Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gundeninda Gudigantalu August 30th:రాఖీ కట్టడానికి చెల్లి వస్తుందని ఆశపెట్టుకున్న బాలు...వెళ్తే కాళ్లు విరగ్గొడతానని మౌనికకు భర్త వార్నింగ్

Gundeninda Gudigantalu August 30th:రాఖీ కట్టడానికి చెల్లి వస్తుందని ఆశపెట్టుకున్న బాలు...వెళ్తే కాళ్లు విరగ్గొడతానని మౌనికకు భర్త వార్నింగ్

ABP దేశం 2 weeks ago

Gunde Ninda Gudi Gantalu: స్టార్మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది.అన్నయ్యలకు రాఖీలు తెప్పించినందుకు మౌనిక భర్త అమెను తిట్టి బయటకు వెళ్లావంటే అంతు చూస్తానని బెదిరిస్తాడు.

అటు చెల్లి తప్పకుండా వస్తుందని బాలు ఆశగా ఎదురుచూస్తుంటాడు. బాలు బాధ చూడలేక మీనా మౌనికకు ఫోన్ చేసి అడగ్గా...ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవని చెబుతుంది.
రాఖీలు చెత్తబుట్టలో వేసిన మౌనిక భర్త
అన్నయ్యలకు రాఖీలు కట్టేందుకు మౌనిక ఆన్లైన్లో రాఖీలు తెప్పించగా...వాటిని చూసిన ఆమె భర్త అగ్గిమీదగుగ్గిలం అవుతాడు. నాకు చెప్పకుండా ఎందుకు తెప్పించావని తిడతాడు. మా అన్నయ్యలకు రాఖీ కట్టేసి వెంటనే వచ్చేస్తానని చెబుతుంది. అయినా సరే ఆబాలుగాడు ఉన్నఇంటికి వెళ్లడానికి వీళ్లేదని తెగేసి చెబుతాడు. నువ్వు వెళ్లావంటే చంపేస్తానని బెదిరిస్తాడు. రాఖీలు చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తుండగా మౌనిక వాటిని లాక్కుంటుంది.దీంతో ఆమె భర్త తోసివేయగా...కిందపడిపోతున్న మౌనికను ఆమె అత్తయ్య వచ్చి పట్టుకుంటుంది. అన్నాచెల్లళ్లను విడదీసి పాపం చుట్టుకోవద్దని కొడుక్కి బుద్ధి చెబుతుంది. ఆ బాలుగాడు, నేను ఎవరో ఒకరు మాత్రమే బతికి ఉన్నప్పపుడే ఇది ఆ ఇంటికి వెళ్తుందని కొడుకు చెబుతాడు. నాకు తెలియకుండా ఇది ఆ ఇంటికి వెళ్లినా...వాళ్లు ఇక్కడికి వచ్చినా దీనికి రేపే ఆఖరిరోజు అవుతుందని హెచ్చరిస్తాడు. దీంతో మౌనిక ఏడుస్తూ ఉండిపోతుంది. వాడుఇంట్లో లేని సమయం చూసి నేను మీ ఇంటికి పంపిస్తానని అత్త చెబుతుంది. ఆయన కోపం గురించి మీకు తెలుసు కదా అత్తయ్య నేను రాఖీ కట్టిన సంగతి తెలిస్తే అస్సలు ఒప్పుకోరని అంటుంది.
చెల్లికోసం బాలు ఎదురుచూపులు
చెల్లిరాకకోసం బాలు చాలా ఆశగా ఎదురుచూస్తుంటాడు.నిద్రపోతున్న మీనాను లేపి రేపు మౌనిక వస్తుందని తన కోసం క్యారెట్ హల్వా చేయాలని చెబుతాడు.మీరు ఇక్కడ ఇంత ఆరాటపడుతున్నారు కానీ....అసలు ఆ ఆ ఇంట్లో మౌనికను పంపించడానికి ఒప్పుకుంటారో లేదోనని మీనా అంటుంది. నా చెల్లికి చిన్నప్పటి నుంచి తనంటే ఎంతో ఇష్టమని...మా అమ్మ నేను పెద్దవాడిని అయ్యేవరకు కూడా నాకు మా చెల్లిని చూపించలేదని....కనీసం రాఖీ కూడా కట్టించలేదని చెప్పి బాధపడతాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ ఏరోజూ నాకు అన్నం పెట్టలేదని...మా చెల్లి ఎంతో ప్రేమగా నన్ను చూసుకుందని చెబుతాడు.

మౌనికకు ఫోన్ చేసిన మీనా
మౌనిక రాకపోతే బాలు ఏమైపోతాడోనని భయపడిన మీనా వెంటనే వెళ్లి మౌనికకు ఫోన్ చేస్తుంది. నువ్వు తప్పకుండా వస్తావని మీ అన్నయ్య చాలా ఆశగా ఎదురుచూస్తున్నాడని చెబుతుంది. దీంతో మౌనిక ఇంట్లో జరిగిన గొడవ గురించి మీనాకు చెబుతుంది.నేను ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి రాలేనని అన్నయ్యకు అర్థమయ్యేలా చెప్పమని చెబుతుంది. దీంతో నేను చూసుకుంటానని నువ్వు అక్కడ గొడవలు ఏం పెట్టుకోవద్దని చెబుతుంది. బాలు దగ్గరకు వెళ్లి మీనా వచ్చినా రాకపోయినా నువ్వు బాధపడొద్దని చెబుతుంది. రాఖీ కడితేనే ప్రేమ ఉన్నట్లు కాదని అతన్ని సముదాయిస్తుంది.
మనోజ్కు రోహిణి ఇంగ్లీష్ ముద్దు
మనోజ్ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి టిఫిన్ కోసం ఎదురుచూస్తుంటాడు. మీనా రాగానే టిఫిన్ అడుగుతాడు.కిచెన్లో ఉందని మీ ఆవిడను పిలిచి పెట్టించుకోమని చెబుతుంది. దీంతో రోహిణి వచ్చి టిఫిన్ పెడతానని అనగా...అవసరం లేదని నేనే పెట్టుకుంటాని వెళ్లి తెచ్చుకుంటాడు. దోస తింటుంటే కారం కంట్లోపడుతుంది.దీంతో రోహిణి మనోజ్ కళ్లలో ఊదుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి వాళ్లిద్దరూ ముద్దుపెట్టుకుంటున్నారని భావించి గట్టిగా అరిచి అందరినీ పిలిచి గోలచేస్తుంది.

Author : Ajay Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam