Gunde Ninda Gudi Gantalu: స్టార్మా ఛానెల్లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో సాగుతుంది.రాఖీ పండుగకావడంతో మౌనిక రాకకోసం బాలు సహా ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు.
అప్పుడే శివ ఇంటికి రావడంతో ఇలా ఎందుకు వచ్చావురా అని మీనా అడుగుతుంది.ఇక్కడ నువ్వు బిజీగా ఉండి ఉంటావని నేనే వచ్చానని చెబుతాడు. దీంతో మీనా కూడా బాలుకు అదే విషయం చెబుతుంది. మౌనిక అక్కడ పనులతో రాలేకపోతుందేమో అందుకే మీరే వెళ్లండని చెబుతుంది. దీంతో బాలు అన్నదమ్ములను తీసుకుని మౌనిక వాళ్ల ఇంటికి వెళ్తాడు.
మౌనిక కోసం బాలు ఎదురుచూపులు
మౌనిక రాఖీ కట్టడానికి ఇంటికి వస్తుందని కాబట్టి ఇంట్లో వాళ్లు ఎవరూ ఎక్కడికి వెళ్లడానికి వీళ్లేదని బాలు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అది చాలా బిజీగా ఉంటుందని మన ఇంటికి రాదని ప్రభావతి చెప్పినా సరే ....మా చెల్లికి మేమంటే ప్రాణమని కాబట్టి తప్పకుండా వస్తుందని అంటాడు. అయితే మనోజ్ మాత్రం నేను చాలా బిజీపర్సన్నని నాకు టైం వేస్ట్ అవుతుందంటూ బిల్డప్ ఇస్తాడు. దీంతో అందరూ కలిసి గడ్డిపెట్టడంతో ఉండిపోతాడు. కానీ మీనా మాత్రం వాళ్లకు నిజం చెప్పలేక సతమతమవుతుంది. మౌనిక రాలేని పరిస్థితుల్లో ఉందని చెబితే బాలు బాధపడతాడని నోరుమూసుకుని ఉండిపోతుంది.
ఇంతలో ప్రభావతి మౌనిక వైభోగం గురించి గొప్పలు చెబుతుంది.దానికి ఇంటి నిండా పనివాళ్లు, కార్లు, డబ్బులు ఉన్నాయని అంటుంది. అసలు మనకోసం ఆలోచించే తీరిక కూడా ఉండి ఉండదని చెబుతుంది. ఏం ఉన్నా అక్కడ అన్నదమ్ముల ప్రేమమాత్రం లేదని అంటుంది.
అక్క కోసం వచ్చిన శివ
ఇంతలో అక్క కోసం శివ అక్కడికి వస్తాడు. శివను చూడగానే ప్రభావతి మళ్లీ ఈదొంగోడు ఎందుకు ఇక్కడికి వచ్చాడని...ఏం ఎత్తుకుపోవడానికి వచ్చాడని ప్రభావతి అంటుంది. నువ్వు,నీకొడుకు, నీకోడలు ఏమైనా మంచివాళ్లా అని బాలు అడుగుతుతాడు. నీ కొడుకు నగలు,డబ్బులు కొట్టేశాడని...నువ్వేమో నాన్నకు తెలియకుండా ఇంటినే తాకట్టుపెట్టావని...ఇక నీకోడలు సంగతి చెప్పాల్సిన పనిలేదని బాలు అంటాడు. మీరందరూ దొంగలై ఉండి వాడిని మాత్రం దొంగ అంటారు ఎందుకనని నిలదీస్తాడు. దీంతో సత్యం భార్యను తిడతాడు.నువ్వు అని వాడితో నాలుగు అనిపించుకుంటావు ఎందుకని అంటాడు. అయినా ఇంటికి వచ్చిన వారికి ఇలాగేనే మర్యాద చేసేదని అంటాడు. అతను మన కోడలి తమ్ముడని...నువ్వు గౌరవించికపోయినాపర్వాలేదని...కనీసం అవమానించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో మీనా శివను పిలిచి ఈ ఇంట్లో మనకు జరిగే మర్యాద ఇదేరా ఎందుకు వచ్చావని అంటుంది. ఇవాళ రాఖీ పండుగ కదా అక్క నువ్వు ఇక్కడ బిజీగా ఉంటావని నేనే వచ్చానని చెబుతాడు. దీంతో మీనా తమ్ముడికి రాఖీ కడుతుంది.వాడు సంతోషంగా డబ్బులు ఇవ్వగా...ఈ చిల్లర ఇచ్చేదని ప్రభావతి అనగా...మీనా గట్టిగా ఇస్తుంది.
చెల్లెళ్ల ఇంటికే బయలుదేరిన అన్నలు
అత్తయ్యగారు అన్నట్లు మౌనిక అక్కడ ఎంత బిజిగా ఉందో ఏమోనని మీనా అంటుంది. కాబట్టి మా శివ ఇక్కడికి వచ్చినట్లు మీరే అక్కడికి వెళ్లి ఎందుకు రాఖీ కట్టించుకోకూడదని అంటుంది. దీంతో ఈ శివగాడిని వాళ్లు ఇంట్లోకి రానివ్వాలి కదా అని ప్రభావతి అంటుంది. దీంతో సత్యం కల్పించుకుని అక్కడవాళ్లు ఎంత అవమానించినా నువ్వు మాత్రం నోరు తెరవొద్దని మాట ఇవ్వమని అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గొడవ పెట్టుకోనని మాట ఇవ్వమని అంటే..బాలు సరేనంటాడు. దీంతో అన్నదమ్ములు అంతా కలిసి మౌనిక ఇంటికి బయలుదేరి వెళ్తారు.
Author : Ajay Kumar

