Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyundai Creta: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్‌లలో ప్రీమియం లుక్

Hyundai Creta: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్‌లలో ప్రీమియం లుక్

ABP దేశం 6 months ago

Hyundai Creta 2027 | వచ్చే ఏడాది హ్యుందాయ్ క్రెటా కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. ఈ పాపులర్ SUV కంపెనీ నుంచి నెక్ట్స్ జనరేషన్ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

కొత్త తరం క్రెటా ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దదిగా ఉండటంతో పాటు సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త క్రెటా సరికొత్త K3 ప్లాట్ఫామ్పై పనిచేస్తుంది. ఇది మెరుగైన రైడ్, హ్యాండ్లింగ్తో పాటు మరింత సేఫ్టీని అందిస్తుంది. అలాగే ఇది హైబ్రిడ్ టెక్నాలజీకి కూడా అనువుగా ఉంటుందని సమాచారం.

వాహనం సైజ్, టెక్నాలజీ

హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్ ప్రస్తుత క్రెటాతో మాత్రమే కాకుండా, కొత్త సెల్టోస్ కంటే కూడా పెద్దదిగా ఉండనుంది. కొత్త క్రెటా పొడవు సుమారు 4.5 మీటర్లు ఉండవచ్చు. ఇందులో బ్రాడ్ షోల్డర్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సన్నని DRLలతో పాటు హెడ్ల్యాంప్స్ రానున్నాయి. స్పై షాట్స్ ఆధారంగా చూస్తే, దీని లుక్ చాలా ప్రీమియంగా, టాప్ క్లాస్ కారులా కనిపిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా డిజైన్ ఎలా ఉంటుంది?

కొత్త క్రెటాలో హెల్తీ క్లాడింగ్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, స్టాండర్డ్ మోడల్లో కూడా 18 అంగుళాల వరకు ఉండే పెద్ద వీల్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ విషయానికి వస్తే, ఇందులో 12.3 అంగుళాల స్క్రీన్లతో పాటు క్లైమేట్ కంట్రోల్ కోసం అదనపు స్క్రీన్ను ఇవ్వనున్నారు. అయితే బటన్స్ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. వెన్యూ (Venue)లో ఉన్న సరికొత్త హ్యుందాయ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను మరిన్ని కొత్త ఫీచర్లతో ఇందులో చేర్చనున్నారు.

హ్యుందాయ్ కొత్త క్రెటాలో కొత్త స్టీరింగ్ వీల్, న్యూ బటన్స్, వెంటిలేషన్ సౌకర్యంతో కూడిన ట్విన్ పవర్డ్ సీట్లు, మరిన్ని వాయిస్ కమాండ్స్ ఉంటాయి. వీటితో పాటు వెనుక సీటు ప్రయాణికుల కోసం బాస్ మోడ్ (boss mode) ఇవ్వనున్నారు. మొత్తానికి కొత్త క్రెటా విలాసవంతంగా, పెద్దదిగా, విశాలంగా ఉండనుంది. ఇందులో 1.5 లీటర్ NA పెట్రోల్, టర్బో, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త క్రెటా వచ్చే ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ SUV కారులో 1.5 లీటర్ పెట్రోల్ (నేచురల్, టర్బో), డీజిల్ ఇంజిన్లు లభిస్తాయని భావిస్తున్నారు. వీటితో పాటు ఒక హైబ్రిడ్ వెర్షన్ కూడా ఇవ్వనున్నారు. మొత్తానికి, కొత్త క్రెటా మరింత ఎక్కువ స్పేస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. ఈ నెక్స్ట్ జనరేషన్ క్రెటా SUV సెగ్మెంట్లో ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని కంపెనీ భావిస్తోంది.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam