Illu Illalu Pillalu Serial Today Episode: ప్రేమ ధీనంగా ఉంటే నర్మద వెళ్లి ఏంటి ఇంత ఫీలైపోతున్నావ్ అంటే నా మొగుడు నా మొగుడు అని మల్లెల్లో పెట్టి చూసుకుంటే ముక్కు కోసేశాడు..
వాడి కారు కొనడానికి నేను సాయం చేస్తే నన్ను పక్కన పడేశాడు.. నన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పలేదు అని తెగ ఫీలైపోతుంది. దానికి నర్మద సెటైర్లు వేస్తూనే ఎవరికైనా తల్లిదండ్రులే ముఖ్యం కదా అని ప్రేమకి సర్ది చెప్తుంది. స్పెషల్ సర్ఫ్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడేమో అని నర్మద అంటుంది. అబ్బో పెద్ద సర్ఫ్రైజ్ నా ముఖానికి అది ఒక్కటే తక్కువ.. మంచి నీళ్లు ఇవ్వనోడు బాధం పాలు ఇస్తాడా అని ప్రేమ నోరు విప్పుతుంది.
ప్రేమ నెత్తి మీద చేయి వేసుకొని కూర్చొని ఉంటే ధీరజ్ వచ్చి తింగరి నువ్వు ఇక్కడ ఉన్నావా.. నీ కోసం మొత్తం వెతుకుతున్నా.. మంచి స్ట్రాంగ్ కాఫీ చేసి ఇవ్వు అని అడుగుతాడు. నర్మద ఆ మాటలకు నవ్వుతూ ఉంటుంది. నా చేతులతో ఎందుకు బాబు.. నీకు కారు ఉంది కదా అందులో మీ అమ్మని ఎక్కించుకొని కిచెన్కి వెళ్లు కాఫీ ఇస్తుంది.. కారు ఎక్కించుకోవడానికి పనికి రాను కానీ కాఫీ పెట్టాలంట అని అలిగి పోయింది వెళ్లిపోతుంది. ఏంటి వదినా ఈ తింగరి ఇలా అయిపోతుంది అని ధీరజ్ అడిగితే కారు ఎక్కించుకోలేదని ఈ అలక అని నర్మద అంటుంది. ఇప్పుడు తనని బయటకు తీసుకెళ్లాలి అని వచ్చా వదినా.. అందుకే ఆట పట్టించా అని అంటాడు. త్వరగా తీసుకెళ్లు అని నర్మద అంటుంది.
ప్రేమ అలిగి గదిలోకి వెళ్తే ధీరజ్ బయటకు వెళ్దాం పద అని అంటే ప్రేమ వద్దు అని చెప్పి డోర్ వేసేస్తుంది. ధీరజ్ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ప్రేమ చీర కట్టుకొని బయటకు వస్తుంది. ధీరజ్ ప్రేమకి ఫిదా అయిపోయి ప్రేమ చుట్టూ తిరుగుతాడు. ఏంటే ఇంత అందంగా రెడీ అయ్యావ్ అంటే నీతో రావడానికి నా ఫ్రెండ్ భర్త్డే ఫంక్షన్కి అని అంటుంది. సరే అయితే వెళ్లు నీ ఫ్రెండ్ భర్త్డే ఫంక్షన్కి అని చెప్పి వెళ్లిపోతాడు. ధీరజ్ వెళ్లిపోతాడు అని ప్రేమ అనుకుంటే ధీరజ్ వచ్చి ప్రేమని ఎత్తుకొని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ప్రేమని రాత్రి పూట ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్తాడు. ప్లేస్ మొత్తం డెకరేషన్ చేసి చాలా అందంగా రెడీ చేస్తారు. ప్రేమ చూసి ఎంత అందంగా ఉందిరా.. ఇదంతా నువ్వే చేశావా నా కోసం చేశావా అని అంటుంది. నేను ఇలా కారు కొనడానికి నా సంతోషానికి నా గోల్స్ రీచ్ అవ్వడానికి కారణం నువ్వే కదా.. కారు రాగానే నిన్ను ఎక్కించుకోలేదని ఫీల్ అయ్యావు కదా.. నాకు మా అమ్మానాన్న చాలా ఎక్కువ ప్రేమ.. అనాథ అనాథ అని మానాన్నని అందరూ బాధ పెట్టేవాళ్లు.. మా అమ్మని సంతోషంగా ఉంచడం కోసం మా నాన్న జీవితం త్యాగం చేశారు అందుకే నాకు మా అమ్మానాన్న తర్వాతే ఎవరైనా అని అంటాడు. నాకు తెలుసురా.. కాకపోతే మీ అమ్మానాన్న తర్వాత నన్ను కూడా ఎక్కించుకోవాలి కదా.. అంటే మనసులో ఏదో మూల నేను లేనట్లే కదా అని అంటుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి షాక్ ఇచ్చి అపూర్వ - శరత్ చంద్ర ముందు అపూర్వ ప్లాన్ సక్సెస్
నా మనసులో ఉంది నువ్వేనే.. నా కోసం నువ్వు ఎన్నో చేశావ్.. చివరకు నీ నగలు అమ్మేయాలి అని అనుకున్నావ్.. నీ మెడలో తాళి కట్టాను.. అది మూడు రోజుల ముచ్చటే అవుతుంది అనుకున్నా కానీ నువ్వు నా ప్రాణం అయిపోయావ్ అని అంటాడు. ఒకవైపు సైకిల్ తొక్కుతూ డెలివరీ చేస్తూ నన్ను చదివిస్తూ ఎంతో కష్టపడ్డావ్.. నీలా నన్ను ఎవరూ చూసుకోరు అని అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇద్దరూ ధీమా అనే పేరు రాసున్న కేక్ కట్ చేస్తారు. తర్వాత ధీరజ్ ప్రేమకి బొకే ఇచ్చి నిన్ను జీవితాంతం నా గుండెల్లో మోస్తా ఐలవ్యూ ప్రేమ అని ప్రపోజ్ చేస్తాడు. ప్రేమ బొకే తీసుకుంటుంది. తర్వాత ఇద్దరూ రొమాన్స్లో మునిగిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

