Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Serial Today April 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 2 లక్షల కోసం రచ్చ చేసేసిన కామాక్షి! ఆస్తి పంచేయ్‌మని గొడవ చేసిన సాగర్!

Illu Illalu Pillalu Serial Today April 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 2 లక్షల కోసం రచ్చ చేసేసిన కామాక్షి! ఆస్తి పంచేయ్‌మని గొడవ చేసిన సాగర్!

ABP దేశం 3 weeks ago

Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ ఫంక్షన్లో అందరితో పాటు డ్యాన్స్లు వేస్తుంటే వేదవతి వచ్చి ఆపి ఏయ్ ఆగు నువ్వే ఏమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా..

ఇలా గంతులేస్తున్నావ్.. నీ కడుపులో బిడ్డకి ఏమవుతుంది అని అంటుంది. ఇంతలో ఇడ్లీబాబాయ్ ఫుల్లుగా తాగేసి వచ్చి అందరితో ఓ మాట చెప్పాలి.. దాచుకో లేకపోతున్నా అని వల్లీకి కడుపు లేదు అని చెప్పాలని అనుకుంటాడు. భాగ్యం ఎంత ఆపాలని చూసినా ఆగడు.. దాంతో భాగ్యం.. కామాక్షి దగ్గరకు వెళ్లి అట్టా చూడు మీ తమ్ముడు మీ ఆయనతో ఎలా సంతకాలు పెట్టించుకుంటున్నాడో అని తగిలిస్తుంది.

భాస్కర్ సంతకం పెట్టే టైంకి కామాక్షి వెళ్లి భాస్కర్ చేతిలో పేపర్లు తీసుకొని రామరాజుని పిలుస్తుంది. దాంతో ఇడ్లీబాబాయ్ చెప్పాల్సిన విషయం ఆగిపోతుంది. కామాక్షి రామరాజుకి పేపర్లు చూపించి మీ చిన్ని కొడుకు ఏం ఘనకార్యం చేశాడో చూడండి నాన్న అని అంటుంది. ఈ పేపర్లు ఏంటి పెద్దమ్మాయ్ అని రామరాజు అడిగితే మీ చిన్న కొడుకు కారు కొనడం కోసం మా ఆయనని మాయ చేసి ష్యూరిటీ సంతకం చేయించుకుంటున్నాడు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. భాగ్యం నవ్వుతూ ఉంటే ఇదంతా నీ పనేనా అని ఇడ్లీబాబాయ్ అడుగుతాడు. అవును అని భాగ్యం అంటే మన కిందే తాడు పీకేసిన బాంబ్ ఉంది.. అది ఎప్పుడు పేలి చస్తుందో అని టెన్షన్గా ఉంటే ఇలా మంట పెట్టే ప్రోగ్రామ్లు ఏంటే అని అంటాడు. వల్లీ భాగ్యంతో నీకు అసలు బుద్ధి ఉందానే.. నేను సంతోషంగా ఉండే టైంలో ఎందుకే ఇలా చేసి చచ్చావ్ అని అడుగుతుంది.

మోడ్రన్ డ్రెస్లో మెరిసిపోయిన శ్రీలక్ష్మీ...అటవీలో మ్యాడీతో లక్ష్మీ ఏం ఆట ఆడింది...?

కామాక్షి తండ్రితో ఇందుకేనా మా ఆయన్ను ప్రేమగా పిలిచి ఫంక్షన్కి పిలిచింది ఇలా సంతకాలు పెట్టించుకోవడానికేనా.. రేయ్ నువ్వు మా ఇంటికి వచ్చి అడిగిన రోజే చెప్పా మా ఆయన సాక్షి సంతకం పెట్టడం కుదరదు అని అయినా సరే ఇలా దొంగ చాటుగా సంతకం పెట్టించుకుంటున్నావ్ అంటే ఏంట్రా నీ ఉద్దేశం.. ఆ నడిపోడు.. వనజ వాళ్ల డబ్బుతో దొంగచాటుగా ఉద్యోగం కొనుకున్నట్లు నువ్వు కూడా దొంగ చాటుగా మోసాలు మొదలు పెట్టావన్నమాట అని అంటుంది. వదినా విషయం తెలీకుండా మా ఆయన్ను దొంగ అంటే బాగోదు అని ప్రేమ అంటుంది. ఏం బాగోదు అసలు మా అమూల్య విషయంలో నువ్వు చేసిన పనికి నీకు ఇంట్లో ఉండే అర్హతే లేదు.. ఇక ఏం మాట్లాడుతావమ్మా అని అంటుంది. అక్క అమూల్య విషయంలో ఏం జరిగిందో నీకు తెలీదు అనవసరంగా ప్రేమని అనొద్దు అని ధీరజ్ అంటాడు. ఇద్దరూ భలే సపోర్ట్ చేసుకుంటున్నారు అని కామాక్షి చెలరేగిపోతుంది. ఇద్దరూ మోసం చేసి సంతకాలు పెట్టించుకోవాలి అనుకున్నారు.. అయినా నీకు మీ ఆయన మీద అంత ప్రేమ ఉంటే మీ సొంత ఆస్తులు ఇవ్వొచ్చు కదా ఇలా మోసం చేసి సంతకాలు పెట్టించుకోవడం ఏంటి అని అంటుంది. నడిపోడి దొంగతనానికి వాడి పెళ్లాం సాయం నీ మోసానికి నీ పెళ్లాం సాయం ఎలాంటి కోడళ్లు వచ్చారు మా ఇంటికి అంటుంది.

జేడీ,కేడీ ఎవరో కనిపెట్టిన అవినాష్...మంత్రి కొడుకును ఎన్కౌంటర్ చేయమని ఆదేశించిన సాధూ..

వేదవతి కామాక్షిని లాగిపెట్టి కొడుతుంది. చిన్నోడికి వాళ్ల నాన్న డబ్బు ఇస్తాను అన్నా వాడి కాళ్ల మీద వాడు నిలబడాలి అనుకున్నాడు.. అక్క మొగుడు అని చనువుతో అడిగాడు.. రెండు లక్షలకి మాయ మోసం అంటు రెచ్చిపోతావా బుద్ధి లేకపోతే సరి.. అని వేదవతి తిడుతుంది. నీ కొడుకు తప్పు చేస్తే నన్ను కొడతావా.. అని భర్తని తీసుకొని వెళ్లిపోతుంది. రామరాజు ధీరజ్తో ఒరేయ్ ఏంట్రా ఇది నన్ను సంతోషంగా ఉండనివ్వరారా మీరు.. ఎంత సేపు తలదించుకునే పనులు పనిగా పెట్టుకున్నారా ఏంట్రా మీరు అని అంటాడు. నాన్న దయచేసి అలా అనకండి.. కారు ఫైనాన్స్ కోసం ఎవరో ఒకరి సంతకం కావాలి అంట అందుకే బావని అడిగా అంటుంది. ఓరేయ్ చిన్నోడా మీ అక్క ఎంత గయ్యాలిదో,, పిసినారిదో తెలిసి కూడా ఇలా తన భర్తని ఎందుకు అడిగావ్రా.. మీ నాన్న ఇస్తాను అన్నారు కదా తీసుకుంటే అయ్యేది కదా అంటుంది. తండ్రి దగ్గర తీసుకునే హక్కు నీకు ఉంది కదా ధీరజ్ ఎందుకు తీసుకోలేదు అని నర్మద అడుగుతుంది. నాన్న కష్టార్జితం తీసుకునే హక్కు నాకు లేదు వదినా అని ధీరజ్ అంటాడు. ఇదంతా నాన్న సంపాదించి నేను సంపాదించి కాదు కదా అమ్మా.. మరి ఆస్తిలో నాకు ఎలా హక్కు ఉంటుంది అని అంటాడు.

కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మారిపోయాడా! సహస్రతో హ్యాపీగా ఉంటాడా! ఛైర్మన్ పదవి కోసం అంబిక మాస్టర్ ప్లాన్!

ప్రసాదరావు సాగర్కి వెళ్లి మాట్లాడమని అంటాడు. దాంతో సాగర్ వెళ్లి ఏం మాట్లాడుతున్నావ్రా నువ్వు ఆయన కష్టపడి సంపాదించినా సరే కొడుకులుగా ఇది మన ఆస్తి. కొడుకులుగా ఈ ఆస్తి మీద మనకు పూర్తి సర్వ హక్కులు ఉన్నాయి. ఆస్తిలో వాటా తీసుకునే హక్కు.. అనుభవించే అధికారం మనకు ఉన్నాయి.. అందుకే ముష్టి రెండు లక్షలు కోసం వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఏం ఉందిరా నీకు ఈ ఆస్తిలో నీకు ఎంత వాటా వస్తుందో అంతా తీసుకో అని అంటాడు. సాగర్ ఆస్తి పంపకాల మాటలకు అందరూ షాక్ అయిపోతారు. అలా కాదురా అని ధీరజ్ అంటే రామరాజు ఆపి వాడిని అలా అంటున్నావేంట్రా.. ఆస్తిలో ఎవరి వాటా వాళ్లది ఏంట్రా కొత్తగా వాడి వాటా వాడిని తీసుకోమని నూరిపోస్తున్నావేంట్రా.. అంటే రేపటి రోజున నీ వాటా నీకు ఇవ్వమని అడిగేలా ఉన్నావ్ కదా అని అంటాడు. నర్మద తండ్రి వచ్చి ఇందులో తప్పేముందు ఈ రోజు కాకపోతే రేపు ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే కదా.. లేకపోతే వాటా ఇవ్వకుండా పిల్లలకు అన్యాయం చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతాడు. నా పిల్లలు నాకు ప్రాణం వాళ్లకి ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు.. మీరు మా విషయంలో జోక్యం చేసుకోకపోతే మంచిది అని అంటాడు. నాన్న ఇక్కడ గొడవ చేయడానికి వచ్చారా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని నర్మద అడిగితే మా మామగారు నా తరుఫున మాట్లాడుతున్నారు.. నేను నా తమ్ముడి తరుపున మాట్లాడుతున్నా ఇందులో తప్పేముంది అని సాగర్ అడుగుతాడు.

రేయ్ చిన్నోడా నేను మాట్లాడిన దానిలో తప్పేముందిరా.. ఈ ఆస్తిలో మనకు హక్కు ఉంటే వాటా పంచి ఇవ్వమని అడగటంతో తప్పేముంది.. ఈ విషయం ఈయనతో సహా ఇక్కడ ఉన్నవాళ్లు అందరికీ అర్థమయ్యేలా చెప్పరా,, ఆస్తిలో మన వాటా మీద మనకు హక్కు ఉందని అందరికీ చెప్పు అంటాడు సాగర్.. అన్నయ్యా ప్లీజ్ ఇంకోసారి నాన్న ముందు గొంతు పెంచి మాట్లాడకు.. వాటాలు అంటూ మాట్లాడకు అని ధీరజ్ అంటాడు. నీ మంచి కోసమే కదరా నేను అంటున్నా అని సాగర్ అంటే నా మంచి కోసం ఏం చేయాలో నాకు తెలుసు.. నాన్నలా నేను నా కళ్ల మీద నిలబడి కష్టపడి డెవలప్ అవ్వాలి అనుకుంటున్నా అది నా పర్సనల్ విషయం అందులో ఎవరూ తల దూర్చకండి. ఇంట్లో సంతోషం పొగొట్టకండీ అని దండం పెట్టి వెళ్లిపోతాడు.

సాగర్ ఇచ్చిన షాక్కి రామరాజు అలా ఉండిపోతాడు. వేదవతి కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఇడ్లీ బాబాయ్ బస్తా పట్టుకొని బావ నా కూతురు నెల తప్పలేదు.. అని చెప్తాడు. భాగ్యం భర్త ముఖం మీద నీళ్లు చల్లి నెత్తి పగల గొడుతూ నువ్వు చేసిన పనికి మనం రోడ్డున పడేవాళ్లం.. నోరు తెరిస్తే చంపుతా అని తిడుతుంది. ఇంతలో అక్కడికి నర్మద వస్తుంది. నర్మదని చూసి భాగ్యం భయపడుతుంది. ఏం చెప్పేద్దాం అని అంటున్నారు అని నర్మద అంటే ఇడ్లీబాబాయ్ చెప్పాలని చూస్తే భాగ్యం ఇడ్లీబాబాయ్ కాలు తొక్కుతుంది. భాగ్యం ఏదో ఒకటి కవర్ చేయాలని చూస్తే కాదు అని ఇడ్లీబాబాయ్ అంటాడు. బాబాయ్ ఏదో చెప్పాలని చూస్తున్నాడు అని నర్మద అంటే ఏం లేదు తిక్కగా ఏదో మాట్లాడుతాడు అని అంటుంది. నర్మద వాళ్లతో ఇందాక జరిగిన గొడవకి మీకు ఏదో సంబంధం ఉందని డౌట్గా ఉందని అంటుంది. మీ కూతురి నెల తప్పిందని సాటి ఆడదానిగా ఒక చెల్లిగా మిమల్ని వదిలేశా.. ఇందాక జరిగిన గొడవలో మీ ప్రమేయం ఉందని తెలిస్తే ఊరుకోను అంటుంది. ధీరజ్ జరిగిన గొడవ తలచుకొని చాలా బాధ పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam