Hyderabad Mango Pickle Season: పచ్చళ్ల సీజన్ మాంచి జోరుమీదున్న ఈ టైమ్లో హైదరాబాద్ ఆవకాయ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇన్నాళ్లు పళ్లెటూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి ఆవకాయ పచ్చళ్ల జాడీలు పార్సిల్ వచ్చేవి.

Hyderabad Mango Pickle Season: పచ్చళ్ల సీజన్ మాంచి జోరుమీదున్న ఈ టైమ్లో హైదరాబాద్ ఆవకాయ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇన్నాళ్లు పళ్లెటూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి ఆవకాయ పచ్చళ్ల జాడీలు పార్సిల్ వచ్చేవి.

పచ్చడి కోసం మామిడి కాయలు కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ తప్పులు చేస్తే పచ్చడి పాడవుతుంది
హైదరాబాద్ ఆవకాయ్కు డిమాండ్
నేను ఆవకాయ పచ్చడి కోసం గత ఏడాది తెల్లగులాబీ తీసుకున్నాం, ఈసారి పెద్ద రసాలు తీసుకున్నాను. పెద్దరసాలతో పచ్చడి పట్టడం వల్ల ఉప్పు, కారం తగిలితే ఆవకాయ పచ్చడి బాగుటుంది. ఒక్కోకాయ 25 రూపాయలు పడింది. ఇక్కడే కాయకు 8 రూపాయలు తీసుకుని ముక్కలుగా కొట్టి ఇచ్చేశారు. ప్రతీ ఏటా కేపీహెచ్ బీ రైతు బజార్ వద్ద దొరికే పచ్చడి మామిడి కాయలు కొంటుంటాం. మాగాయికి తెల్ల రసాలు తీసుకుంటాను. ఈ సమీపంలోనే హోల్ సేల్ దుకాణం ఉంది. కారం, ఆవపిండి, నూనె ఇలా అన్ని ఒకే చోట దొరికేస్తాయి. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. హైదరాబాద్లో పట్టిన ఆవకాయ పచ్చడి ప్రతీ ఏటా అమెరికాకు పంపుతుంటాం. ఏపిలో ఉంటున్న మా బంధువులకు కూడా ఇక్కడ హైదరాబాద్లో పట్టిన ఆవకాయ పచ్చడి పంపుతుంటాను.- విజయవాణీ,హైదరాబాద్

మహారాష్ట్ర స్పెషల్ ఖైరీ చట్నీ.. పచ్చి మామిడికాయతో చేయగలిగే ఈజీ రెసిపీ ఇదే
బంధువులు కావాలంటారు
మేం గత 25 ఏళ్లుగా హైదరాబాద్లో దొరికే మామిడి కాయలతోనే పచ్చడి పడుతున్నాం. మేము ఆవకాయ్ పట్టడమే కాదు, ఇక్కడి నుంచి ఏపిలోని వివిధ గ్రామాల్లో బంధువులకు సైతం పంపుతున్నాం. వాళ్లు కూడా హైదరాబాద్లో పట్టే ఆవకాయ్ అంటే చాలా బాగా ఇష్టపడుతున్నారు. - స్వర్ణకుమారి, హైదరాబాద్

జూన్ వరకు అమ్మకాలు
ఉభయగోదావరి జిల్లాల్లోని పేరుపాలెం, నర్సాపురం, మొగల్తూరు ఇలా వివిధ ప్రాంతాలలో పండించిన పచ్చడి మామిడి కాయలు ఇక్కడ కేపీహెచ్బీ రైతు బజార్ కు సమీపంలో ప్రతీ ఏటా అమ్ముతుంటాం. పెద్ద రసాలు నుంచి నాటు కాయ వరకూ సుమారుగా 15 రకాల పచ్చడి మామిడి కాయలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారం వరకూ అమ్మకాలు బాగా జరుగుతాయి. - యేసు, మొగల్తూరు రైతు

కాయకు ఐదు రూపాయలే వచ్చే ఆదాయం 50 వేలు
నేను గత 20 సంవత్సరాలుగా ఆవకాయ సీజన్ లో హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటూ , పచ్చడి మామిడి కాయలు ముక్కలు కొడుతూ ఉపాధి పొందుతున్నాను. నేను మాత్రమే కాదు వందల మంది ఏపిలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి ఈ సీజన్లో ముక్కలు కొట్టడం ద్వారా రోజుకు 2వేల రూపాయల వరకూ సంపాదిస్తుంటారు. అన్ని ఖర్చులు పోనూ నెలకు 50 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఓ రెండు నెల పాటు ఆవకాయ పచ్చడి సీజన్లో హైదరాబాద్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. పచ్చడి మామిడి కాయ సైజును బట్టి, ఒక్కో కాయ 5రూపాయల నుంచి 10రూపాయల వరకూ తీసుకుంటాం.- నాగేశ్వరరావు, హైదరాబాద్ (మామిడి ముక్కలు కొట్టే వ్యక్తి)

Author : M Seshu