USA Beat Bosnia To Reach Last 16: ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ లో కో-హోస్ట్ అమెరికా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. తాజాగా కాలిఫోర్నియా వేదికగా జరిగిన హై-టెన్షన్ మ్యాచ్ లో బోస్నియా అండ్ హెర్జెగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి అడుగుపెట్టింది.
దీంతో 24 ఏళ్ల తర్వాత అమెరికా టీమ్‌కు ఒక వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో విజయం దక్కడం ఇదే ఫస్ట్ టైమ్. లాస్ట్ టైమ్ జూన్ 17, 2002 లో మెక్సికోను 2-0 తో ఓడించి నాకౌట్ మ్యాచ్ గెలిచింది. ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ ను టీవీల్లో దాదాపు 30 మిలియన్ల మంది అమెరికన్స్ లైవ్ లో చూశారు. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ఎండ్ లో అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగున్ సూపర్ గోల్ కొట్టి స్టేడియంలోని ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు.
బాలోగున్ కు రెడ్ కార్డ్ షాక్.. 10 మందితోనే అమెరికా మైండ్ బ్లోయింగ్ డిఫెన్స్
ఫస్ట్ హాఫ్ లో అద్భుతమైన గోల్ కొట్టిన బాలోగున్, సెండ్ హాఫ్ లో ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ 64వ నిమిషంలో బోస్నియా ప్లేయర్ తారిక్ ముహారెమోవిక్ కాలిపై తొక్కడంతో వీఏఆర్ (VAR) రివ్యూ ద్వారా అంపైర్ అతనికి స్ట్రెయిట్ రెడ్ కార్డ్ చూపించి గ్రౌండ్ నుంచి పంపించేశాడు. దీంతో అమెరికా టీమ్ ఒక్కసారిగా షాక్ లో పడింది. కేవలం 10 మంది ప్లేయర్లతోనే మ్యాచ్ ఆడాల్సి రావడంతో కోచ్ మారిసియో పొచెటినో హైడ్రేషన్ బ్రేక్ టైమ్‌లో ప్లేయర్లందరినీ ఒక హడిల్ గా పిలిచి డిఫెన్స్ స్ట్రాంగ్ చేయాలంటూ మోటివేట్ చేశాడు. అమెరికా కెప్టెన్ క్రిస్టియన్ పులిసిక్ ఒక గోల్ కొట్టినా అది అంపైర్ ఆఫ్ సైడ్ గా డిక్లేర్ చేశాడు.
మాలిక్ టిల్మాన్ ఫ్రీ కిక్ మ్యాజిక్..
బోస్నియా టీమ్ ఫస్ట్ హాఫ్ లో చాలా అటాకింగ్ గా ఆడింది. 40 ఏళ్ల లెజెండరీ కెప్టెన్ ఎడిన్ జెకో ఇచ్చిన పాస్ తో ఎర్మెడిన్ డెమిరోవిక్ కొట్టిన షాట్ ను అమెరికా కీపర్ మాట్ ఫ్రీజ్ సూపర్ సేవ్ తో అడ్డుకున్నాడు. సెండ్ హాఫ్ లో జెకో ఇంజరీ వల్ల గ్రౌండ్ వీడటం బోస్నియాను బాగా దెబ్బతీసింది. అమెరికా 10 మందితో ఆడుతున్న టైమ్‌లో బోస్నియాకు గోల్ కొట్టే గోల్డెన్ ఛాన్స్ వచ్చినా డెమిరోవిక్ మళ్లీ కీపర్ చేతుల్లోకే కొట్టాడు. మ్యాచ్ 82వ నిమిషంలో అమెరికాకు ఒక ఫ్రీ కిక్ లభించింది. ఈ గోల్డెన్ ఛాన్స్ ను మాలిక్ టిల్మాన్ ఒక క్లాసిక్ కర్లింగ్ షాట్ తో బోస్నియా కీపర్ నికోలా వాసిల్ ను దాటించి నెట్ లోకి పంపడంతో అమెరికా 2-0 లీడ్ సాధించి విక్టరీ కన్ఫర్మ్ చేసుకుంది.
సీయాటిల్ లో బెల్జియంతో బిగ్ ఫైట్..
లాస్ట్ లో అంపైర్ ఇచ్చిన 10 నిమిషాల సుదీర్ఘ స్టాప్పేజ్ టైమ్ లో బోస్నియా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఎర్మిన్ మహమిక్ కొట్టిన పవర్‌ఫుల్ షాట్ గోల్ పోస్ట్ పక్క నుంచి కొద్దిగా మిస్ అయింది. అమెరికా డిఫెండర్ టైలర్ ఆడమ్స్ మిడిల్ లో అద్భుతంగా బాల్స్ ను కంట్రోల్ చేస్తూ బోస్నియాకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ షీట్ మెయింటైన్ చేశాడు. మ్యాచ్ ముగియగానే స్టేడియం అంతా "USA.. USA" నినాదాలతో పాటు ఫేమస్ "టేక్ మీ హోమ్, కంట్రీ రోడ్స్" సాంగ్ తో ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ తో హోరెత్తించారు. సొంత గడ్డపై ఈ చారిత్రాత్మక విజయంతో అమెరికా నెక్స్ట్ సోమవారం సీయాటిల్ వేదికగా జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో పవర్‌ఫుల్ బెల్జియం టీమ్ తో తలపడనుంది.
Author : Ayesh

