Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?

Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?

ABP దేశం 3 months ago

Pallaburusu Movie Latest Song Ichi Padeddam Lyrics In Telugu: స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, పల్లె నేపథ్యంలో తెరకెక్కిన తాజా సినిమా 'పళ్ళబురుసు'.

ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రధారులు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఆల్రెడీ విడుదలైన ఫోక్ సాంగ్ 'కొత్త సోకు...' ఛార్ట్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య టీజర్ విడుదల చేశారు. ఇప్పుడీ సినిమా నుంచి రెండో పాట 'ఇచ్చి పడేద్దాం' విడుదలైంది. ఆ సాంగ్ లిరిక్స్ చూడండి.

బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే!
'కొత్త సోకు...' జానపద గీతం శైలిలో సాగితే... రెండో పాట 'ఇచ్చి పడేద్దాం'ను ట్రెండీగా చేశారు సంగీత దర్శకుడు పవన్ సీహెచ్. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ'కి మ్యూజిక్ అందించినది ఈయనే. ఇప్పుడు పెళ్లి నేపథ్యంలో సాగే బారాత్ సాంగ్ 'ఇచ్చి పడేద్దాం'ను అదరగొట్టారు. ట్రెండీ పదాలతో ఈ పాటను రాశారు లిరిసిస్ట్ సురేష్ గంగుల. ఈ పాటను మనీషా ఈరబత్తిని, నితీష్ పాడారు. ఆ లిరిక్స్ చూస్తే...

పల్లవి:
ఇచ్చిచ్చి ఇచ్చిచ్చి ఇచ్చిపడేద్దాం
ఇచ్చిచ్చి ఇచ్చిచ్చి ఇచ్చిపడేద్దాం
దావతైనా బారాతైనా
గల్లాటైనా గమ్మత్తైనా
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం

దోస్తానైనా దిల్దారైనా
ధూంధాం అయినా దందం అయినా
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి పడేద్దాం
ఎవడిది వాడికి ఇచ్చి పడేద్దాం

ఇలకత మఫిలియా ఓఓ సాయో
ఇల్లు పీకి పందిరెయ్యా ఓఓ తాయే
కల్లుతాగి చిందులెయ్యా ఓఓమాయో
తొణకం బెణకం ఎవడికి దొరకం

గాలా గాలాలాలా
గోల గోలాలాలా ఊలాలా
పిల్లా నా గుండెల్లా
సంతోషాల సిండ్రెల్లా

సంకిగాళ్ల దోస్తిగట్టి
సంకనున్న డప్పేసి
అద్దరగొట్టుద్దాము
ఊరువాడు ఊపేద్దాము
ఉన్నదంతా సూపిద్దాము
ఉల్టాపల్టా చేసేద్దాము
ధన ధన ధన
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం

చరణం1
ఫ్రెండుగాడి పెళ్లిలోన
డీజే బెట్టి ఎగురుదాం
లొల్లిజేస్తే ఎవ్వడైనా
గల్ల బట్టి గుంజుదాం

మస్తుగున్న పోరిముందు
కతలెన్నో పడదాం
సొక్కిసోలి పోయేదాక
సొక్కాదీసి ఆడుదాం
ఆడుదాం ఓఓఓ
తీన్ మార్ ఆడుదాం...ఓఓఓఓ

వినోదం, భావోద్వేగాలు, పల్లెటూరి నేపథ్యాన్ని మేళవించి రూపొందించిన 'పళ్ళ బురుసు' చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam