Gunde Ninda Gudi Gantalu: స్టార్మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది.
సుందరి నగలు పట్టుకున్న బాలు,మీనాకు సన్మానం చేయడానికి వచ్చి మేక మాణిక్యం వాళ్లకు దొరికిపోతాడు. అతన్నితీసుకుని ఇంటికి వెళ్లిన బాలు..రోహిణి గుట్టు
బయటపెడతాడు.అప్పటికీ రోహిణీ తప్పించుకునేందుకు అబద్ధాలు ఆడటంతో ప్రభావతికి కోపం వచ్చి పెద్దకోడలు చెంపపగులగొట్టడంతో ఈరోజు ఎపిసోడ్ అదిరిపోతుంది.
అడ్డంగా దొరకిపోయిన మాణిక్యం
సుందరి పెళ్లిలో నగలు దొంగిలించడానికి ప్రయత్నించిన దొంగలను పట్టుకుని నగలు కాపడటంతో ఈ విషయం రంగరావు మాణిక్యానికి చెబుతాడు.వాళ్లకోసం మంచి స్వీట్లు తీసుకుని రమ్మని చెబుతాడు.ఇంతపెద్ద సాయం చేసినవారికి స్వీట్లు ఇస్తే ఏం బాగుంటుంది. నేను వాళ్ల కోసం మంచి సన్మాన కార్యక్రమం పెడతానంటూ చెప్పి రెండు దండలు తీసుకుని వాళ్లను సన్మానించడానికి బ్యాండ్ మేళంతో ఎగురుకుంటూ వస్తాడు. మాణిక్యాన్ని చూసిన బాలు, మీనా షాక్ తింటారు. దగ్గరకు రాగానే బాలును గుర్తుపట్టి మాణిక్యం కూడా నిర్ఘాంతపోతాడు. ఇతనే పెళ్లికొడుకు మేనమామ అని....ఈ ఊరిలోనే మటన్ కొట్టు నడుపుతున్నాడని...అందుకే అందరూ మటన్కొట్టు మాణిక్యం అని పిలుస్తుంటారని రంగారావు పరిచయం చేస్తాడు. దీంతో ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటారు. పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండీ ఆయనే చూసుకున్నాడని వివరిస్తాడు. దీంతో దొరికిపోయానని అనుకున్న మాణిక్యం ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన ఈ మాణిక్యం మామను మా ఇంటికి కూడా తీసుకెళ్లి అందరికీ పరిచయం చేస్తానని బాలు తీసుకెళ్తాడు.
రోహిణి తప్పించుకునే యత్నం
బాలు ఇంటికి వెళ్లేసరికి ప్రభావతి మీనాను పొగిడినందుకు తిట్టుకుంటూ ఉంటుంది. మీనా కూడా నీ కోడలే కదా అని సత్యం అనగా...మలేషియాలో పుట్టిపెరిగిన మా పెద్దకోడలు, పూలమ్ముకునే దానికి పుట్టిన ఈ మీనా ఒక్కరేనా అని అంటుంది. అసలు వాళ్ల స్థాయి ఏంటి...దీని స్థాయి ఏంటని అంటుంది.అప్పుడే మీనా, బాలు ఇంట్లోకి అడుగుపెడతారు. బాలు కేకలు వేసి అందరినీ కిందకు పిలుస్తాడు. హాయిగా నిద్రపోతుంటే ఏంటిరా ఈ గొడవ అని మనోజ్ అంటాడు. అయినా ఇలాంటి చీఫ్వాళ్లు పిలిస్తే మనం రావడమేంటని రోహిణి అంటుంది.ఇంకొక్క మాట అన్నావంటే చెంపపగులుతుందని మీనా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతారు.ఇదేంటి మీనా ఇలా మాట్లాడుతుందని అనుకుంటారు.ఇంతలో బాలు మాణిక్యాన్ని లోపలికి ప్రవేశపెట్టగానే...ప్రభావతి మలేషియా మాణిక్యంగారు ఎప్పుడొచ్చారని అడుగుతుంది. మా రోహిణి వాళ్ల నాన్న కేసుు గెలిచారా...? కోట్లు తీసుకుని వచ్చారా అని ఆశపడుతుంది..? అప్పటికీ కూడా రోహిణి మాయ చేయాలని చూస్తుంది...మీరు వెళ్లి మీ హోటల్లో ఉండండి మామయ్య...నేను వచ్చి మాట్లాడతానని అంటుంది. ఇంకా ఎందుకు బుకాయిస్తావని అంటాడు. వీడు మలేషియా మామయ్య కాదని...మటన్కొట్టు మాణిక్యమని చెబుతాడు. మీరు ఎదో పొరబడుతున్నారని రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేసినా...మాణిక్యం అన్ని విషయాలు చెప్పేస్తాడు.నాకు కొంచెం నాటకాల పిచ్చి ఉందని...విద్య వచ్చి మంచి వేషం ఉందని చెబితే రోహిణి వాళ్ల మామయ్యలా నటించానని అంటాడు. దాన్ని కప్పిపుచ్చడానికే రోహిణి చెప్పినప్పుడల్లా వచ్చి నటించి వెళ్లేవాడినని అని చెబుతాడు. ఇప్పటికైనా ఇంట్లో వాళ్లకు నిజం చెప్పమని చెప్పి వెళ్లిపోతాడు.
పెద్ద కోడలు చెంప పగులగొట్టిన ప్రభావతి
ఇప్పుడు చెప్పండి అత్తయ్యగారు...నా స్టేటస్ ఏంటో, మీ పెద్దకోడలు స్టేటస్ ఏంటోనని మీనా ప్రభావతిని నిలదీస్తుంది. మేం ఉన్నది ఉన్నట్లు చెప్పి గౌరవంగా బతికినోళ్లమని...మీ కోడలిలా అబద్ధాలు చెప్పి లేని తండ్రిని చంపి అస్తికలు కూడా గంగలో కలిపించలేదని చెబుతుంది. ఇంట్లో ఉన్న భార్య చేస్తున్న మోసం కూడా కనిపెట్టలేనోడికి నీకు ఎందుకురా అన్ని డిగ్రీలు అని మనోజ్ను బాలు తిడతాడు. రోహిణి ఇంత మోసం చేస్తుందని ఊహించలేదని అంటాడు. అయినా నేను ఏం తప్పుచేశానని అందరూ నన్ను అదోలా చూస్తున్నారని...నేను ఏమైనా ఈ ఇల్లు అమ్మించి కోట్లు దండుకున్నానా అని అనడంతో ప్రభావతి కోపంతో రెచ్చిపోతుంది. పెద్దకోడలిని చిన్న మాట కూడా అనని ప్రభావతి పిచ్చికొట్టుడు కొడుతుంది.అబద్ధాలు చెప్పి మోసాలు చేసిందేగాక....మళ్లీ దబాయిస్తున్నావా అని కోప్పడటంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.
Author : Ajay Kumar

