Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది.
ఈ రోజు(జులై 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వే అడుగు అమ్మా..
సింహాద్రి నందుకి అమెరికా సంబంధం తీసుకొస్తాడు. జాను ఆ సంబంధం మీద అనుమానంతో వివరాలు అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తాలే అని సింహాద్రి అంటాడు. ఇక నందు అయితే నానమ్మని పట్టుకొని మురిసిపోతుంది. నందుని రెడీ అవ్వమని శారద వస్తుంది. జాను వచ్చి ఒక సారి డిటైల్స్ తెలుసుకుందాం.. అమ్మ నువ్వే సింహాద్రి అంకుల్కి అడుగు అని అంటే అన్నీ అన్నయ్య చూసుకుంటారు నువ్వేం దూరకు అని శారద అనేస్తుంది. నందుని బామ్మ, శారద రెడీ చేస్తారు.
నాలుగు రోజుల్లో పెళ్లి..
జాను సింహాద్రికి పెళ్లి వాళ్లు ఎవరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అవన్నీ ఎందుకమ్మా తర్వాత చూద్దాం అని సింహాద్రి అంటాడు. పెళ్లి వాళ్లకి అన్ని వివరాలు మొహమాటం లేకుండా అడగండి అని జాను అంటే అవన్నీ నీకు ఎందుకు అని శారద అంటుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తారు. అమ్మాయి మాకు బాగా నచ్చింది.. అబ్బాయి త్వరగా అమెరికా వెళ్లిపోవాలి.. ఇప్పుడే తాంబూలాలు మార్చుకొని నాలుగు రోజుల్లో పెళ్లి చేసేసి అమెరికా పంపేద్దాం అని పెళ్లి వాళ్లు అంటారు. ఇంత హడావుడిగా ఎందుకు అని జాను అంటే మా అబ్బాయికి సంవత్సరం వరకు అవ్వదు ఇక మీరు చూసుకోండి అంటాడు. చెల్లమ్మా జానుకి సైలెంట్గా ఉండమని చెప్పు.. పెళ్లి ఖర్చు అంతా నాదే.. నా చేతుల మీద పెళ్లి జరిపిస్తా అని సింహాద్రి అంటాడు.
మీ వివరాలు కావాలి..
తాంబూలం మార్చుకుందాం అని పెళ్లి వాళ్లు అంటే జాను వివరాలు అడుగుతుంది. జాను నీకేం చెప్పాను నువ్వేం అడుగుతున్నావ్ అని అంటాడు. మాకు ఇంత అవమానిస్తారా.. మీకు అంత అనుమానం ఉంటే ఇది మా అడ్రస్ అని ఓ అడ్రస్ ఇస్తాడు. నాకు ఈ సంబంధం ఓకే అని నందు అనేస్తుంది. పంతులు లగ్నపత్రిక రాస్తారు. రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని అంటారు. సింహాద్రి, అరుణ తాంబూలాలు తీసుకుంటారు.
నీకు త్వరలో పెళ్లి..
మరోవైపు మురళీ షాప్ దగ్గర ఉంటే శాంతి పెళ్లి ఫిక్స్ చేస్తుంది. నేను పెళ్లి చేసుకోను అని మురళీ అంటే అది నిన్ను తీసి పడేస్తే నువ్వు దాని పెళ్లి పనులు చేస్తావా.. దాని పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అవ్వాలి కాదు కూడదు అంటే చచ్చిపోతా అని కత్తెర గొంతు దగ్గర పెడుతుంది. దాంతో మురళీ సరే అంటాడు.
ముఖం పచ్చడి చేసేసిన జాను..
సూర్య బాక్సింగ్ చేస్తూ తుఫాను ముఖం పచ్చడి చేసేస్తాడు. ఇక జాను వచ్చి ఏంటి సూర్య ఎన్ని సార్లు ఫోన్ చేయాలి అని అడుగుతుంది. అక్కకి ఎన్నారై సంబంధం వచ్చింది.. వాళ్లు డిటైల్స్ ఇవ్వలేదు అని కోపంగా ఉంటే సూర్య జాను చేతికి గ్లౌజ్లు వేసి కొట్టమని అంటాడు. జాను సాండ్ బ్యాగ్ని చితక్కొడుతుంది. అప్పుడే సూర్యని కూడా కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

