Gunde Ninda Gudi Gantalu 2025 April 29th Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 29 ఎపిసోడ్
బాలు ఇంటికి రాకపోవడంతో కంగారుపడుతుంటుంది మీనా.
ఏమైనా జరిగిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మావయ్య అన్నట్టు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోయిందా? అయితే రింగ్ అవదు కదా? కానీ రింగ్ అయినా కానీ ఎందుకు లిఫ్ట్ చేయలేదని బాధపడుతుంది. వంట చేసేసి కొండెక్కి కూర్చుంటే ఎవరు వడ్డిస్తారని ప్రభావతి సెటైర్స్ వేస్తుంది. అన్నీ అక్కడే ఉన్నాయి కదా..పెట్టుకుని తిను అంటాడు. మీరు రండి అని అడుగుతుంది. నువ్వు పెడతావా? నీతో కలసి తినాలా? వండిన వాళ్లు మంచిమనసు..కొసరి కొసరి వడ్డించే మంచి వ్యక్తుల వల్ల అది అమృతం అవుతుంది. నువ్వు పెడితే అది విషం అవుతుందంటాడు సత్యం. ఇంతలో బాలు వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీనాకు చెప్పకుండా వెళ్లావేం? అని వరుస ప్రశ్నలు వేస్తాడు సత్యం. పొడి పొడిగా సమాధానం చెప్పిన బాలుకి క్లాస్ వేసిన సత్యం.. కోడలు ఉదయం నుంచి ఏమీ తినకుండా నీకోసం ఎదురుచూస్తోంది అంటాడు.
మేడపైకి వెళ్లిన బాలుని చూసి..హమ్మయ్య వచ్చారంటూ ఆనందంగా ఉంటుంది మీనా. ఎక్కడికి వెళ్లారు? ఇంత ఆలస్యంగా వస్తారా? లేటైతే కాల్ చేసి చెప్పక్కర్లేదా? అని వరుసగా ప్రశ్నలు వేస్తుంది. ఇదిగో వీటి కోసమే అంటూ డబ్బులు చేతిలో పెడతాడు. నేను ఎక్కువ సంపాదించమని అడిగానా? ఏంటివి అని నిలదీస్తుంది. నువ్వే కదా ఎక్కువ సంపాదించాను..మీ కన్నా ఒక్కరోజులోనే సంపాదించాను చూశారా అన్నావ్ కదా అందుకే నీకన్నా ఒక్క రూపాయి అయినా ఎక్కువ సంపాదిద్దాం అని ఇంతవరకూ కష్టపడ్డాను అంటాడు బాలు. ఆ మాటలు విని షాక్ అవుతుంది మీనా. నాతో వ్యాపారం పెట్టించింది మీరు, నా కన్నా ఓ అడుగు ముందుకు వేసి నాకోసం ఆలోచించింది మీరు..నేను డెకరేషన్ పని స్టార్ట్ చేస్తానని చెప్పగానే ఎంకరేజ్ చేసింది మీరు. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేస్తే..సంతోషిస్తారు అనుకున్నా..కానీ ఇలా ఆలోచిస్తారని అనుకోలేదంటుంది. తనను ప్రోత్సహించిన వ్యక్తే..తన ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోవడం బాధకలిగించింది అంటుంది
మేడపైనుంచి దిగి కోపంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది. వెళ్లి బతిమలాడుకుంటాడు బాలు. నేను ఆల్రెడీ తినేసి వచ్చాను నువ్వు తిను అని బతిమలాడి మరీ తినిపిస్తాడు. మీనా కంచం లాక్కుని తినేస్తుంటుంది.. మీనా మీనా అన్నం తక్కువ ఉందని చెప్పి తిన్నానని అబద్ధం చెప్పాను. కూరవాసన ఘుమఘుమలాడిపోతోంది నాక్కూడా పెట్టు అంటాడు బాలు. ఇంతలో మీనా లోపలకు వెళ్లి హాట్ బాక్స్ లో ఉంచిన అన్నం తీసుకొచ్చి వడ్డిస్తుంది. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేను ఎలా తినిపించానో..నువ్వు కూడా అలానే తినిపించు అంటాడు. బాలు మళ్లీ మళ్లీ క్షమాపణలు చెబుతాడు.
మనోజ్ పూజగదిలో పూజలు చేయడం చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. అయితే మనోజ్ చేసిన పూజలు దేవుడికి కాదు తన తల్లి దిష్టి ఫొటోకు కావడం అసలు విషయం. నీకు ఏమైంది..ఈ ఫొటో కానీ ఇంట్లోవాళ్లు చూస్తే పెద్ద గొడవ అవుతుంది అంటుంది రోహిణి. ఈ విషయం తెలియని ప్రభావతి..కొడుకులో వచ్చిన మార్పు చూసి మురిసిపోతుంటుంది. నా కొడుకు అందరికన్నా మరింత ఎత్తుకి ఎదగాలని దీవిస్తుంది. అదే సమానికి బాలు ఇంట్లోకి వచ్చి.. ఏంటీ పొగ ఏదైనా ప్రమాదం జరిగిందా అనుకుంటాడు. నాక్కూడా దేవుడిపై విశ్వాసం పెరిగింది అంటాడు మనోజ్. ఇప్పటికే కొంత డబ్బు రెడీ అయింది..త్వరలోనే అడ్వాన్స్ ఇస్తానని చెబుతాడు. అత్యాశకు పోవద్దని సత్యం హెచ్చరిస్తాడు కానీ మనోజ్ పట్టించుకోడు.
3 కోట్లు ఎలా తెస్తారని సత్యం అడిగితే.. మొత్తం ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు ముందుగా 30 లక్షలు ఇస్తే చాలు అంటాడు. అవైనా ఎలా తెస్తారని అడుగుతాడు సత్యం. ముంబై ముఖేష్ ఇచ్చిన డబ్బుల్లో 5 లక్షలు ఉన్నాయి.. అవి అడ్వాన్స్ గా ఇస్తాం అంటాడు. అత్యాశకు పోవద్దు ఏదో తేడాగా ఉందని అంటారు బాలు, రవి, సత్యం.. కానీ మనోజ్-రోహిణి తగ్గరు. వెళ్లి ఓనర్ కి అడ్వాన్స్ ఇచ్చి వస్తాం అంటారు. ఇంతలో మీనా తుమ్ముతుంది. కావాలనే తుమ్మావ్ కదా అని ప్రభావతి, రోహిణి నిందలేస్తారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ కూడా వరుసగా తుమ్ముతుంటారు. ఎండుమిరపకాయల వల్లే ఇదంతా జరిగిందని సత్యం చెప్పడంతో నవ్వుతారంతా. మీనా మనసులో ఏదో అనుమానం వస్తుంది..
Author : RAMA

