Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hindu Mythology: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!

Hindu Mythology: సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఆపని చేయకండి, మీ వంశం నాశనమే!

ABP దేశం 1 week ago

సాయంత్ర సమయంలో ఆమెకు కలిగి కోరిక లోకాలను వణికించింది

సంతానం కోసం పరితపిస్తున్న ఆ ఇల్లాలు..భర్త వారించినా కానీ తనకు పుత్రభిక్ష పెట్టమని వేడుకుంది

అంతా పరమేశ్వరుడిదే భారం అంటూ ఆ మహర్షి..భార్య కోర్కె తీచ్చారు..

అందుకు ఫలితం రాక్షస జననం..

ఆ రాక్షసులే హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు..

శ్రీమద్ భాగవతం (3.14 & 3.17 అధ్యాయాలు) ప్రకారం....

కళ-మరీచి మహర్షులకు కలిగిన సంతానం కశ్యప మహర్షి..
ప్రసూతి-దక్షప్రజాపతి తమ కుమార్తెలు 13 మందిని కశ్యపునికి ఇచ్చి వివాహం చేశారు...వారే దితి, అదితి, అరిష్ట, సురస, ధను, కష్ట, ఇల,తామ్ర, సురభి, ముని, క్రోధవశ, వినత, కద్రు.

వీరిలో దితి మినహా..మిగిలిన 12 మంది భార్యలకు సంతాన భాగ్యం కలిగింది. అప్పటి నుంచి దితి మనసులో అదే కోరిక ఉండిపోయింది. తాను కూడా అమ్మా అని పిలిపించుకోవాలని తపించింది. రేయి పగలు సంతానం చుట్టూనే సాగేవి ఆమె ఆలోచనలు. పిల్లలు కావాలన్న వాంఛతో ఉన్న దితి..ఓ రోజు కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్లింది. అప్పుడే సంధ్యావందనం పూర్తిచేసి అగ్నికార్య నెరవేర్చి హోమశాల ముందు కూర్చుని ఉన్నారు కశ్యప మహర్షి. ఆ సమయంలో అక్కడకు వచ్చిన దితి తన మనసులో మాట చెప్పింది. స్వామీ నా సవతులు అందరూ గర్భవతులయ్యారు, పిల్లలతో సంతోషంగా ఉన్నారు..నేను మాత్రం సంతానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను..పుత్ర భిక్ష పెట్టండి అని వేడుకుంది. అప్పుడు కశ్యప మహర్షి.. నీ కోర్కె నెరవేర్చేందుకు ఈ సమయం సరికాదన్నారు.

సంధ్యాసమయం గడిచేవరకూ ఆగు..ఈ ముహూర్తకాలంలో మన్మథుడికి శత్రువైన శివుడు వృషభ వాహనంపై భూతగణాలతో కలసి విహరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో భార్య-భర్త కలయిక ప్రకృతి విరుద్ధం..అసుర ఆగమనానికి సంకేతం అని వివరించారు. ధర్మాన్ని అతిక్రమించొద్దని చెప్పినా దితి వినే పరిస్థితిలో లేదు. ఇక భార్య కోర్కెను కాదనలేక పరమేశ్వరుడికి నమస్కరించి ఏకాంతసమయాన్ని గడిపారు కశ్యప మహర్షి. ఆ క్షణం తర్వాత తాను ఏం చేసింది? తన భర్త ఏం చెప్పారు? ఇవన్నీ గుర్తుచేసుకుని అపరాధ భావంతో కుంగిపోయింది దితి. పరమేశ్వరా నా అపరాధాన్ని క్షమించు..నా గర్భాన్ని రక్షించు అని వేడుకుంది.

కొంతకాలానికి దితి గర్భం దాల్చింది. నువ్వు మోహాన్ని జయించలేకపోయావు, సిగ్గూ భయమూ భక్తి విడిచిపెట్టి వ్యామోహానికి లొంగిపోయావు.. అందుకే భూతగణాలచే ప్రేరేపించే ఆ భగవంతుడి అనుచరులే నీకు కుమారులుగా జన్మిస్తారని చెప్పారు. సంపన్నులు, భయంకర కార్యాలు చేసేవారు, మహా బలవంతులు, గర్విష్టులు అయిన నీ సంతానం..భూమికి భారంగా మారి ...చివరకు శ్రీ మహావిష్ణువు చేతిలో అంతమవుతారని చెప్పారు. మన కుమారులు ఎందరికి అపకారం చేసినా ఆ శ్రీహరి చేతిలో మరణించడం అనేది మనకు దక్కిన భాగ్యం అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే నువ్వు చేసిన విపరీతకార్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది.. భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించు. మన వంశంతో ఈ ఇద్దరు మాత్రమే రాక్షసులు..ఆ తర్వాత కలిగే సంతానం శ్రీహరి భక్తులే అని సెలవిచ్చారు కశ్యపుడు. హిరణ్య కశిపుడికి జన్మించినవాడే ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుడి మనవడే బలి చక్రవర్తి.

తొమ్మిది నెలలు నిండిన తర్వాత.. ప్రసవ సమయం ఆసన్నమైంది..
భూమి కంపించింది
పర్వతాలు వణికిపోయాయి
సముద్రాలు ఉప్పొంగాయ్
తారలు నేలరాలాయి
దిక్కులు నిప్పులు చిమ్మాయి
అదే క్షణం ఇద్దరు చిన్నారులు జన్మించారు
తనయులను చూసేందుకు వచ్చిన కశ్యప మహర్షి.. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనీ నామకరణం చేసాడు.

ఆ తర్వాత కథ అందరకీ తెలిసినదే.. హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.. ఆ భక్తితోనే విష్ణువును ప్రార్థించగా.. నృసింహ అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్య కశిపుడిని సంహరిస్తాడు..అది కూడా సంధ్యా సమయమే.

సంధ్యా సమయం ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో దైవారాధన చేయాలి కానీ ఎలాంటి వాంఛలకు లోనుకాకూడదు. దైవారాధన, దీపారాధన చేయకపోయినా శృంగార కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లేదంటే..వంశానికి అప్రతిష్ట తెచ్చే సంతానం, భూమికి భారంగా మారే సంతానం జన్మిస్తారు.

కలియుగంలో జనం మధ్యే తిరుగుతున్న ఇలాంటి రాక్షసులు ఎందరో ఉన్నారు..అందుకే హత్యలు, అత్యాచారాల సంఖ్య పెరిగిపోతోంది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని పెద్దలు చెప్పేది అందుకే..

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam