Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

ABP దేశం 1 month ago

Stay Safe in Summer Heatwave : తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం మొదలైంది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 50 వరకు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు.

హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. మరి వడగాలుల నుంచి సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వడగాలి ఎప్పుడు ప్రమాదం?

సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వడగాలి పరిస్థితి ఏర్పడుతుంది. గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటే శరీరం చెమటను బయటకు పంపిస్తూ వేడిగా మారిపోతుంది. ఇది హీట్ స్ట్రోక్కు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు, బయట పని చేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడగాలి ప్రభావితం అయితే హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.

హీట్ స్ట్రోక్ లక్షణాలు

శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. 104 ఫీవర్ రావచ్చు. చెమట ఆగిపోయి చర్మం పొడిగా, వేడిగా మారుతుంది. తల తిరగడం, స్పృహ తప్పడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వికారం, వాంతులు, మాటలు తడబడడం, గందరగోళంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే 108కి కాల్ చేయాలి.

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో శరీరం చాలా వేగంగా నీటిని కోల్పోతుంది. దీన్ని నివారించడానికి దాహం వేయకపోయినా గంటకోసారి నీళ్లు తాగండి. రోజుకు కనీసం 3–4 లీటర్ల నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ORS వంటివి తీసుకోవచ్చు. కూల్డ్రింక్స్, కాఫీ, టీ వీలైనంత తగ్గించండి. ఇవి శరీరంలో నీటి శాతం తగ్గిస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు వెళ్లకండి. ఈ సమయంలో వడగాలి అత్యంత తీవ్రంగా ఉంటుంది. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే తెల్లవారుజామున లేదా సాయంత్రం వెళ్లండి. బయట పని చేసేవారు తరచుగా నీడలో విశ్రాంతి తీసుకోవాలి. తేలికైన, వదులుగా ఉన్న, తెల్లని లేదా లేత రంగు దుస్తులు వేసుకోవాలి. కాటన్ డ్రెస్​లు శరీరానికి గాలి అందిస్తాయి. బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా టోపీ పెట్టుకోండి. లేదా గొడుగు తీసుకెళ్లండి. కళ్లకు సన్గ్లాసెస్ పెట్టుకోండి.

ఫుడ్ విషయంలో చేయాల్సిన మార్పులు

పగలు కిటికీలు, తెరలు మూసి వేయండి. ఎండ నేరుగా లోపలికి రాకుండా చూసుకోండి. రాత్రి చల్లని గాలి వస్తే కిటికీలు తెరవండి. ఫ్యాన్, కూలర్ వాడండి. AC ఉంటే 24 డిగ్రీలు టెంపరేచర్ పెట్టుకోవచ్చు. పెరుగు, మజ్జిగ, కీరదోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, నూనె ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తగ్గించాలి. బయటి ఫుడ్స్ తినకపోవడమే మంచిది. భోజనం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినండి. ముందు రోజు వండిన అన్నం, కూరలు తినకపోవడమే మంచిది.

హీట్ స్ట్రోక్ తగిలితే..

హీట్ స్ట్రోక్ తగిలిన బాధితుడుని వెంటనే నీడలోకి లేదా చల్లటి గదిలోకి తీసుకెళ్లాలి. దుస్తులు వదులుగా చేయాలి. చల్లటి నీళ్లతో తలపై, మెడపై, చంకల వద్ద తడి గుడ్డ పెట్టండి. గాలి తగిలేలా చూడాలి. స్పృహలో ఉంటే ORS లేదా చల్లటి నీళ్లు ఇవ్వాలి. వెంటనే 108కి కాల్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam