Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Godavari Serial Today May 30th: 'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!

Godavari Serial Today May 30th: 'గోదావరి' సీరియల్: నువ్వు చచ్చినా నీ శవం చూడటానికి రానురా.. తమ్ముడి కాలర్ పట్టుకొని గెంటేసిన శాంతి..!

ABP దేశం 2 weeks ago

Godavari Serial Today Episode | ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది.

ఈ రోజు(మే 28న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సిగ్గు లేదారా మీకు.. నన్నే పిలుస్తున్నారు..

శంకర్, శారద మొదటి శుభలేక తీసుకొని శాంతి దగ్గరకు వెళ్తారు. శాంతి కోపంతో తన కొడుకుని కాదని అలకనందకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు కాబట్టి అలకనంద జీవితం నాశనం అయిపోవాలని అంటుంది. అలా అనొద్దు అక్క అని శంకర్ శుభలేకతో పాటు తాంబూలం పళ్లెం ఇస్తే దాన్ని శాంతి విసిరేస్తుంది. అప్పుడే సూర్య, మురళీ వస్తారు. నా కొడుకుని కాదని నీ కూతురికి వేరే పెళ్లి చేయడమే కాకుండా నన్నే పెళ్లికి పిలుస్తారా.. ఎంత ధైర్యంరా అని శాంతి కేకలేస్తుంది.

శంకర్ని అవమానించిన శాంతి..

మురళీ పరుగున వచ్చి ఏంటమ్మా ఇది.. ఇంటికి వచ్చిన మామయ్య వాళ్లని అవమానిస్తావా అని తల్లిని అడుగుతాడు. మామయ్య క్షమించండి అని అడుగుతాడు. ఎవడ్రా నీకు మామయ్య.. వీడు ఒక అవకాశావాది అని అంటుంది. చేసిన మోసానికి వీడు మన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అయినా ఇక్కడే ఉన్నావేంట్రా అని తమ్ముడి కాలర్ పట్టుకొని బయటకు గెంటేస్తుంది.

Also Read: Peddi Pre Release Event - విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్

నువ్వు మారిపోయావ్రా..

అక్క నిన్ను అక్క అనుకోలేదు అమ్మ అనుకున్నా.. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు అక్కా అని అంటాడు. ఇచ్చిన మాట తప్పి.. మీ స్థాయికి నేను సరిపోను అని నా కొడుకుని అవమానించి పెళ్లి వద్దని చెప్పేశారు అని అంటుంది. శారద మాట్లాడాలని చూస్తే శాంతి మాట్లాడనివ్వదు.. దాంతో శారద ఏడుస్తూ ఇన్ని అవమానాలు భరిస్తూ శాపనార్థాలు పెట్టించుకొని ఇక్కడ ఉండటం అవసరమా అని శారద ఏడుస్తుంది.

మీ కూతురి పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా..

వెళ్లండిరా వెళ్లండి.. మీ కూతురి పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా.. భర్త లేని ఆడదానితో ఏడిపించారు.. ఇంత మోసం చేశారు.. నా ఉసురు ఊరికే పోదురా.. నాశనం అయిపోతారు..మట్టి కొట్టుకుపోతారు అని మట్టి విసిరి శాపం పెట్టి శంకర్ని తోసేస్తుంది. దేవుడు అనే వాడు ఉంటే నా బాధ చూస్తుంటాడు.. నీ కూతురి పెళ్లి జరగనివ్వడురా.. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు చస్తే నీ శవం చూడటానికి కూడా రానురా అని అంటుంది. శంకర్ తల దించుకొని వెళ్లిపోతాడు. సూర్య శంకర్ వెనకాలే వెళ్లి బాధ పడొద్దని కారులో డ్రాప్ చేస్తున్నా అని చెప్పినా ఏం మాట్లాడరు.

కొత్త బావ ఫోన్ చేశాడా..

అలకనంద, గౌతమి, జాను, కిన్నెర ఇలా అందరూ శుభలేఖలకు పసుపుకుంకుమ పెడతారు. కొత్త బావ ఫోన్ చేశాడా అక్క అని కిన్నెర అడుగుతుంది. బామ్మ నందుతో వాడేమైనా నా మనవడా.. నీ కొంగు పట్టుకొని తిరగడానికి అని బామ్మ అంటుంది. అమెరికా అబ్బాయి నా కొంగు పట్టుకొని తిరుగుతాడు అని నందు అంటుంది. నా అందం నీకు వచ్చింది కానీ అంత మాత్రానా నీ వెనక తిరగడు అని బామ్మ అంటుంది. అయితే ఇప్పుడే నీకు అరవింద్ కాల్ చేస్తే నీ కొంగు పట్టుకొని తిరుగుతా అని బామ్మ అంటుంది. ఇంతలోనే నందు కోసం అరవింద్ కాల్ చేస్తాడు. కిన్నెర, గౌతమి కాసేపు అరవింద్ని ఆటపట్టిస్తారు.

జానుకి అనుమానం..

శంకర్ ఇంటి గుమ్మం ముందు కూర్చొని బాధ పడుతూ ఉంటాడు. సూర్య, శారదలు శంకర్కి ధైర్యం చెప్తారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అనుకుంటారు. జానుకి తెలిస్తే అస్సలు ఊరుకోదు అని తెలిసి ఎలా చెప్తాను మీరు జాగ్రత్త పడండి అంకుల్ అని సూర్య అంటాడు. జాను, అలకనంద బయటకు వస్తారు. తండ్రి షర్ట్ మీద మట్టి చూసిన జాను ఏమైందని అడుగుతుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు.. ఏంటో చెప్పు అని జాను అడుగుతుంది.

కళ్లు నెత్తికెక్కాయరా మీకు..

బామ్మ వచ్చి ఏమైందిరా.. ఏంటి ఆ మరకలు.. పెద్ద కూతురు పెళ్లి ఫిక్స్ అయిందని కళ్లు నెత్తికి ఎక్కాయా అని బామ్మ అడుగుతుంది. ఇక చాలు ఆపండి అత్తయ్యా.. అతని కళ్లు నెత్తికి ఎక్కలేదు అదంతా మీ కూతురు ఇచ్చిన బహుమానం అని జరిగింది చెప్తుంది శారద.

అత్త ఇంత పని చేసిందా..

మొత్తం విన్న జాను అత్త ఇంత పని చేసిందా.. మీకు ఇంత అవమానం చేస్తుందా.. తన సంగతి చెప్తా అని జాను వెళ్లబోతే శంకర్ ఆపుతాడు. మా అక్క ఏదో కోపంలో అనేసింది.. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన కుటుంబం అంటే మన ఏడుగురిమే కాదు.. మా అక్క మురళీ కూడా అని అంటాడు. మీరు ఎన్ని చెప్పినా వినను.. వాళ్ల అంతు చూస్తా అని జాను అంటే ఈ విషయం వదిలేయమని చెప్పాను కదా వదిలేయ్ అని శంకర్ అరుస్తాడు.

Also Read: Upcoming Telugu Movies In June 2026 - జూన్లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

మధ్యలో నేనేం చేశా..

సూర్య జానుని కూల్ చేయాలని చూస్తాడు. జాను సూర్య మీద అరిస్తే తిట్టిన మీ అత్త బాగానే ఉంది.. తిట్టించుకున్న మీ నాన్న బాగానే ఉన్నారు మధ్యలో నువ్వు నన్ను తిడుతున్నావ్ ఏంటి అని సూర్య అడుగుతాడు. గొడవ అయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావ్ కదా,, ఏం చేశావ్ నాకు చెప్పాలి కదా అని జాను అంటుంది. చెప్తే నువ్వు ఊరుకోవు అని చెప్పలేదని సూర్య అంటాడు. అవునబ్బాయ్ 6నెలలకు ఒకసారి ఊర్లు పట్టుకొని తిరుగుతావ్ కదా అక్కడ అసలు అమ్మాయిలే లేరా నన్ను తగులుకున్నావ్ అని జాను అడుగుతుంది. కళ్లకి ఎంత మంది కనిపించినా మనసుకి నచ్చిన వారు మాత్రం ఒకరే ఉంటారు.. అది నువ్వే నాకు అని సూర్య అంటాడు. పరిస్థితి ఏదైనా నీకు మాత్రం ఇదే గోలా అని జాను చిరాకు పడుతుంది. దాంతో సూర్య జానుకి సారీ చెప్పడంతో జాను నవ్వేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్తో పాటు తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుంది? లాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam