Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

ABP దేశం 1 week ago

Harish Rao Political Future Telangana: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన, ట్రబుల్ షూటర్గా పేరొందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు చుట్టూ సాగుతున్న రాజకీయ వ్యూహాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.

ఆయన నా పుట్టుక బీఆర్ఎస్లోనే.. నా చావు కూడా బీఆర్ఎస్లోనే అంటూ చేసిన భావోద్వేగ ప్రకటన, ఆయన ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడికి అద్దం పడుతోంది. హరీష్ రావు ఇమేజ్ను దెబ్బతీయడానికి , బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీయడానికి ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నుండి గులాబీ జెండాను భుజాన వేసుకుని, పార్టీకి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించిన నేత హరీష్ రావు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి.. తాను కట్టె కాలే వరకూ బీఆర్ఎస్లోనే ఉంటానని, కేసీఆరే తన బాస్ అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆయనకు ఉన్న పొలిటికల్ స్టేచర్, ప్రజాదరణ దృష్ట్యా ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ వంటి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశమే లేదు. అయినప్పటికీ, ఆయనపై నిరంతరం వలసల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రచారం ద్వారా హరీష్ రావును నిరంతరం డిఫెన్స్లోకి నెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి చిట్ చాట్ వ్యూహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించినప్పుడల్లా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందనేది స్పష్టమవుతోంది. హరీష్ రావు లోపాయికారీగా వేరే పార్టీలతో గూడుపుఠాణీ చేస్తున్నారనో, లేదా ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనో రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తుంటారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా, మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ అవ్వడం.. దానికి కౌంటర్ ఇచ్చుకోవడానికి హరీష్ రావు తన విలువైన సమయాన్ని, శ్రమను వెచ్చించాల్సి వస్తోంది. ఇది ప్రత్యర్థుల విజయంగా భావించవచ్చు. పరిపాలనపై, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేయాల్సిన పోరాటాన్ని పక్కదారి పట్టించి.. హరీష్ రావును సొంత పార్టీలోనే ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం.

అనుమానాలు సృష్టిస్తే.. ప్రత్యర్థుల వ్యూహం ఫలించినట్లే!

ఈ రాజకీయ ప్రచారాల వెనుక ఉన్న అసలైన ప్రమాదం హరీష్ రావుకు బయట పార్టీల నుంచి వచ్చే ముప్పు కాదు; సొంత పార్టీలోనే ఆయనపై అనుమానాలు తలెత్తేలా చేయడం. ఒకవేళ ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ పుకార్లను నమ్మి హరీష్ రావును అనుమానిస్తే.. ఈ ప్లాన్ అమలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీల వ్యూహం వంద శాతం ఫలించినట్లే అవుతుంది. నిరంతరం వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఏ నాయకుడికైనా మానసిక క్షోభను కలిగిస్తుంది. సొంత గూటిలోనే నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తే, అది హరీష్ రావు రాజకీయ ప్రస్థానాన్ని మాత్రమే కాదు.. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెడుతుంది. ఒకవేళ ఈ మైండ్ గేమ్ వల్ల ఆయన సైలెంట్ అయితే, అది బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. హరీష్ రావు లాంటి మాస్ లీడర్ మరియు ట్రబుల్ షూటర్ను కోల్పోవడం లేదా ఆయనను నైతికంగా బలహీనపరచడం వల్ల గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుంది.

నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి?

25 ఏళ్లుగా ఒకే పార్టీ నమ్ముకుని, సిద్ధిపేటను అజేయమైన కోటగా మార్చిన హరీష్ రావు తన విశ్వసనీయతను ప్రతిసారీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కేసీఆర్ మేనల్లుడు కావడం వల్లే ఆయనను వారసత్వ పోరులోకి లాగి, పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ప్రత్యర్థులు విసిరే ట్రాప్లో పడకుండా, హరీష్ రావుకు పార్టీలో పూర్తి స్వేచ్ఛ మరియు మద్దతు ఇస్తేనే.. బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించగలదని బీఆర్ఎస్ క్యాడర్ అభిప్రాయం. రేవంత్ రెడ్డి వేస్తున్న పొలిటిక పాచికలను తిప్పికొట్టాలంటే.. కేవలం హరీష్ రావు వివరణలు సరిపోవు, బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆయన వెనుక తాము బలంగా ఉన్నామనే సంకేతాన్ని క్యాడర్కు పంపాల్సి ఉంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam