Gunde Ninda Gudi Gantalu 2025 MAy 5th Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు మే5 ఎపిసోడ్
ఇంట్లో అందరూ ఒకలా ఉంటే వాళ్లిద్దరూ మాత్రం అలా బిహేవ్ చేస్తారెందుకు అంటుంది శ్రుతి.
వాడు మొదట్నుంచి అంతే వాడి స్వార్థం వాడిదే అంటాడు రవి. బాలు మాత్రమే కరెక్టుగా మాట్లాడుతున్నాడు..పెళ్లైన కొత్తలో నేను బాలుని అపార్థం చేసుకున్నాను కానీ తనని అర్థం చేసుకున్నాక కరెక్ట్ అనిపిస్తోంది అంటుంది రోహిణి. ఇంతలో మనోజ్-రోహిణి రావడం చూసి...మీ అన్నయ్య నిన్ను కన్వీన్స్ చేసేందుకు వస్తున్నాడు నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు అని ముందే చెబుతుంది శ్రుతి.
మనోజ్ రోహిణి వచ్చి రవి ఆ డబ్బులు నువ్వే అడ్జెస్ట్ చేయి అని రిక్వెస్ట్ చేస్తాడు. నేనెక్కడి నుంచి తీసుకొచ్చేదని అడుగుతాడు రవి. మీ మావయ్య వాళ్లని అడుగు అంటాడు. నేను ఇల్లు వదిలి వచ్చేసి రవిని పెళ్లి చేసుకున్నాను..నాకు వాళ్లను అడిగే హక్కు లేదంటుంది శ్రుతి.పోనీ వడ్డీ ఇస్తాం అంటుంది రోహిణి. కుదరదు అని తేల్చి చెబుతుంది శ్రుతి. రవి నువ్వైన అర్థం చేసుకో..నీక్కూడా నేను ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాను అంటాడు. అసలు నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేశావా? చిన్నప్పటి నుంచి బాలు అన్నయ్య నాకు అన్నీ కొనిచ్చేవాడు, చదువుకునేందుకు హెల్ప్ చేసేవాడు..నువ్వు ఎప్పుడైనా చేశావా అని రవి నిలదీస్తాడు. నీకోసం నా అత్తింటివారిని ఎందుకు డబ్బులు అడగాలి అంటాడు రవి.
వీళ్లను అన్నదమ్ములు అని చెప్పుకోవడమే తప్పు అంటాడు మనోజ్. మనం కూడా ఈ ఇంట్లో మనుషులమే కదా మన సంతోషం వాళ్ల సంతోషం అనుకోవచ్చు కదా...ఒకరు కాకపోయినా మరొకరు అనుకోవచ్చు కదా..ఎవ్వరిక మనలా సంపాదించడం చేతకాదు మనోజ్ అందుకే మనపై పడి ఏడుస్తున్నారంటూ మరింత ఆజ్యం పోస్తుంది రోహిణి. నేను ఏ పనీ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు బాలు, రవి నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. ఇప్పుడు మనం బాగా సంపాదించడం..ఇలాంటి విల్లా కొనుగోలు చేయడం చూసి తట్టుకోలేకపోతున్నారు అంటాడు మనోజ్. ఎదో దారి కనిపిస్తుంది.. తప్పకుండా ఈ విల్లా మనం కొనుగోలు చేసి తీరుతాం అంటుంది మనోజ్. నీ అన్నదమ్ములే కాదు..మీ అమ్మా నాన్న కూడా నిన్ను దూరం పెట్టినా నీకు నేనుంటాను అంటుంది రోహిణి. ఇన్నాళ్లూ వాళ్ల గురించి ఆలోచించి తప్పుచేశాం..ఇకపై మనిద్దరం మనగురించి ఆలోచించుకుందాం అంటుంది రోహిణి. నువ్వు మీనాన్న వైపు ట్రై చేయి అంటాడు మనోజ్. అది కుదరదు అని తేల్చి చెప్పేస్తుంది రోహిణి. మన బిజినెస్ పార్టనర్ ముఖేష్ ని డబ్బులు అడుగుదాం అని ఫిక్సవుతాడు మనోజ్.
ఇల్లు చాలా బావుంది కదా మీనా..నీకు ఎలాంటి ఇల్లంటే ఇష్టం అని బాలు అడుగుతాడు. ఈ ఇల్లు బావుంది కానీ..నాకు ఇలాంటి ఇల్లంటే ఇష్టం ఉండదంటూ.. చిన్న ఇల్లు, నచ్చిన వాళ్ల మధ్య సంతోషంగా ఉండాలి. మనుషులు సంపాదించడం మొదలుపెట్టాక గోడలు పెరిగాయ్ , అదృష్ట వసాత్తూ మనిల్లు అలాగే ఉంది కానీ ఆ అడ్డగాడిదకు అర్థంకాలేదంటాడు బాలు. వాళ్లు అలా అడుగుతున్నప్పుడే నాకు వళ్లు మండిందండీ అంటుంది మీనా. వాడి కోసం మా నాన్న ఎంతో చేశాడు , మా అమ్మ వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగింది...వాడికి అది అర్థం కాలేదు అంటాడు బాలు. అత్తయ్య ఇల్లు ఇచ్చేస్తానంటే మావయ్య కూడా ఇక్కడికి రావాల్సిందేనా అని మీనా అడిగితే...మా నాన్న ఆ ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లడు అంటాడు బాలు. నేను నాన్న ఆ ఇంట్లో ఎంతోకాలం ఉండాలి..నాకైనా నాన్న, నువ్వు తప్ప ఎవరున్నారు అంటాడు బాలు. తనకు మండువా లోగిళ్లు ఉన్న ఇల్లంటే ఇష్టం అంటుంది మీనా. ఇంతలో కల్పన నుంచి కాల్ వస్తుంది..నేను రేపు ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి వస్తున్నా పిక్ చేసుకుంటావా అంటుంది కల్పన.
మరోవైపు రవి-శ్రుతి కబుర్లు చెప్పుకుంటారు. నీకు ఎలాంటి ఇష్టం అని రవి అడిగితే.. నాకు ఇంత పెద్ద ఇల్లు అంటే ఇష్టం లేదంటుంది శ్రుతి. విల్లా కన్నా నా చుట్టూ సందడిగా ఉండాలి అంటుంది..అందుకే గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ తీసుకుంటే బెటర్ అనిపిస్తోంది. మీ అమ్మా నాన్న తర్వాత ఆ ఇల్లు నీకే వస్తుంది కదా అని రవి అంటే.. ఆ ఇల్లు ఏం చేద్దామో ఆలోచించు నీక్కూడా ఈక్వెల్ రైట్స్ ఉన్నాయ్ కదా అంటుంది.
Author : RAMA

