Dailyhunt
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ!

Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ!

ABP దేశం 1 week ago

Hyderabad Biryani: హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ నేది రోజురోజుకూ ప్రశ్నార్థకమవుతోంది. రోజుకో చోట అధికారులు దాడులు చేస్తూ ఫుడ్లో జరుగుతున్న కల్తీని, మాఫీయను రట్టు చేస్తున్నారు.తాజాగా బంజారాహిల్స్లో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్ ఆటను కట్టించారు.

రోడ్ నెంబర్లోని వెంకటరమణ కాలనీ సమీపంలో ఉన్న హోటల్లో వెలుగు చూసిన దారుణం అందర్నీ షాక్కి గురి చేస్తోంది.

వెంకటరమణ కాలనీలో నివసించే కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన నివాసం నుంచి జొమాటో యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. సమీపంలోని లక్కీ బిర్యానీ షవర్మ సెంటర్ నుంచి డెలవిరీ బాయ్ బిర్యానీ తీసుకొచ్చాడు. పార్సిల్ తెరిచి చూసి షాక్ అయ్యారు కొండారెడ్డి. పొట్లం విప్పగానే ఒక్కసారిగా కంపు కొట్టింది. ఆహారాన్ని పరిశీలించగా అది పాచిపోయి, కుళ్లిపోయినట్టుగా కనిపించింది. వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయాన్ని చెప్పారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్పందించి లక్కీ బిర్యానీ సెంటర్పై దాడి చేశారు. అక్కడ తనిఖీలు చేపట్టారు. యజమాని ఇర్ఫాన్ చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది.

హోటల్లోని ఫ్రిడ్జె్లో సుమారు 80కిపైగా బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని జీడిమెట్లోలని తన ప్రధాన కేంద్రంలో మూడు రోజుల క్రితం తయారు చేసి పంపించారు. ఇక్కడ అవుట్లెట్లో అమ్ముతున్నారు.

పోలీసులు ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే అందులో ఆహార పదార్థాల మధ్య లుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది హోటల్ మెయింటెనెన్స్ ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి నిదర్శనం

ఆర్డర్ రాగానే ఫ్రిడ్జ్లో పాత బిర్యానీ ప్యాకెట్ను తీసి, ఓపెన్లో వేడి చేసి తాజాగా ఉన్నట్టు కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam