Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?

Illu Illalu Pillalu Serial Today August 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ధీరజ్! ధీమా విడిపోవడానికే వల్లీనే కారణమని తెలుసుకున్న నర్మద ఏం చేయనుంది?

ABP దేశం 5 days ago

Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది.

ఈ రోజు(ఆగస్టు 5న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనిద్దరం కలిసి వాళ్లని కలుపుదాం..

విశ్వక్ అమూల్యతో మీ అన్నయ్య, మా చెల్లిని మనిద్దరం కలిసి కలుపుదాం అని అంటాడు. ఏంట్రా మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టావా..చెల్లి కాపురం సమస్యల్లో పడింది అనే బాధ లేకుండా దాన్ని కూడా వాడుకోవాలి అనుకుంటున్నావా.. సిగ్గు అనిపించడం లేదా అని అమూల్య అడుగుతుంది. నా చెల్లిలి కాపురం సమస్యల్లో పడింది కాబట్టే ఒక అన్నయ్యలా.. నా చెల్లి కాపురం చక్కదిద్దాలి అని అనుకున్నాను కాబట్టే నీ సాయం అడుగుతున్నా అని విశ్వక్ అంటాడు. అమూల్య ఎమోషనల్ అవుతూ ఒకప్పుడు కూడా ఇలాగే చెప్పావ్.. మన రెండు కుటుంబాలు కలవాలి.. అది మన పెళ్లితోనే సాధ్యం అవుతుంది అని చెప్పావ్.. ఆ మాట నిజం అని నమ్మినందుకు నా జీవితం సగం నాశనం చేసుకున్నా.. మా నాన్నని చావు అంచుల వరకు తీసుకెళ్లాను.. మరి మళ్లీ నిన్ను ఎలా నమ్ముతా అనుకున్నావ్రా అని అమూల్య ప్రశ్నిస్తుంది. ఒకప్పుడు మీ కుటుంబం మీద పగతో అలా చేశాను.. కానీ కోర్టులో నువ్వు నాకు క్షమాభిక్ష పెట్టడం వల్ల మారాను.. ఇప్పుడు మా చెల్లి మీద ప్రేమ తన కాపురం నిలబెట్టాలి అనే ఆశ తప్పు ఇంకేం లేవు అని విశ్వక్ చెప్తాడు. మీ ఫ్యామిలీ మొత్తం కలిసిపోయాం అని ఎంత చేశారో చూశానురా.. అని అమూల్య విశ్వక్ మాటలు వినదు.. నిన్ను ఈ జన్మలో నమ్మను.. ఈ వంకతో నాతో మాట్లాడాలని చూస్తే నిన్ను మా ఇంట్లో అందరూ కొడతారు అని చెప్పి వెళ్లిపోతుంది.

Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్కి ఎసరు వేస్తారా?

యూ ఆర్ నాట్ మై పెళ్లాం..

ధీరజ్ మందు తాగుతూ ఉంటాడు. తిరుపతి దగ్గరుండి ధీరజ్ని తాగిస్తాడు. ప్రేమ తనని ఎవరో తెలీదు అని చెప్పి తప్పు చేసింది అని ధీరజ్ ఇదంతా తప్ప.. నేను ఎవరో తెలీదు అని చెప్తావా అని తిరుపతిని కొట్టడానికి వెళ్తాడు. అంతా ప్రేమ మేడ మీద నుంచి చూస్తుంది. తిరుపతి కూడా తాగిన మత్తులో ధీరజ్కి ప్రేమలా కనిపించాలి అని చీర చుట్టుకుంటాడు. ఇదేంటి మామ అని ధీరజ్ అడిగితే ఇప్పుడు నేను నీ ప్రేమని.. నన్ను ప్రేమ అనుకొని నీ మనసులో ఫ్రస్టేషన్ మొత్తం తీసేయ్ అని చెప్తాడు. ధీరజ్ తిరుపతి చేయి కొరికేసి సెక్యూరిటీ నన్ను తోసేస్తుంటే నేను ఎవరో తెలీదు అంటావా అని తిరుపతిని కొట్టడానికి వెళ్తాడు. ప్రేమ మొత్తం చూసి తల పట్టుకుంటుంది. ధీరజ్ని ఆపడానికి వాళ్ల దగ్గరకు వస్తుంది. గుడ్ మార్నింగ్ శత్రుదేశ యువరాణి గారు.. ఇంకా నిద్రపోకుండా రాత్రి ఇలా తిరగడం ఏంటి.. ఆ చూపు ఏంటే మొగుడ్నే అలా చూస్తావా నువ్వు చూపు దించు అని ధీరజ్ తాగిన మైకంలో మాట్లాడుతాడు. ఏం చూసుకొనే నీకు అంత టెక్కు.. అందం ఉందనా.. అందగత్తెవేలే అని బుగ్గలు గిచ్చేసి.. జున్నులా ఎంత బాగున్నాయో చూడు అని అంటాడు. ప్రేమ ధీరజ్ని తోసేస్తుంది. దాంతో ధీరజ్ నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదే.. మరి ఇలా తోసేస్తున్నావ్.. సెక్యూరిటీ అడిగితే ఎందుకే నేను నీ మొగుడు అని ఎందుకు చెప్పలేదే.. ఎందుకే అంత పొగరు.. యూ ఆర్ నాట్ మై పెళ్లాం అని ధీరజ్ తాగిన మత్తులో వాగుతాడు. ఇద్దరూ పొట్లాడుకుంటారు. ప్రేమ ధీరజ్ని తోసేసి వెళ్లిపోతుంది.

Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

మొత్తం వల్లీనే చేసింది పక్కా..

నర్మద బామ్మ చెప్పిన మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ ఈగోలు పక్కన పెట్టి ఇంటికి వచ్చారు.. మెల్లగా గొడవలు బయట పెట్టి పెద్దవి చేసి ప్రేమ, ధీరజ్లను విడదీశారు. ఈ ఇంటికి ఉన్న శత్రువులు భద్రావతి, వల్లీ.. ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం భద్రావతికి తెలీదు.. ఇక వల్లీ గుట్టు మొత్తం అత్తయ్యకి తెలిసిపోయింది అని వల్లీనే పగ పట్టి ప్రేమ, ధీరజ్ల మేటర్ వల్లీనే కచ్చితంగా భద్రావతికి చెప్పొచ్చు.. ఇదంతా కచ్చితంగా వల్లీనే చేసుకుంటుంది అని నర్మద అనుకుంటుంది. ఇదంతా ఏంటి అని సాగర్ అంటే నర్మద విషయం చెప్తే వాళ్లంతా కాదు ప్రేమ, ధీరజ్లను విడదీసిన వాళ్లు నువ్వు, మా అమ్మే మీ ఇద్దరే వాళ్లని కలపండి అని సాగర్ అంటాడు. నర్మద మాత్రం ఇదంతా వల్లీనే చేసింది అస్సలు క్షమించను అని అనుకుంటుది. ఉదయం ధీరజ్, తిరుపతి రోడ్డు మీద చెప్పులు తల కింద పెట్టుకొని పడుకోవడం విశ్వక్ చూసి జాలి పడతాడు. ఇంతలో ప్రేమ వచ్చి వాళ్ల మీద నీరు విసిరేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam