Dailyhunt
Gunde Ninda Gudi Gantalu April 9th Episode: మీనాపై మరో నింద, శ్రుతి రవి మధ్య చిచ్చు పెట్టేసిన నీతూ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 9 ఎపిసోడ్

Gunde Ninda Gudi Gantalu April 9th Episode: మీనాపై మరో నింద, శ్రుతి రవి మధ్య చిచ్చు పెట్టేసిన నీతూ - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 9 ఎపిసోడ్

ABP దేశం 1 week ago

Gunde Ninda Gudi Gantalu 2025 April 9th Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు ఏప్రిల్ 9ఎపిసోడ్

శివ తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసినప్పటి నుంచి మరింత రెచ్చిపోయి విరుచుకుపడుతున్న ప్రభావతి నోటికి మరోసారి చిక్కింది మీనా.

కామాక్షి ఇంటికి పూలు ఇచ్చేందుకు వెళుతుంది. డబ్బులు తీసుకోమ్మా అని కామాక్షి అనగానే..పిన్ని మీరు నేను వేరు కదా ఒకే కుటుంబం అంటుంది మీనా.అవును వాళ్లు హ్యాండ్ బ్యాగులు లాక్కెళ్లి డబ్బులు తీసుకుంటారు ఇలా ఇస్తే ఎందుకు తీసుకుంటారని నోరుపారేసుకుంటుంది ప్రభావతి. కూర్చోమ్మా కాసేపు కాఫీ తాగివెళ్లొచ్చు అంటుంది కామాక్షి. నేను వచ్చి ఇంతసేపు అయింది నన్ను అడిగావా అని ప్రభావతి అనగానే.. నేను ఇస్తే మీనా పెట్టినట్టు లేదంటావ్ కదా అని రిప్లై ఇస్తుంది కామాక్షి. సరే పిన్ని నేను కాఫీ పెట్టి తీసుకొస్తాలే అనేసి వంటగదిలోకి వెళుతుంది మీనా.

ప్రభావతి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్ తల్లి వచ్చి తనని తాను పరిచయం చేసుకుని తాను చీరల వ్యాపారం చేస్తున్నానని చీరలు చూపిస్తుంది. ఓ చీర నచ్చడంతో ఇదెంత అనగానే 45వేలు అని చెబుతుంది. ఆలోచనలో పడిన ప్రభావతి తన దగ్గర ఎలాగూ 2 లక్షలు ఉన్నాయి కదా.. (శివ కేసు వాపస్ తీసుకునేందుకు లాయర్ నుంచి తీసుకున్నవి) ఆ డబ్బుతో చీర కొనుక్కోవాలని ఫిక్సవుతుంది. వెళ్లి ఆ డబ్బులు తీసుకురమ్మని కామాక్షికి చెబుతుంది. ఇంతలో కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చిన మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కోపంగా ఇంటికి వచ్చిన శ్రుతిని కూల్ చేసే పనిలో పడతాడు రవి. నీతూ కూడా మరింత ఆజ్యం పోయడంతో రవి మాటలు వినిపించుకోదు శ్రుతి. అసలు తనకు అబద్ధం చెప్పి అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీస్తుంది, నువ్వు చేసిది సహాయం అయినప్పుడు నాకు చెప్పి ఉండాల్సింది కదా? నువ్వు మోసం చేస్తున్నావ్ కాబట్టే అబద్ధం చెప్పావంటూ విరుచుకుపడుతుంది. ఈ గొడవ ఇక్కడితో ఆగేలా లేదు..

కిచెన్లో డబ్బాలో దాచిన డబ్బులు తీసుకొచ్చేందుకు వెళ్లిన కామాక్షి కంగారుగా వచ్చి...వదినా అక్కడడబ్బుల్లేవు అని చెబుతుంది. ఏమైయ్యాయ్.. ఇంకేముంది ఇప్పుడే కదా అది ఆ దొంగ శివ వాళ్ల అక్క కిచెన్లోకి వెళ్లింది అదే కొట్టేసి పోయి ఉంటుందనే నింద వేసేస్తుంది. కామాక్షికి ఏమీ అర్థంకాదు. మీనా అలాంటి పనులు చేయదు అని చెబుతుంది. కానీ ప్రభావతి మాత్రం ఆవేశంతో ఊగిపోతుంది. 2 లక్షల గురించి బయటపడితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సి వస్తుందనే భయం..బయట పడకపోతే ఆ డబ్బులు తిరిగి రావనే ఆలోచనలో ఊగిసలాడుతుంది ప్రభావతి. ఆ డబ్బు కామాక్షివే అని అబద్ధం చెప్పి మీనాపై విరుచుకుపడుతుంది.

వాస్తవానికి ఆ డబ్బులు కామాక్షి ఇంట్లోంచి కొట్టేసిన రోహిణి.. గుణకి తీసుకెళ్లి ఇచ్చింది. డబ్బుల సంగతి రోహిణికి చెప్పినట్టు కామాక్షి బయటపడదు.. ఆ విషయం వదినకు తెలిస్తే చంపేస్తుందని భయపడుతుంది. ఆ సంగతి బయటపడితే అప్పుడుంటుంది. మరోవైపు రోహిణి మాత్రం హమ్మయ్య ఈ నింద మీనాపైకి వెళ్లిపోయిందిలే అని సంతోషిస్తుంది. విద్య మాత్రం బాధపడుతుంది

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam