జూదం ఆడేచోట అసత్యం, మోసం, లోభం ప్రధానంగా ఉండే లక్షణాలు. ఇక్కడకు వచ్చిన వ్యక్తి సర్వం కోల్పోయేలా చేస్తాడు కలిపురుషుడు. ఫలితంగా గొడవలు , హత్య, ఆత్మహత్యలు సాధారణంగా మారుతాయి
ఈ 5 కలిపురుషుడి ప్రధాన నివాసాలు. పరీక్షిత్ మహారాజు ఆదేశాల మేరకు కలి ఈ ఐదు స్థానాల్లోనే ఉండాలి..ఇతర చోట్లకు వెళ్లకూడదు. ఎవరైతే ఈ ఐదు ప్రదేశాలకు వెళతారో వారిపై కలిప్రభావం తప్పదు
మద్యపానం చేసేచోట మనస్సు, బుద్ధి పనిచేయదు..వివేకం కోల్పోతారు. అందుకే స్నేహితులు, కుటుంబ సభ్యులతో వివాదాలు.. ప్రమాదాలు జరుగుతాయి

నడవడిక తెలియని స్త్రీలను కోరుకునేవారిపై కలి ప్రభావం ఉంటుంది. వీరితో సంబంధం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజ మర్యాదను నాశనం చేస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలు, రోగాలు తప్పవు
ప్రాణ హింస జరిగే చోట కలి పురుషుడు ఉంటాడు. అనవసరంగా ప్రాణులను చంపడం , మనుషుల మధ్య హింస జరిగే చోట కలి పురుషుడు ఉంటాడు. బంగారం ఉండేచోట కలిపురుషుడు ఉంటాడు. బంగారం, ధనం కోసం మనుషులు ఏమైనా చేస్తారు.. పరీక్షిత్ మహారాజు కూడా తన కిరీటంలో బంగారం ద్వారా కలి ప్రభావం పడి ప్రభావితుడయ్యాడు
అసత్యం, మత్తు, కామం, క్రూరత్వం, లోభం..కలియుగంలో ప్రధాన ద్వారాలు.భాగవతం ప్రకారం ఈ స్థానాలను దాటి సాత్వికజీవనం ద్వారా కలి ప్రభావాన్ని జయించవచ్చు

