Dailyhunt
Hero Scooty Models: హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?

Hero Scooty Models: హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?

ABP దేశం 1 week ago

Hero Scooty Models: మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాహన సంస్థల్లో టాప్‌లో ఉంటుంది హీరో మోటోకార్ప్‌. ఈ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 8 స్కూటర్ మోడల్స్‌ను విక్రయిస్తోంది.

వినియోగదారుల బడ్జెట్‌, అవసరాలను బట్టి ఈ ధరలు 69, 430 నుంచి ప్రారంభమై 1,37, 898 రూపాయల వరకు ఉన్నాయి.

భారతీయ రోడ్లపై హీరో వాహనాల సందడి 1984లో ప్రారంభమైంది. జపాన్‌కు చెందిన హోండా మోటార్‌ కంపెనీతో కలిసి హీరోహోండాగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ నేడు హీరో మోటోకార్ప్‌గా ప్రపంచంలోనే అత్యధిక టూవీలర్‌ విక్రయిస్తున్న సంస్థగా రికార్డు సృష్టించింది. ఆర్థిక సంవత్సరం 2024-2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 58,99,187 వాహనాలను విక్రయించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2006లో ప్రారంభమైన హీరో హోండా ప్లెజర్ ఈ సంస్థ నుంచి వచ్చిన మొదటి స్కూటర్‌. నాటి నుంచి నేటి వరకు క్రియేట్ కొలాబరేట్‌ ఇన్సైర్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది.

మోడల్‌ఎక్స్‌షోరూమ్ ధర మైలేజీ
హీరో డెస్టినీ ప్రైమ్రూ.69,43056 kmpl
హీరో ప్లెజర్ ప్లస్ రూ.69,766 50 kmpl
హీరో జూమ్ 110రూ.73,551 53.4 kmpl
హీరో డెస్టినీ 125 రూ.76,438 60 kmpl
హీరో జూమ్ 125 రూ.81,994 52.8 kmpl
హీరో జూమ్ 160 రూ.1,37,898 40 kmpl

ఏ స్కూటర్ ఎవరి కోసం

హీరో తన స్కూటర్‌లను మూడు ప్రధాన విభాగాల్లోకి వర్గీకరించింది. కుటుంబ అవసరాల కోసం, యువత కోసం స్పోర్టీ లుక్, లాంగ్ రైడ్స్ కోసం ప్రీమియం అనుభూతిని అందించేలా వీటిని రూపొందించారు.

ఫ్యామిలీ కమ్యూటర్ల కోసం

హీరో డెస్టినీ ప్రైమ్‌ & డెస్టినీ 125: ఇవి రోజువారి ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతమైనవి. ముఖ్యంగా హీరో డెస్టినీ 125 ఫ్యామిలీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌. ఇందులో ఫుల్ డిజిటల్‌ కన్సోల్‌, సెల్ఫ్‌ క్యాన్సిలింగ్ ఇండికేటర్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది లీటర్‌కు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తున్న అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన స్కూటర్‌గా గుర్తింపు పొందింది.

హీరో ప్లెజర్‌ ప్లస్‌: మహిళా రైడర్లను దృష్టిలో ఉంచుకొని వై షుడ్ బాయ్స్‌ హావ్‌ ఆల్‌ ది ఫన్‌? అనే థీమ్‌తో ప్రారంభమైన ఈ మోడల్‌ తక్కువ బరువుతో ఉండి సులభమైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది.

స్పోర్టీ స్కూటర్లు

హీరో జూమ్‌110 & 125: నగరాల్లో ట్రాఫిక్ మధ్య వేగంగా ప్రయాణించాలనుకునే యువత కోసం జూమ్‌ సిరీస్‌ను హీరో తీసుకొచ్చింది. వీటి యాక్సిలరేషన్ చాలా వేగంగా ఉంటుంది. హ్యాండ్లింగ్‌ చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా జూమ్‌ 125 మోడల్‌ 2025 ఆటో ఎక్స్‌పోలో లాంయ్ అయ్యి, యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రీమియం మాక్సీ స్కూటర్

హీరో జూమ్‌ 160: హీరో నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన, ఖరీదైన స్కూటర్ ఇది. హైవే ప్రయాణాలకు, టూర్‌లకు ఇది సరైన ఎంపిక, 156 సీసీ ఇంజిన్‌తో 14.81 పీఎస్‌ పవర్‌ అందించే ఈ వాహనం, మాక్సీ స్కూటర్ అనుభూతిని ఇస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు

పర్యావరణ హితమైన ప్రయాణాల కోసం హీరో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ముద్ర వేసింది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా , హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ వంటి మోడళ్లను ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో హీరో ఇ మాస్ట్రో అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ సుమారు లక్ష రూపాయల ధరతో తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam