గుండెనిండా గుడిగంటలు సీరియల్: స్టార్మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు చాలా ఫన్నీగా సాగుతుంది.
కొత్త డైట్లో శృతి ఆముదం కలపడంతో ప్రభావతి, మనోజ్కు రాత్రంతా విరేచనాలతో పరుగులు తీస్తారు. దీంతో వారికి కషాయం కలిపి ఇచ్చి మీనా విరోచనాల తగ్గిపోయేలా చేస్తుంది. మరోవైపు గుడికి వచ్చిన అరుణ్....సుమతి పెళ్లిచేసుకోవాలని ప్రపోజ్ చేస్తాడు.అదే గుడికి మీనాతో వచ్చిన బాలు...మరోసారి అరుణ్తో గొడవపడటంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది.
ప్రభావతి, మనోజ్ కడుపులో గోదావరి పరుగులు
మీనా తయారు చేసిన డైట్ఫుడ్లో ఆమెకు తెలియకుండానే ఆలీవ్ ఆయిల్ బదులు శృతి ఆముదం కలుపుతుంది. ఈ డైట్ఫుడ్ తిన్న ప్రభావతి, మనోజ్కు అర్థరాత్రి నుంచి కడుపులు గుడగుడ మొదలవుతుంది. ఒక్కసారిగా గట్టు తెగిన గోదావరిలో మెలికలు తిరిగుతూ బాధపడిపోతారు. విరోచనాలు అవ్వడంతో బాత్రూమ్కు వెళ్లి వస్తుంటారు. రాత్రంతా నిద్రలేకుండా జాగారం చేస్తుండటంతో అందరూ నిద్రలేచి ఏం జరిగిందని అడుగుతారు. కొత్త డైట్ వికటించిందని చెప్పడంతో బాలు వాళ్ల అన్నను, అమ్మను బాగా ఏడిపిస్తాడు. బాత్రూమ్లో నీళ్లు అయిపోతే మోటారు వేయకుండా ఆటపట్టిస్తాడు. ఇంకాస్తా లేట్ అయితే ప్రాణాలకే ప్రమాదమని వెంటనే డాక్టర్ను తీసుకొద్దామని బాలు వాళ్ల నాన్న చెబితే... నేను మా అమ్మను అడిగి ఏదైనా చిట్కా ఉందేమో కనుక్కుంటానని మీనా వంటగదిలోకి వెళ్తుంది.
మీనా వాళ్ల అమ్మకు ఫోన్ చేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన శృతి తానే ఆ ఫుడ్లో ఆముదం కలిపానని చెప్పడంతో మీనా కోప్పడుతుంది.ఎందుకు ఇలాంటి పనిచేశావని నిలదీస్తుంది.వాళ్లంతా నిన్ను తిట్టి నీతో పనులు చేయించుకుంటుంటే చూడలేక ఇలా చేశానని అంటుంది. దీంతో వెంటనే మీనా దానికి విరుగుడు కషాయం కలిపి ఇద్దరికి ఇస్తుంది. కొంత తగ్గిన వెంటనే మళ్లీ ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కలిసి మీనాపై పడిపోతారు. నవ్వు చేసి ఇచ్చిన ఫుడ్ తినే ఇలా అయ్యిందని ఆమెపై మండిపడతారు. దీంతో మీనా వాళ్లిద్దరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తుంది. మీరు చెప్పినవి చెప్పినట్లే నేను చేశానని...అయినా మీకు ఫుడ్ పడకపోతే నాది తప్పా అని మండిపడితుంది. ఇంతలో బాలు కలుగజేసుకుని చూశావా నాన్న....కొంచెం ఓపిక వచ్చేసరికి మళ్లీ ఎలా మాట్లాడుతున్నారో అంటాడు. అసలు మీకు కషాయం కలిపి ఇవ్వడం తప్పని వాళ్ల అమ్మమీద మండిపడతాడు.అసలు ఈ వయసులో పెట్టింది తినకుండా నీకు డైట్ అవసరమా అని అరుస్తాడు. ఇప్పుడు నువ్వు సన్నబడి ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.శృతి కూడా వాళ్ల అమ్మ, అన్నయ్యపై మండిపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సుమతికి మనసులో మాట చెప్పిన అరుణ్
అరుణ్ తన తల్లిని తీసుకుని గుడికి వస్తాడు. అక్కడ సుమతి, వాళ్ల అమ్మను చూసి సంతోషిస్తాడు. మీరు సాయం చేయడం వల్లే మా అమ్మ చాలా త్వరగా కోలుకుందని సుమతికి అరుణ్ థ్యాంక్స్ చెబుతాడు. అందుకే గుడికి వచ్చామని చెబుతాడు. సుమతి వాళ్ల అమ్మ అబ్బాయిని తీసుకెళ్లి పూజ చేయించుకుని రమ్మని సుమతిని ఇచ్చి పంపిస్తుంది. ఇంతలో బాలు, మీనా కూడా అక్కడికి వస్తారు. డెకరేషన్ ఆర్డర్లు బాగా వస్తున్నాయని మీనా వాళ్ల అమ్మతో సంతోషంగా చెబుతుంది. సుమతి ఎక్కడని అడిగితే ఇప్పడే ఆస్పత్రిలో తను సాయం చేసిన వాళ్లు వస్తే లోపలికి తీసుకెళ్లిందని చెప్పగా....అవునా వాళ్లను మేం కూడా కలుస్తామంటూ సుమతి, బాలును తీసుకుని గుడిలోకి వెళ్తుంది.
పూజ అయిపోయిన తర్వాత అరుణ్ సుమతితో మాట్లాడతాడు...మీరు చేసిన సాయం వల్లే మా అమ్మ త్వరగా రికవరీ అయ్యిందని అంటాడు. ఇలా జీవితాంతం ఆమెకు తోడుగా ఉండేవాళ్లు కావాలని మా అమ్మ అడుగుుతోందని చెబుతాడు. అయితే త్వరగా పెళ్లిచేసుకోమని సుమతి సలహా ఇస్తుంది.నాకు మీరు అంటే చాలా ఇష్టమని మిమ్మల్నే పెళ్లిచేసుందామని అనుకుంటున్నట్లు చెబుతాడు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయని సుమతి చెప్పగా...నేను ఎన్నిరోజులైనా ఎదురుచూస్తానని చెప్పి అరుణ్ వెళ్లిపోతాడు.
అరుణ్, బాలు మధ్య గొడవ
సుమతి వచ్చి వాళ్ల అక్కను కలిస్తుంది. దేవుడిని ఇప్పుడే నీ పెళ్లి గురించి కోరుకున్నామని బాలు చెప్పడంతో సిగ్గుపడుతుంది. చాలా పనులు ఉన్నాయని వెంటనే వెళ్లిపోవాలని మీ చెప్పి వెళ్లిపోతుంది. బాలు కారు అరణ్ బైక్కు తగలబోతుంది.వెంటనే ఇద్దరూ కిందకు దిగి మరోసారి గొడవపడటంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Author : Ajay Kumar

