Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. కషాయరంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే!

Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. కషాయరంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే!

ABP దేశం 1 week ago

Hockey India Jersey Saffron Shift: 2026 వరల్డ్ కప్ కి ముందు మెన్స్, ఉమెన్స్ నేషనల్ హాకీ టీమ్‌ల జెర్సీ కలర్ మార్చడం వెనుక ఉన్న మెయిన్ రీజన్స్ ని హాకీ ఇండియా అఫీషియల్ గా క్లారిఫై చేసింది.

నేథర్లాండ్స్, బెల్జియంలలో జరగబోయే ఎఫ్ఐహెచ్ (FIH) వరల్డ్ కప్ లో ట్రడిషనల్ బ్లూ కిట్స్ కి బదులుగా శాఫ్రాన్ (కషాయరంగు) జెర్సీలు వేసుకోనున్నట్లు ఈనెల 27న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ కి దారితీయగా, మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా కూడా దీన్ని ప్రశ్నించాడు. దీనిపై జులై 30న హాకీ ఇండియా స్పందిస్తూ బ్లూ కలర్ సింథటిక్ పిచ్‌పై బ్లూ జెర్సీ మిక్స్ అయిపోవడం వల్ల విజిబిలిటీ ప్రాబ్లమ్ వచ్చిందని, అందుకే టెక్నికల్ రీజన్స్ తోనే జెర్సీ కలర్ మార్చాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

వీరేన్ రస్కిన్హా వైరల్ పోస్ట్.. అనవసర రాద్ధాంతం వద్దంటూ ఫైర్
జెర్సీ మార్పుపై వీరేన్ రస్కిన్హా పెట్టిన పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. "ఈ విషయంపై అనవసరమైన పొలిటికల్ కామెంట్స్ రావడం చూస్తున్నా. నాకు అలాంటి వివాదాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. నా పాయింట్ ప్రైడ్, ఐడెంటిటీ, లెగసీకి సంబంధించింది. ఫుట్‌బాల్ కి అర్జెంటీనా ఎలాంటిదో హాకీకి ఇండియా అలాంటిది. అర్జెంటీనా ఎప్పుడైనా ఆరేంజ్, వైట్ స్ట్రైప్స్ జెర్సీ వేసుకుంటుందా?" అని ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు.

కషాయరంగు ఎంపిక వెనుక క్రూషియల్ రీజన్స్.. నేషనల్ ఫ్లాగ్ ప్రైడ్
కోచ్‌లు, ప్లేయర్ల సజెషన్స్ తీసుకున్న తర్వాతే ప్రత్యామ్నాయంగా ఎల్లో లేదా శాఫ్రాన్ రంగులను పరిశీలించామని హాకీ ఇండియా తెలిపింది. టెక్నికల్ నీడ్ తో పాటు శాఫ్రాన్ మన నేషనల్ ఫ్లాగ్ లో ఒక కలర్ కావడం, ధైర్యానికి, త్యాగానికి ప్రతీక కావడంతో దాన్నే ఫైనలైజ్ చేసినట్లు ఆర్గనైజేషన్ చెప్పింది.

గతంలోనూ మారిన జెర్సీలు.. ఫస్ట్ టైమ్ ఏమీ కాదన్న హాకీ ఇండియా
హాకీ జెర్సీలు మారడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదని బోర్డు గుర్తుచేసింది. 2014 ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ లో జెర్సీని ఎల్లో కలర్ లోకి, 2018 వరల్డ్ కప్ లో స్కై బ్లూ విత్ న్యూ డిజైన్ లోకి మార్చారని చెప్పాడు. ప్రెజెంట్ కోచ్‌లు, ప్లేయర్ల నుంచి వచ్చిన టెక్నికల్ ఫీడ్‌బ్యాక్ తో పాటు నేషనల్ ఫ్లాగ్ సింబాలిజమ్‌ని రెస్పెక్ట్ చేస్తూనే శాఫ్రాన్ రంగును సెలెక్ట్ చేశామని హాకీ ఇండియా పేర్కొంది.

Author : Ayes

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam