియ అంటే ఏంటి?

మనం తీసుకునే ఆహారం శరీరానికి శక్తిని అందించాలంటే అది సరిగా జీర్ణం కావాలి. ఈ ప్రక్రియ మనం ఆహారం నోట్లు పెట్టుకున్న క్షణం నుంచి మొదలవుతుంది. నోటిలో విడుదలయ్యే సలైవే ఆహాన్ని మొత్తగా మార్చి, అందులోని ఎంజైమ్ ద్వారా జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్స్, డైజెస్టివ్ ఎంజైమ్ కలిసి ఆహారాన్ని మరింత చిన్న భాగాలుగా విడగొడతాయి. పోషకాలు శరీరంలో కలిసిపోయేలా పేగులు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. నీరు ఆహారాన్నని కరిగించడంలో, పోషకాల శోషణలో, మలబద్ధకం నివారణలో సహయపడుతుంది.

మేయో క్లినిక్ పరిశీలనలో ఏం తేలింది

ప్రపంచ ప్రఖ్యాత మేయో క్లినిక్ వంటి సంస్థల ప్రకారం భోజనం సమయంలో లేదా తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచన అవుతాయనేది కేవలం మిథ్య మాత్రమే. నీళ్లు తాగడం వల్ల కడుపులో పీహెచ్ స్థాయిలో స్వల్ప మార్పు వచ్చినా, మన శరీరం వెంటనే స్పందించి మరిన్ని ఆమ్లాలను వీడుదల చేసి దాన్ని సమతుల్యం చేస్తుంది. నీరు వాస్తవానికి ఆహారం సాఫీగా కదలడానికి గొంతు దిగడానికి, ఆహారాన్ని మెత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఆయుర్వేదం ఏం చెబుతుంది

ఆయుర్వేదం శాస్త్రం భోజనం, నీటి మధ్య సంబంధం జీర్ణాగ్ని కోణంలో చూస్తుంది. కడపులో ఉండే జీర్ణశక్తిని అగ్నితో పోలుస్తారు. వాత పిత్త, కఫ ప్రకృతి గల వ్యక్తులకు వేర్వేరు సూచనలు ఉన్నాయి. వాత ప్రకృతి వారు భోజనం తర్వాత గంట ఆగి వెచ్చని నీరు తాగాలి. కఫ ప్రకృతి వారు భోజనానికి ముందే నీరు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.

సరైన సమయం ఎప్పుడు

వివిధ అధ్యయనాల, వైద్యుల అభిప్రాయాల ప్రకారం నీటిని భోజనానికి అర గంట ముందు ఒక గ్రాస్ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల తక్కువ క్యాలరీలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. ఆహారం మరీ పొడిగా ఉంటే, చిన్న చిన్న సిప్పులుగా నీరు తాగడం మంచి పద్ధతి. భారీ భోజనం చేసిన తర్వాత వెంటనే గ్లాసుల కొద్దీ నీరు తాగడం వల్ల ఉబ్బరం, అసిడిటి, వస్తాయి. అందుకే 15 నుంచి 30 నిమిషాల వ్యవధి ఇవ్వడం మంచిదని చాలా మంది 30 నిమిషాల వ్యవధి ఇవ్వడం మంచిదని అంటున్నారు.

చివరిగా సైన్స్, ఆయుర్వేదం రెండూ మితం అనే సూత్రాన్ని అంగీకరిస్తాయి. నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ ఆగిపోదు. కానీ తాగే విధానం, ఉష్ణోగ్రత, మీ శరీర స్పందన చాలా ముఖ్యం. రోజంతా తగినంత హైడ్రేషన్ కలిగి ఉండటం , భోజనం తర్వాత కొద్ది సేపు నడవడం వంటి అలవాట్లు జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తాయి.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam