Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది.
ఈ రోజు(ఆగస్టు 4న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏయ్ నీకు బుద్ధుందా..
వేదవతి ఆరు బయట తిరుగుతూ ఉంటే ఏమైందని నర్మద వచ్చి అడుగుతుంది. దానికి వేద మీ మామయ్య బయటకు వెళ్తున్నారు కదా నేను ఎదురు రాకుండా ఆయన బయటకు వెళ్లరు కదా అందుకే ఇక్కడ ఉన్నాను అని వేదవతి అంటుంది. రామరాజు రావడం చూసి చాలా ఎంతోషంగా ఎదురు నిల్చొంటుంది. రామరాజు బయటకు వచ్చి అమూల్యని పిలుస్తాడు. శ్రీవల్లి వచ్చి అమూల్య ఇంట్లో లేదు మామయ్య గారు కాలేజ్‌కి వెళ్లింది.. ఏమైనా కావాలా అని అడిగితే బయటకు వెళ్తున్నా ఎదురు రామ్మా అని అంటాడు. శ్రీవల్లి ఎదురు వెళ్తే చందు వచ్చి ఆపుతాడు. ఏయ్ నీకు బుద్ధుందా.. నువ్వేంటే మా నాన్నకి ఎదురు వస్తున్నావ్ అని వల్లీని ఆపుతాడు. తర్వాత తల్లిని ఎదురు రమ్మని అంటాడు. రామరాజు వద్దు అని అంటే లేదు నాన్న అమ్మే రావాలి అని చందు చెప్పి వేదవతిని ఎదురు రమ్మని అంటాడు. వేదవతి తల్లి వచ్చి పుట్టింటి మీద ప్రేమతో పుట్టింటి పరువు పోకూడదు అని అలా చేసింది తనని క్షమించొద్దు అని అంటే.. తన కోసమే కదా తన పుట్టింటి వాళ్లు ఎన్ని మాటలు అన్నా పడ్డాను ఇప్పుడు తను నన్ను మోసం చేసింది అని వెళ్లిపోతాడు.
మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
కచ్చితంగా ఏదో జరిగింది..
వేదవతి తల్లి ఏడుస్తూ నేను పుట్టిన రోజు జరుపుకోకుండా ఉండాల్సింది..నా వల్లే నా మనవడు మనవరాలు విడిపోయారు.. ముందు నేను ఆశ పడగానే రెండు కుటుంబాల మధ్య పుట్టినరోజు జరిగే ప్రసక్తే లేదు అని భద్రావతి తేల్చిచెప్పినప్పుడు అయినా నేను నోరు మూసుకొని ఉంటే ఇంత జరిగేది కాదు.. తర్వాత నా కోసం ఒక మొట్టు దిగొచ్చి పుట్టిన రోజు జరుపుకోవడానికి ఒప్పుకున్నాను అని భద్రావతి చెప్పింది.. భద్రావతి మొదటి మాటకే కట్టుబడి ఉంటే బాగుండేది.. ఈ గొడవ జరిగేది కాదు అని బామ్మ ఏడుస్తుంది. బామ్మ మాటలకు నర్మద షాక్ అయిపోతుంది. ఏంటి బామ్మ ముందు పుట్టిన రోజు వద్దు అన్నారా అని అడిగితే అవునమ్మా ముందు అవసరం అయితే పుట్టినరోజు మానేస్తా కానీ రామరాజు కుటుంబంతో కలిసే ప్రసక్తే లేదు అని భద్రావతి చెప్పింది.. కానీ ఏద దేవుడు తన మనసు మార్చాడో కానీ.. ఏకంగా ఈ ఇంట్లోనే పుట్టిన రోజు జరిపించడానికి ఒప్పుకుంది అని బామ్మ అంటుంది. ఇవన్నీ చూస్తే ముందే ఏదో ప్లాన్ చేసుంటారు అని అనిపిస్తుందని నర్మద అంటుంది. ధీరజ్, ప్రేమల పెళ్లి గురించి మా అక్క వాళ్లకి తెలీదు కదా అని వేదవతి అంటే ఎవరైనా చెప్పుండొచ్చు కదా అని నర్మద అంటుంది. అక్కడే ఉన్న వల్లీ తెగ టెన్షన్ పడిపోతుంటుంది. కచ్చితంగా ఏదో జరిగింది అత్తయ్యా అదేంటో తెలుసుకుంటాను అని నర్మద అంటుంది.
ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?
నా బతుకు బస్‌స్టాండ్ ఖాయం.. 
నర్మదకి నా మీద అనుమానం వచ్చేసింది అని వల్లీ గదిలో అటు ఇటూ తిరుగుతూ టెన్షన్ పడుతుంది. ఇంతలో నర్మద వచ్చి అక్క నీకో టైలర్ చూపిస్తా చూడు అని వల్లీ భద్రావతితో మాట్లాడిన సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తుంది. వల్లీ చాలా టెన్షన్ పడి చెమటలు పట్టేస్తుంది. ఆ భద్రావతితో నీకు మాటలేంటి.. అంటే ధీరజ్ ప్రేమలు విడిపోవడం వెనక నీ పాత్రే ఉందా.. ఇంటి వెనక ఆవిడతో నువ్వు మాట్లాడటానికి కారణమేంటి అని నర్మద అంటుంది. దాంతో వల్లీ మేం గార్డెన్లో మాట్లాడుకున్నాం కదా ఇంటి వెనక అంటుంది ఏంటి నిజం చెప్పించడానికి రాయి వేసిందా అనుకొని వీడియో మళ్లీ చూపించమని వీడియో చూసి ఇది ఏఐ వీడియో అని ఎవరో నన్ను ఇరికించాలి అని ఇలా చేశారు అని అంటుంది. దాంతో నర్మద ఈ వీడియో చేసింది నేనే.. మీ ఇద్దరూ మాట్లాడితే ఎలా ఉంటుందో అని ఇలా చేశాను అని నర్మద అంటుంది. వీడియో అబద్ధం అయినంత మాత్రానా నువ్వు చెప్పింది నిజం కాదు ఏదో కుట్ర జరిగింది అదేంటో తేల్చుతా అని నర్మద అంటుంది.
ధీరజ్‌ని గెంటించేసిన ప్రేమ.. 
ధీరజ్ ప్రేమ కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లి ప్రేమ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో ప్రేమ వస్తుంది. ధీరజ్ దగ్గరకు వెళ్తే ప్రేమ పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. నీతో మాట్లాడాలి అనే ఇక్కడ వెయిట్ చేస్తున్నా అని ధీరజ్ అంటే మొన్న ఇంట్లో మాట్లాడినవి సరిపోలేదా అని ప్రేమ అంటుంది. ధీరజ్ ప్రేమ వెనకాలే పడుతూ ఉన్న పట్టించుకోదు.. ఇంతలో సెక్యూరిటీ చూసి ధీరజ్‌ని ఆపి ఎందుకు అలా వెంటపడుతున్నావ్ తను ఎవరు అని అడిగితే ధీరజ్ తెలిసిన అమ్మాయి బాగా కావాల్సిన అమ్మాయి అంటాడు. ప్రేమ మనసులో కనీసం భార్య అని కూడా చెప్పడం లేదు అని అనుకుంటుంది. ఇతను ఎవరో నీకు తెలుసా అని సెక్యూరిటీ ప్రేమని అడిగితే ఏం కాడు.. అతను ఎవరో కూడా నాకు తెలీదు అని ధీరజ్‌ని ఇరికించేస్తుంది. దాంతో సెక్యూరిటీ ధీరజ్‌ని బయటకు గెంటేస్తాడు.
మా చెల్లి మీ అన్నయ్య గురించి..
అమూల్య కోసం వెయిట్ చేస్తుంటాడు. అమూల్య రాగానే ఓ ముఖ్యమైన విషయం గురించి నీతో మాట్లాడాలి అని అమూల్య చేయి పట్టుకుంటాడు. చేయి వదలరా అని అమూల్య అరుస్తుంది. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమూల్య అంటే నాతో మాట్లాడటానికి నీకేం ఉంటాయిరా అని అమూల్య అంటుంది. దానికి విశ్వక్ మా చెల్లి గురించి మీ అన్నయ్య గురించి మాట్లాడాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

