Germany, Netherlands Out In Shock Penalty Shootout Loss: ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ లో జర్మనీ టీమ్‌కు కోలుకోలేని షాక్ తగిలింది.
సోమవారం ఫాక్స్‌బరో వేదికగా జరిగిన హై-డ్రామా మ్యాచ్ లో పరాగ్వే చేతిలో పెనాల్టీ షూటౌట్ లో 3-4 తేడాతో జర్మనీ ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయింది. వరల్డ్ కప్ హిస్టరీలోనే జర్మనీ ఒక పెనాల్టీ షూటౌట్ లో ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం గమనార్హం. అంతకుముందు నిర్ణీత సమయంలోగా ఇరు జట్లూ 1-1 తో డ్రా చేసుకున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో జూలియో ఎన్సిసో పవర్‌ఫుల్ హెడర్ గోల్ తో పరాగ్వేకు ఊహించని లీడ్ ఇచ్చాడు. అయితే సెండ్ హాఫ్ 54వ నిమిషంలో జర్మనీ స్టార్ కై హావెర్ట్జ్ టోర్నీలో తన థర్డ్ గోల్ కొట్టి స్కోరును ఈక్వల్ చేశాడు.
జర్మనీ రికార్డ్స్ క్లోజ్.. షూటౌట్ లో పరాగ్వే కీపర్ ఒర్లాండో గిల్ మ్యాజిక్
ఎక్స్‌ట్రా టైమ్‌లో జర్మనీ ప్లేయర్ జోనాథన్ తా కొట్టిన గోల్ ను వీఏఆర్ (VAR) రివ్యూ ద్వారా అంపైర్ రద్దు చేశాడు. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఈ నెర్వ్-జాంగ్లింగ్ షూటౌట్ లో పరాగ్వే గోల్ కీపర్ ఒర్లాండో గిల్ అద్భుతమైన డైవ్‌లతో కై హావెర్ట్జ్, నిక్ వోల్టెమేడ్‌ల షాట్లను బ్లాక్ చేసి హీరోగా నిలిచాడు. పరాగ్వే ప్లేయర్లు రెండు విన్నింగ్ ఛాన్సెస్ మిస్ చేసుకున్నప్పటికీ, జర్మనీ డిఫెండర్ జోనాథన్ తా కొట్టిన లాస్ట్ షాట్ బార్ పై నుంచి బయటకు వెళ్ళిపోయింది. కరెక్ట్ టైమ్ లో వచ్చిన ఛాన్స్ ను పరాగ్వే ప్లేయర్ జోస్ కెనాల్ గోల్ గా మార్చి జర్మనీని టోర్నీ నుంచి పంపించేశాడు. 2014 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫస్ట్ టైమ్ నాకౌట్ చేరిన జర్మనీకి ఇది ఊహించని పెద్ద పరాభవం.
నెదర్లాండ్స్ కు మొరాకో కౌంటర్ అటాక్..
మరొక క్రేజీ మ్యాచ్ లో మొరాకో టీమ్ కూడా పెనాల్టీ షూటౌట్ లో నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టి లాస్ట్ 16 లోకి దూసుకెళ్లింది. మాంటెర్రే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్ ముగిసేసరికి 1-1 తో టై అయింది. డచ్ టీమ్ మ్యాచ్ సెండ్ హాఫ్ లో కోడి గ్యాక్పో కొట్టిన సూపర్ గోల్ తో విక్టరీకి చాలా క్లోజ్ గా వచ్చింది. తన పుట్టబోయే కొడుకు చనిపోయాడని పార్ట్‌నర్ కన్ఫర్మ్ చేసిన కొన్ని రోజుల్లోనే గ్యాక్పో ఈ ఎమోషనల్ గోల్ కొట్టడం అందరినీ కదిలించింది. అయితే మ్యాచ్ స్టాపేజ్ టైమ్ ఫస్ట్ నిమిషంలో మొరాకో ప్లేయర్ ఇస్సా డియోప్ ఒక డ్రామాటిక్ హెడర్ గోల్ కొట్టి నెదర్లాండ్స్ విక్టరీ ఆశలను దెబ్బకొట్టాడు.
యాసిన్ బౌనో సూపర్ సేవ్..
షూటౌట్ లో మొరాకో గోల్ కీపర్ యాసిన్ బౌనో కీ రోల్ ప్లే చేశాడు. నెదర్లాండ్స్ తరఫున ఫిఫ్త్ పెనాల్టీ కొట్టిన క్రిసెన్సియో సమ్మర్‌విల్లే షాట్ ను బౌనో అద్భుతంగా బ్లాక్ చేశాడు. ఆ వెంటనే మొరాకో స్ట్రైకర్ ఇస్మాయిల్ సైబారీ పవర్‌ఫుల్ విన్నింగ్ స్పాట్-కిక్ తో గోల్ కొట్టి షూటౌట్ లో 3-2 తో నెదర్లాండ్స్ కథ ముగించాడు. ఈ సంచలన విజయంతో మొరాకో టీమ్ శనివారం హ్యూస్టన్ వేదికగా జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో కెనడాతో తలపడనుంది. ప్రెజర్ సిట్యుయేషన్స్ లో నెదర్లాండ్స్ ఫెయిల్ అయిందని, మొరాకో కీపర్ బౌనో వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ ను చేంజ్ చేశాడు.
Author : Ayesha

