Gunde Ninda Gudi Gantalu June 2 Episode Telugu Serial - గుండెనిండా గుడిగంటలు జూన్ 2 ఎపిసోడ్
గుండెనిండా గుడిగంటలు జరిగిన ఎపిసోడ్ లో.. ఇంట్లో అందర్నీ మలేషియా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు బాలు.
ఇలా అయినా పార్లలమ్మ గుట్టు బయటపడుతుందనుకుంటారు మీనా బాలు. ప్రయాణం ఆపించేందుకు మనోజ్ ని ప్రయోగించి ఫెయిల్ అవుతుంది రోహిణి. ఎలాగైనా మలేషియా ప్రయాణం ఆపాలని ప్లాన్ చేసుకుంటుంది. అందులో భాగంగా మరోసారి మేకమామను రంగంలోకి దించబోతోంది..
గుండెనిండా గుడిగంటలు" href="https://telugu.abplive.com/search?s=%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%86%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE" target="_self">గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్..శ్రుతి రవి గొడవతో మొదలైంది. నాకన్నా నీతూతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడని, మీ భర్తలు మీతో ఎంత సమయం ఉంటున్నారని నిలదీస్తుంది శ్రుతి. బాలు మీనా, రోహిణి మనోజ్ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తారు.
ఉదయం నాలుగు గంటలు..షోరూమ్ కి వెళ్లిన తర్వాత మళ్లీ కాల్ చేసి పిలిపించుకుంటా అంటాడు మనోజ్..మొత్తం 9 గంటలు కలసి ఉంటాం అంటుంది రోహిణి.
మేం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మొత్తం కలపి పది గంటలు కలసి ఉంటున్నాం అంటుంది మీనా.
మాట్లాడితే నీ..థూ..అంటావ్ కానీ రోజు మొత్తం నాతో నువ్వు కలసి ఉన్నది కేవలం 2 గంటలే అని ఫైర్ అవుతుంది శ్రుతి.
అందుకే మలేషియా వెళదాం అన్నానని బాలు అనడంతో..సరే వెళదాం నేను రెడీ అంటుంది శ్రుతి. అయ్యో శ్రుతి కూడా రెడీ అయిపోయిందే అని లోలోపలే బాధపడుతుంది.
మీరు మలేషియా వెళ్లాలన్నది ప్లాన్ మాత్రమే అన్నారు..కానీ ఇప్పుడు అందరూ నిజంగా రెడీ అయిపోతున్నారు అంటుంది మీనా. మంచిదే కదా.. రవి శ్రుతి మలేషియా వెళితే నిజంగానే హనీమూన్ వెళ్లినట్టవుతుంది అంటాడు బాలు. నాక్కూడా అలాంటి కోరికే ఉందంటూ హనీమూన్ గురించి మాట్లాడుతుంది మీనా. సమస్యలన్నీ సర్దుకున్నాక..నువ్వు చెప్పిన ప్రతిచోటుకి తీసుకెళ్తానని మాటిస్తాడు బాలు.
విద్య దగ్గరకు వెళ్లిన రోహిణి..ఇంట్లో జరిగినదంతా చెబుతుంది. ఇంకేముంది ప్లాన్ చేయి అని విద్య అనగానే.. నువ్వు మరింత భయపెట్టొద్దు అంటుంది రోహిణి. వాళ్లను ఎలా ఆపాలో అర్థంకావడం లేదంటుంది రోహిణి. నీకథ క్లైమాక్స్ కి వచ్చినట్టే అంటుంది విద్య. మానాన్న జైల్లో ఉన్నాడని చెబితే కొంతకాలం పర్వాలేదు అనుకున్నా అంటుంది. కథలోకి మాణిక్యాన్ని దించుతారు. నాకు సహాయం చేయండి అని కన్నీళ్లతో అడుగుతుంది రోహిణి. సరే అంటాడు మేకమావయ్య.
సత్యం ఇంటికి పోలీసులు వస్తారు.. మనోజ్ కంగారుపడుతుంటాడు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు వస్తారు. ప్రభావతి హడావుడి చేస్తుంటుంది. ఇంతలో మేక మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు... రోహిణి తండ్రి చనిపోయాడంటూ చెప్పి అస్తికలు తీసుకొచ్చానంటాడు. రోహిణి షాక్ అయినట్టు నటించి కిందపడిపోతుంది. ఆస్తుల గురించి ఎంక్వైరీ చేస్తుంది ప్రభావతి. కోర్టు కేసు నడుస్తోందని మరో అబద్ధం చెబుతాడు మాణిక్యం. మన మలేషియా ట్రిప్ క్యాన్సిల్ అంటాడు సత్యం. బాలు-మీనా కు డౌట్ కొడుతుంది. రోహిణిని బాగా చూసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతాడు మాణిక్యం.
అమ్మా..నీ నోట్లో బూడిద కొట్టారే అంటూ ప్రభావతిని ఏడిపిస్తాడు బాలు..నీకెంత పెద్ద కష్టం వచ్చిందే అమ్మా..మలేషియా పేరు మళ్లీ ఎత్తకుండా ఎంత పెద్ద నాటకం ఆడారే అమ్మా..గోవిందా అంటూ శోకాలు పెడతాడు.
రూమ్ కి వెళ్లి దొంగ ఏడుపు నటిస్తూ ఉంటుంది రోహిణి..మనోజ్ ఓదార్చుతాడు. ఆ తర్వాత విద్య కాల్ చేస్తుంది..మాణిక్యం వచ్చాడు వెళ్లాడు, మలేషియా ట్రిప్ క్యాన్సిల్ అయినట్టే అంటుంది రోహిణి. చాలా తెలివిగా ఆడుతున్నావ్ అంటుంది విద్య. నీ కథలు రోజురోజుకీ డేంజరస్ అవుతున్నాయ్ అంటుంది.
బాలు మీనా కూర్చుని మాణిక్యం చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటారు. ఏదో డౌట్ కొడుతోందని డిస్కస్ చేసుకుంటారు. పెళ్లి, నల్లపూసల ఫంక్షన్ సహా ఇప్పటివరకూ రోహిణి చెప్పినవన్నీ అబద్ధాలే అంటాడు బాలు.
కామాక్షి ఇంటికి వెళ్లిన ప్రభావతి జరిగినదంతా చెబుతుంది. నువ్వు రోహిణి ఆస్తిపై ఆశపెట్టుకోకు అంటుంది. ఇంతలో చింతామణి ఎంట్రీ ఇస్తుంది. మీ పిల్లల్ని డాన్స్ కి జాయిన్ చేస్తారా అని అడిగితే..నేనే నేర్చుకుందాం అనుకుంటున్నా అంటుంది... (మీనాను గ్రిప్ లోకి తెచ్చుకోవాలంటే ముందు ప్రభావతిని లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తుంది చింతామణి).
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు, నటించిన సినిమాలు తెలుసా?
Author : RAMA

