EPFO 3.0 PF withdrawal via ATM:భారత్లోని కోట్ల మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్కు భరోసా ఇచ్చే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది.
పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే కంపెనీల చుట్టూ తిరగడం, రోజుల తరబడి దరఖాస్తుల ఆమోదం కోసం ఎదురు చూడటం ఇకపై ఉండదు. ఈపీఎఫ్ 3.0 పేరుతో తీసుకొస్తున్న ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థ ద్వారా, మీ పీఎఫ్ సొమ్మును నేరుగా ఏటీఎం నుంచి లేదా యూపీఏ ద్వారా పొందే అద్భుతమైన వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది.
ఈపీఎఫ్ 3.0 అనేది దేశంలోని ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన ఒక అత్యాధునిక డిజిటల్ చొరవ. పీఎఫ్ బదిలీలు, ఉపసంహరణల్లో జరిగే అనవసర జాప్యాన్ని పూర్తిగా తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఉన్న విధానంలో పీఎఫ్ క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ కంపెనీ ఆమోదం వంటి ప్రక్రియల వల్ సుమారు 7 నుంచి పది రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా లక్ష కంటే ఎక్కువ మొత్తం అయితే మాన్యువల్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. వీటిన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తి డిజిటల్, పేపర్లెస్ పద్ధతిలో ఈ సరికొత్త వ్యవస్థను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది.
ఈ కొత్త విధానంలో డబ్బులు డ్రా చేయడం చాలా సులభం. దీని కోసం ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఉద్యోగి తన స్మార్ట్ ఫోన్లోని ఉమాంగ్ యాప్ ద్వారా తన పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను చెక్ చేయాలి. ఎం మొత్తం విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఎంచుకున్న తర్వాత, యాప్లోనే ఒక క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూ ఆర్ కోడ్ను యూపీఐ సదుపాయం ఉన్న ఏటీఎంలోనైనా స్కాన్ చేయడం ద్వారా నగదును నేరుగా పొందవచ్చు. లేదా వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.
పత్రాల్లో తప్పులు ఉన్నాయన్న కారణంతో గతంలో పీఎఫ్ క్లెయిమ్లు పదే పదే పదే రిజెక్ట్ అయ్యేవి. కొత్త వ్యవస్థలో ఈ ఇబ్బందులు ఉండవు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రి ఖర్చులు లేదా ఇతర అవసరాల కోసం పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా వెంటనే పొందే వీలు ఉంటుంది.
పెన్షన్ తగ్గిపోతోందా?
ఏటీఎం ద్వారా పదే పదే డబ్బులు డ్రా చేస్తే భవిష్యత్లో వచ్చే పింఛన్ తగ్గిపోతుందమోనని చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఈ ఏటీఎం విత్డ్రాయల్ సదుపాయం కేవలం మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్కు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మీ వాటా, యజమాని వాటా మాత్రమే ఉంటాయి. మీ పెన్షన్ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. పీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేసినా మీ సర్వీస్ రికార్డు మారదు. పెన్షన్ పొందడానికి కనీసం పదేళ్ల సర్వీస్ అసరం. ఈ మధ్యలో మీరు పీఎఫ్ డ్రా చేసుకున్నా, పదేళ్ల సర్వీస్ పూర్తి కాగానే మీరు పింఛన్కు అర్హులు అవుతారు.
ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు | |
| 1 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం |
| 2 | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే |
| 3 | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ |
| 4 | ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే |
| 5 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్ |
ఈ పద్ధతిలో మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ లో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదు లక్షల లోపు మొత్తానికి కంపెనీ అనుమతి అవసరం లేదు. ప్రస్తుతం ఈ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే వివిధ దశల్లో దీనిని అమలు చేస్తామని కార్మిక వెల్లడించింది.
Author : Khagesh

