Dailyhunt
Illu Illalu Pillalu Serial Today may 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇంటి నుంచి వెళ్లిపోతున్న సాగర్! రామరాజు అవమానం చేయడమే కారణమా!

Illu Illalu Pillalu Serial Today may 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఇంటి నుంచి వెళ్లిపోతున్న సాగర్! రామరాజు అవమానం చేయడమే కారణమా!

ABP దేశం 1 week ago

Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్, ప్రేమని తీసుకొని ఇంటికి వెళ్తాడు. నర్మద చూసి ప్రేమ పావురాలు ఎక్కడికి వెళ్లి వచ్చారు అని అడుగుతుంది.

అదేంటి నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నట్లు మీ అక్కకి కూడా చెప్పలేదా.. అసలే మీ ఇద్దరికీ తోడు దొంగలు అని మా అమ్మ పేరు పెట్టి కదా అని ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతారు. వల్లీ అది చూసి షాక్ అయిపోతుంది. వాళ్ల నవ్వులకు నా కడుపు మండిపోతుంది. వాళ్లు ఇంత హ్యాపీగా ఉండకూడదు.. నేను ఉంచకూడదు.. చెప్తా అని బెల్ మోగిస్తుంది.

అబ్బా ఈ వల్లీ మళ్లీ మొదలు పెట్టేసింది.. వచ్చే వరకు ఆగలేవా అని ప్రేమ అడుగుతుంది. పెద్దొదిన అసలే కోతి.. పైగా కళ్లు తాగింది.. దానికి తోడు కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్లు మీకు ఈ బెల్ మామూలుగా దొరకలేదుగా అని అంటుంది. అసలే నేను కడుపు మంటతో చచ్చిపోతుంటే మీరు ఈ మాటలతో చంపొద్దు అని అంటుంది వల్లీ. నీకు మా మీద అసలే మంట కదా అని ప్రేమ అంటే చెల్లాయి ఇది ఆకలి మంట.. నాకు వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు కావాలి అంటుంది. సరే అని నర్మద, ప్రేమ కిచెన్ లోకి వెళ్తారు. ఇద్దరూ బజ్జీలు చేస్తారు. వల్లీ అది చూసి గంతులేస్తుంది. ఇద్దరూ బజ్జీలు తీసుకొస్తా వల్లీ అక్కడ కనిపించదు.. ఎక్కడుందా అని చూస్తే గదిలోకి వెళ్లి బెల్ కొడుతుంది. గోడ మీద బల్లి అయినా ఒక చోట ఉంటుంది. నువ్వు మాత్రం కదులుతూనే ఉంటావా అని అడుగుతుంది.

వల్లీ నర్మద, ప్రేమలతో నా బట్టలు నేను ఇప్పుడు ఉతుక్కోవాలి.. మామయ్య చూస్తే ఏం అంటారో.. నర్మద నువ్వు ఉతుకుతావా.. ప్రేమ నువ్వు ఉతుకుతావా.. మామయ్య ఏం అంటారో నేను ఉతికితే అని అంటుంది. దాంతో ప్రేమ వద్దులే నేనే ఉతుకుతాను అని బట్టలు తీసుకెళ్తుంది. నువ్వు ఎంత మంచిదానివో చెల్లాయి.. అని వల్లీ అంటే ఏమైనా తేడా అయితే అప్పుడు చెప్తా నా మంచితనం గురించి అని ప్రేమ అంటుంది. నర్మదతో టీ తీసుకురమ్మని అంటుంది. నర్మద టీ తెస్తే వద్దు అని డైనింగ్ ఏరియా అంతా బాలేదు అని నర్మదకి పని చెప్తుంది. ప్రేమ బట్టలు ఉతికి ఉతికి నర్మద తుడిచి తుడిచి కుప్పకూలిపోతారు. తన కడుపు ఏంటో కానీ సేవలు చేయలేక చచ్చిపోతున్నాం అని ప్రేమ అంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి కూర్చొని మీ మీద రివేంజ్ ప్లాన్ చేస్తుంది మీకు అర్థం కావడం లేదా.. మీరు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఇది అని ధీరజ్ అంటాడు. వల్లీ తల పగల గొడతా అని ప్రేమ అంటే ఇలా కాదు సేవలతో చంపేయండి అని అంటాడు. ఎలా అని ప్రేమ అడిగితే ఆరోగ్యమైన జ్యూస్ అని హింట్ ఇస్తాడు.

నర్మద, ప్రేమలు కిచెన్కి వెళ్లి కాకరకాయ జ్యూస్ చేస్తారు. వల్లీకి ఇస్తారు. జ్యూస్ అడిగితే కాకరకాయ జ్యూస్ ఇస్తారా మామయ్య గారికి చెప్తా అని వల్లీ అంటే మీకు మీ కడుపులో బిడ్డకి మంచిది అని ధీరజ్ అంటాడు. నర్మద, ప్రేమలు వేదవతిని పిలుస్తారు. ఆరోగ్యానికి మంచిది అని చెప్పడంతో వేదవతి జ్యూస్ తాగించేస్తుంది. వల్లీ వాంతులు చేసుకుంటుంది. మరోవైపు సాగర్ జాబ్ చేస్తున్న ప్లేస్కి ప్రసాద్ రావు వెళ్తాడు. ఇద్దరూ ఆస్తి పంపకాలు గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో అటుగా తిరుపతి, రామరాజు వస్తారు. రామరాజు వాళ్లని చూసి బండి ఆపి.. తిరుపతి గొడుగు పడతాడు. రామరాజు సాగర్ని ఉద్దేశించి రేయ్ ఎవరో అన్నారురా.. తండ్రి చేతులు పట్టుకొని రైస్ మిల్లుకి వెళ్లడం చిన్న చూపు.. గవర్నమెంట్ జాబ్ ఏసీ.. గది అని బిల్డప్ ఇచ్చారు.. రైస్ మిల్లు అంటే కూలోడు అంటారు అని అన్నారు.. మరి రోడ్డు మీద ఇలా ఉండటాన్నిఏం అంటారురా అని తిరుపతితో అంటాడు. కన్న కొడుకుని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అని ప్రసాద్ రావు అంటే వాడేం కష్టపడి జాబ్ తెచ్చుకోలేదు.. అని తిట్టి సాగర్ చేతిలో గొడుగు పెట్టేసి వెళ్లిపోతాడు.

ప్రసాదర్ రావు సాగర్తో నీకు మా అమ్మాయికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి.. ఆ ఇంట్లో అవమానాలు పడుతూ ఉండటం ఏంటి.. బయటకు వచ్చేసి మంచి ఇళ్లు తీసుకొని వచ్చేయ్ అని అంటాడు. అదే ఆలోచిస్తున్నా అని సాగర్ అంటాడు. ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుంటే సాగర్ మాత్రం బట్టలు సర్దేస్తాడు. సాగర్ బ్యాగ్తో రావడం చూసి వేదవతి ఆ బ్యాగ్ ఏంట్రా అని అంటే మేం ఇంటి నుంచి వెళ్లిపోతున్నాం అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam