Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fuel Price Impact Automobile Demand:  పెరుగుతున్న ఇంధన ధరలతో ఆటోమొబైల్ రంగానికి షాక్: కార్ల అమ్మకాలపై పడనున్న ఇంపాక్ట్..!!

Fuel Price Impact Automobile Demand: పెరుగుతున్న ఇంధన ధరలతో ఆటోమొబైల్ రంగానికి షాక్: కార్ల అమ్మకాలపై పడనున్న ఇంపాక్ట్..!!

ABP దేశం 4 months ago

Fuel Price Hike May Impact Automobile Demand: ఇండియాలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న జియోపొలిటికల్ క్రైసిస్ వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

పెట్రోల్ ధర రూ. 115 మార్కును దాటి దూసుకుపోతుండగా, డీజిల్ ధర కూడా సెంచరీకి చేరువలో ఉంది. ఈ ఫ్యూయల్ ప్రైస్ హైక్ వల్ల ఇండియాలో ఆటోమొబైల్ డిమాండ్ పై పడే ఇంపాక్ట్ ను నిరంతరం మానిటర్ చేయాల్సి ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎమ్డీ, సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు. కొత్త 2026 టాటా టియాగో, టియాగో ఈవీ లాంచ్ సందర్భంగా అతడు మీడియాతో ఈ విషయాలను షేర్ చేసుకున్నారు.

డీజిల్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం..

గత 10 రోజుల్లోనే ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగాయని, ఈ పెంపు ఎక్కడ ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని శైలేష్ చంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ అనేది లాజిస్టిక్స్, రవాణా రంగానికి మెయిన్ ఫ్యూయల్ కావడం వల్ల దీని ధర పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కార్లను లగ్జరీ ప్రొడక్ట్స్ గా భావించే మిడిల్ క్లాస్ ప్రజలు ఇలాంటి టైమ్ లో డబ్బులు దాచుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారని, దీనివల్ల రాబోయే నెలల్లో కార్ల సేల్స్ తగ్గే ఛాన్స్ ఉందని విశ్లేషించారు. ఆల్రెడీ యూజ్డ్ కార్ మార్కెట్ స్లోడౌన్ కావడం దీనికి సంకేతమని అతడు అభిప్రాయపడ్డారు.

Read Also: Hero MotoCorp First Flex Fuel Car: హీరో మోటోకార్ప్ తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్: పెట్రోల్ తో పాటు ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్స్.. 3న అఫీషియల్ ఎంట్రీ

ఎఫ్ వై 2027 డబుల్ డిజిట్ గ్రోత్ టార్గెట్

ప్రస్తుత ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ ఎఫ్ వై 2027 (FY27) అవుట్లుక్ మార్చడానికి ఇది సరైన సమయం కాదని శైలేష్ చంద్ర స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్ ఇండస్ట్రీ 10 శాతం కంటే ఎక్కువ గ్రోత్ సాధిస్తుందనే నమ్మకాన్ని అతడు వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ కు ఉన్న స్ట్రాంగ్ ప్రొడక్ట్ పైప్లైన్, రాబోయే మల్టిపుల్ లాంచ్ల వల్ల కంపెనీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రస్తుతానికి తమ కార్ల డిమాండ్ పాటర్న్ లో ఎలాంటి పెద్ద మార్పు కనిపించడం లేదని, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

Read Also: Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

ఎలెక్ట్రిక్ వాహనాలకు పెరిగిన డిమాండ్..

ఫ్యూయల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు ఈవీ (EV) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ఎలెక్ట్రిక్ వాహనాల మంత్లీ బుకింగ్స్ 2 నుంచి 2.5 రెట్లు పెరిగాయని శైలేష్ చంద్ర వెల్లడించారు. ధరల పెరుగుదల ముందే ఊహించి కస్టమర్లు ఈవీలను బుక్ చేసుకుంటున్నారని అతడు తెలిపారు. డిమాండ్ కు తగ్గట్టుగా ఈవీ ప్రొడక్షన్ ను పెంచడానికి టాటా మోటార్స్ రెడీగా ఉంది. ప్రస్తుతం నెలకు 10,000 ఈవీ కార్లను తయారు చేస్తుండగా, రాబోయే మూడు నాలుగు నెలల్లో సప్లయర్లతో మాట్లాడి ఈ కెపాసిటీని 50,000 కి పెంచడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అతడు వివరించారు.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam