Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fire Accident Fauji: ప్రభాస్ ఫౌజీ సెట్స్‌లో మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ - నెట్టింట వీడియో వైరల్

Fire Accident Fauji: ప్రభాస్ ఫౌజీ సెట్స్‌లో మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ - నెట్టింట వీడియో వైరల్

ABP దేశం 1 week ago

Fire Accident At Prabhas Fauji Sets?: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా 'సీతా రామం' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఫౌజీ.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒకసారి సెట్స్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమా సెట్స్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫౌజీ సెట్స్‌లో ఫైర్ యాక్సిడెంట్?
ప్రస్తుతం 'ఫౌజీ' చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City Hyderabad)లో శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం... జూలై 3న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం... సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం (ఫైర్ యాక్సిడెంట్) సంభవించినట్టు అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read:Peddi OTT Release Date - పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?

ఫౌజీ సెట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ తగలబడటంతో పొగ పైకి రావడం కనిపించింది. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో సెట్స్‌లో టెంట్లు, షూటింగ్ కోసం తీసుకు వచ్చిన ఎక్విప్మెంట్ కొంత డ్యామేజ్ అయ్యిందని... అవి కాలడం వల్ల నష్టం వచ్చిందని టాక్. అయితే... ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Also Read: Rao Bahadur First Day Collections - ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

డిసెంబర్ నెలలో ప్రభాస్ ఫౌజీ రిలీజ్!
Fauji Release Date Prabhas: ఇప్పటి వరకు ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతున్న సమాచారం ప్రకారం... డిసెంబర్ 3న భారీ ఎత్తున విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read: Nagabandham First Day Collections - నాగబంధం కలెక్షన్లు... ఫ్లాప్‌ టాక్‌తో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam