Gunde Ninda Gudi Gantalu July Episode 02 Telugu Serial - గుండెనిండా గుడిగంటలు జూలై 02 ఎపిసోడ్
గుండెనిండా గుడిగంటలు " href="https://telugu.abplive.com/search?s=%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%86%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE" target="_self"> గుండెనిండా గుడిగంటలు జూలై 02 గురువారం ఎపిసోడ్ లో రోహిణి కొత్త అవతారమెత్తింది.
బాలు మీనాలో అనుమానం మరింత బలపడింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది..నేను వెళ్లాలి అంటాడు సత్యం. బాలు మీనా ఇద్దరూ వెళ్లి సత్యాన్ని డ్రాప్ చేసి..గుడికి వెళ్లి వస్తాం మిమ్మల్ని తీసుకెళతాం అని చెబుతారు. ఇంతలో మనోజ్ కార్లోంచి సుగుణమ్మ, చింటూ దిగడం చూస్తారు. వీడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తాడా అనుకుంటారు. అదే విషయం సుగుణమ్మని అడిగితే..తప్పించుకునేలా సమాధానం చెబుతుంది. ఈవిడ ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతోంది అనుకుంటారు.గతంలో పిల్లాడిని స్కూల్లో ఆమె చేర్పించిందని చెప్పారు..ఇప్పుడు మళ్లీ దుబాయ్ లో ఉందంటున్నారు అనుకుంటారు. స్కూల్లో టీచర్స్ పిలుస్తున్నారు వెళతాను అనేసి వెళ్లిపోతుంది.
02-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
మీటింగ్ రూమ్ లో పేరెంట్స్ ని రిసీవ్ చేసుకుని... స్టూడెంట్స్ యాక్టివిటీస్ గురించి నోట్ చేసుకుంటాడు సత్యం. ఇంతలో సుగుణమ్మ వచ్చి చూసి.. ఈయన ఇక్కడున్నారేంటని టెన్షన్ పడుతుంది. ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నారు టీచర్ పిలుస్తారు లెండి అని ధైర్యం చెబుతాడు సత్యం.
రోహిణి వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యేందుకు మాస్క్ వేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని, విగ్గు పెట్టుకుంటుంది. ఏంటే ఈ అవతారం అని విద్య అడిగితే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది..నేను తప్పని సరిగా అటెండ్ అవ్వాలి అన్నారు..అందుకే వీడియో కాల్ లో కనెక్ట్ అవుతా అంటుంది. రూపం మార్చావ్..నీ వాయిస్ వింటే గుర్తుపట్టరా అని అడుగుతుంది...అందుకే నేను కనిపిస్తాను, నువ్వు డబ్బింగ్ చెప్పు అని విద్యతో చెబుతుంది. అలా వీడియో కాల్ లో కనెక్ట్ అవుతుంది. ఇద్దరూ కలసి అనుకున్న ప్లాన్ ప్రకారం పేరెంట్ టీచర్ మీటింగ్ పూర్తిచేస్తారు. అయితే చింటూ మాత్రం..ఏంటి అమ్మ ఇలా ఉన్నావ్? మా అమ్మలా లేవు అంటాడు. సుగుణమ్మ కంట్రోల్ చేస్తుంది.
జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే పిల్లలు బుద్ధి, చదువు, మాటలపై తీవ్ర ప్రభావం ఉంటుందా? పరిహారాలేంటి?
స్కూల్ నుంచి బయటకు వచ్చిన చింటూ సుగుణమ్మను చూస్తారు బాలు మీనా. అమ్మో వీళ్లు ఇక్కడే ఉన్నారు ఏం అడుగుతారో ఏమో అనుకుంటుంది. చింటూ మాత్రం ఆప్యాయంగా పలకరిస్తాడు. మా అమ్మ వీడియో కాల్ చేసింది అంకుల్..కానీ ఎప్పుడూ లేనట్టుగా ఉంది.. మాస్క్ పెట్టింది, కళ్లద్దాలు పెట్టింది,జుట్టు కట్ చేసింది అని చెబుతాడు. అదేంటి అని షాక్ అవుతారు బాలు మీనా.. ఆమెకు ఆరోగ్యం బాలేదని కవర్ చేస్తుంది సుగుణమ్మ. హోటల్ కి వెళ్లి ఏదైనా తిందాం అని అడిగితే..వద్దు బాబు అని కఠవుగా చెప్పేసి వెళ్లిపోతుంది.
ఉదయం మనోజ్ కార్లో చింటూని తీసుకురావడం చూస్తుంటే..ఏదో రహస్యం ఉందంటుంది మీనా. మనోజ్-కల్పనకి పుట్టినవాడేమో చింటూ అని మీనా అనుమానపడుతుంది. ఇది కూడా నిజమే అనిపిస్తోంది అంటాడు బాలు. ఆ తర్వాత సత్యాన్ని తీసుకుని ఇంటికి వెళతాడు. అప్పుడే మేడపై నుంచి వచ్చిన శ్రుతి ఫోన్ చూస్తూ ప్రభావతిని గుద్దేసి పడిపోతుంది. ఆకు వెళ్లి ముల్లుపై పడినా..ముల్లు వెళ్లి ఆకుపై పడినా ఆకుకే నష్టం అంటూ శ్రుతిపై జాలి చూపిస్తాడు బాలు. ఈ కాలంలో అందరూ ఫోన్లలోనే ఉండిపోతున్నారు అంటాడు రవి. అవును అన్నీ అరచేతిలోనే అన్నట్టుంది.. ఈ రోజు స్కూల్లో ఓ విచిత్రం జరిగిందని చెబుతాడు సత్యం. చింటూ వాళ్లమ్మ వీడియో కాల్ చేసింది...వెరైటీగా మాస్క్ పెట్టుకుని కనిపించిందని అనుమానం వ్యక్తం చేస్తాడు. వాడి తండ్రి ఎందుకు రాలేదో అని మీనా అడుగుతుంది..ఏదైనా పని ఉందేమో అని మనోజ్ చెబుతాడు. నీకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టవు కదా నీకెందుకు అంత ఆసక్తి అని అడుగుతాడు బాలు. ఆ పనికిమాలిన కుటుంబం గురించి వదిలేయండి అని ఫైర్ అవుతుంది ప్రభావతి. ఆవిడకు మొగుడు లేడు, ఆ పిల్లాడికి తల్లి ఉన్నా ఇక్కడ ఉండదు...అది ఇంకెవడినో పెళ్లి చేసుకుని సెటిలైపోయి ఉంటుంది అంటుంది ప్రభావతి. రోహిణి తన బాధ బయటపడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది.
ఈ తేదీల్లో పుట్టినవారితో శత్రుత్వం పెట్టుకుంటే మీకే ప్రమాదం!
మీ అన్నయ్యకి-కల్పనకి పుట్టినవాడే చింటూ అనే అనుమానం ఉంది.. వాళ్లు చెబుతుంటారు కదా వాళ్లమ్మ విదేశాల్లో ఉందని..ఇదే నిజం అనిపిస్తోంది అంటుంది. ఇంకా మనోజ్-కల్పన మధ్య సంబంధం అలానే ఉంది అంటుంది మీనా. వాడికంత సీన్ లేదని బాలు కొట్టిపడేస్తాడు. చింటూ గురించి పూర్తి నిజం తెలుసుకోవాలి..అప్పుడే అసలు రహస్యం బయటపడుతుంది అనుకుంటారు బాలు మీనా...
పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
Author : RAMA

