Dailyhunt
Illu Illalu Pillalu Serial Today may 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అప్పు తీర్చేసి ఇంట్లో నుంచి వెళ్లిపో..! సాగర్‌కి అదిరిపోయే కండీషన్ పెట్టిన ధీరజ్! రామరాజుకి అండగా చిన్నోడు!

Illu Illalu Pillalu Serial Today may 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అప్పు తీర్చేసి ఇంట్లో నుంచి వెళ్లిపో..! సాగర్‌కి అదిరిపోయే కండీషన్ పెట్టిన ధీరజ్! రామరాజుకి అండగా చిన్నోడు!

ABP దేశం 2 weeks ago

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ బ్యాగ్ సర్దేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతా అని మళ్లీ హడావుడి చేస్తాడు. ఈ సారి ఏమైందిరా అని వేదవతి అడిగితే కన్నకొడుకుని నడిరోడ్డు మీద అవమానించిన ఆయన నీకు ఏం జరిగిందో చెప్పలేదా అని అరుస్తాడు.

ఏం జరిగింది అండీ అని వేదవతి రామరాజుని అడుగుతుంది. తిరుపతి జరిగింది అంతా చెప్తాడు. విన్నావు కదా ద గ్రేట్ రామరాజు నడిరోడ్డు మీద కన్న కొడుకుని ఎలా అవమానించాడో విన్నావు కదా అని సాగర్ అంటాడు.

రామరాజు ఏ తప్పేంట్రా నేను ఉన్నదేగా మాట్లాడా.. రైస్మిల్లులో పని చేయడం నామోషీ.. కూలీ వాడిలా మూటలు మోయాలి అన్నావ్.. గవర్నమెంట్ ఉద్యోగం అయితే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఏసీ గదిలో కూర్చొవచ్చు అని నువ్వు మాట్లాడిన మాటలు నిజం కాదా అని సాగర్ అడుగుతాడు. దానికి సాగర్ అయ్యా రామరాజు గారు మీకు ఓ దండం నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో ఒక స్థాయిలో ఉండాలి అని నేను ఆ రోజు అలా మాట్లాడాను.. కానీ ఇలా కొడుకుని దెప్పిపొడుస్తున్నారు చూడు మీరు గొప్ప తండ్రి.. మీలాంటి గొప్ప తండ్రితో మాట్లాడే స్థాయి అర్హత నాకు లేవు.. నన్ను వదిలేయండి.. ఏయ్ నర్మద పద.. అని అంటాడు. ఏంటి సాగర్ నువ్వు చిన్న విషయం జరిగితే చాలా ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటావ్ అర్థం లేకుండా అని నర్మద అంటుంది. ఏయ్ ఇది చిన్ని విషయం కాదు.. నడిరోడ్డు మీద నాకు జరిగిన తట్టుకోలేని అవమానం.. రా అని నర్మద చేయి పట్టుకొని లాక్కెత్తాడు.

వేదవతి ఆపి నేను మీ నాన్నతో మాట్లాడుతా ఆగరా అంటే ఏం మాట్లాడుతావమ్మా.. ఇన్ని రోజులు ఆయనకు నా ఉద్యోగమే ఇష్టం లేదు అనుకున్నా కానీ నేను ఇష్టం లేదు.. మొదట జీతంతో ఇంట్లో వాళ్లకి బట్టలు తెస్తే తగలబెట్టేసిన బండరాయి ఈయన. సాటి ఉద్యోగుల దగ్గర అవమానం ఉంటుందని ఆలోచించకుండా నీచంగా మాట్లాడిన మూర్ఖపు తండ్రి ఈయన అని అంటాడు. రామరాజు కోపంగా రేయ్ నోరు.. అదుపులో పెట్టుకొని మాట్లాడు అని అంటాడు. చూశావు కదా కన్నకొడుకు వెళ్లిపోతాడు అన్న బాధ రవ్వంత కూడా లేదు అని అంటాడు. రేయ్ నడిపోడా.. నాన్న కోపం కూడా ప్రేమేరా.. అని అంటాడు. నువ్వు ఆయనకు ముద్దల కొడుకు కాబట్టి నీకు ఒక్క మాట కూడా అనరు.. కానీ ప్రతీ క్షణం అవమానపడుతున్న నాకు తెలుసు అంటాడు. ఇంటా బయట ఆయనతో అవమానపడుతూ ఇక్కడ బతికే ఓపిక నాకు లేదు అమ్మా,, నేను బయటకు వెళ్లి నా బతుకు నేను బతుకుతా అని అంటాడు.

వేదవతి మిగతా ఇద్దరు కొడుకులతో రేయ్ పెద్దోడా.. చిన్నోడా.. ఏదో విధంగా వీడిని ఆపండ్రా అని అంటుంది. దానికి ధీరజ్ వెళ్లిపోతే వెళ్లిపోనీ అమ్మ అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. వాడిని ఆపాల్సింది పోయి ఇలా అంటావేంట్రా అని వేదవతి అడుగుతుంది. అవునమ్మా రోజుకి నాలుగు సార్లు ఇంటి నుంచి వెళ్లిపోతా అని బెదిరిస్తున్నాడు.. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. వెళ్లిపోతాను.. వెళ్లిపోతాను అని అన్నవాడిని ఎంత ఆపుతామమ్మా అని ధీరజ్ అంటాడు. దానికి సాగర్ ఆ రోజు నువ్వు వచ్చి బతిమాలితే వచ్చానురా.. ఈ సారి మాత్రం ఈ జన్మలో ఈ ఇంటి గుమ్మం తొక్కను అని అంటాడు. అలాగేరా.. అలాగే.. నిన్ను ఇంటికి రమ్మని ఎవరూ బతిమిలాడరు అని ధీరజ్ అంటాడు. రేయ్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే నిన్ను ఎవరూ ఆపలేరు.. ఆపరు కూడా... కాకపోతే నువ్వు నాన్నకి 5 లక్షలు ఇవ్వాలి కదా వాటిని వడ్డీతో సహా కట్టేసి వెళ్లిపోండి అని అంటాడు. ఐదు లక్షలు ఏంట్రా అని సాగర్ అంటే నువ్వు నీ ఉద్యోగం కొనుక్కోవడానికి ఎవరికీ చెప్పకుండా మిల్లులో తీసుకున్న 5 లక్షలు అని అంటాడు. నేను రైసు మిల్లులో చేసిన పనికి నా జీతం లెక్కేస్తే 5 లక్షలు పైనే వస్తాయి అని అంటాడు. అయితే నీ చిన్నప్పటి నుంచి నీ చదువుకి తిండికి చేసిన ఖర్చును లెక్కేస్తే 50 లక్షలు పైనే పడతాయి.. అవన్నీ కడతావా అని ధీరజ్ అడుగుతాడు. నన్ను కన్నందుకు అది తన బాధ్యత సాగర్ అంటాడు. కొడుకుగా పుట్టినందుకు కన్నతండ్రికి తోడుగా నిలవడం నీ బాధ్యత. నీలాగా ఎవరూ లెక్కకట్టరు. ఇప్పుడు నీ మాటలు అవసరం లేదు.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటున్నావ్ కదా.. ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్లిపో నిన్ను ఎవరూ ఆపరు.. నాన్న అంతే కదా అని ధీరజ్ అంటాడు.

రామరాజు దానికి అవునురా అంతే.. దొంగతనంగా ఉద్యోగం తెచ్చుకొని ఆ రక్తపు సొమ్ముతో తిండి తినడం తప్పు అని చెప్తే అది వాడికి ఎక్కడ లేని రోషం తెచ్చింది.. నిజంగా అంత రోషం ఉంటే నా 5లక్షలు నాకు కట్టమని చెప్పు అని అంటాడు. కడతాను కచ్చితంగా కడతాను నాకు కాస్త టైం ఇవ్వండి అని అంటాడు సాగర్. నిన్ను ఎవడ్రా నమ్మేది.. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావ్.. ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలీదు అంటే అని రామరాజు అంటాడు. ఇది కరెక్టేరా.. 5 లక్షలు ఇచ్చేసి వెళ్లిపో.. ఇంట్లో నుంచి వెళ్లాలి అంటే ఇప్పటికిప్పుడు 5 లక్షలు కట్టేయ్.. నిర్ణయం నీ చేతిలో ఉంది ఏం చేస్తావో చెయ్ అని ధీరజ్ అంటాడు. 5 లక్షలు కట్టే వెళ్తారురా అని సాగర్ ఇంట్లోకి వెళ్తాడు. ధీరజ్ నర్మద దగ్గరకు వెళ్లి వదినా సారీ అన్నయ్యని ఆపాలి అని డబ్బుల ప్రస్తావన తెచ్చానని అంటాడు. నువ్వు నాకు సారీ చెప్పడం కాదు ధీరజ్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది నర్మద. వేదవతి కొడుకుతో రేయ్ చిన్నోడా ఈ ఇంటికి ఏదైనా సమస్య వచ్చినా ఈ ఇల్లు మూడు ముక్కలు అవ్వకుండా నువ్వే కాపాడగలవు అని నాకు తెలుసురా అని ఏడుస్తుంది.

భాగ్యం మంచి చేపల పులుసు వండి భర్తకి వడ్డిస్తుంది. ఇంతలో వల్లీ కాల్ చేస్తుంది. అమ్మా నేను కడుపుతో ఉన్నా కదా నీకు గుడ్లు పీతల కూర తినాలి అనిపిస్తుందే అని అంటుంది. కడుపుతో ఉంటే అలాగే అనిపిస్తుందని భాగ్యం అంటుంది. దానికి ఇడ్లీబాబాయ్ అమ్మడుకి కడుపే లేదు కదా.. మరి ఎలా కోరికలు ఉంటాయి అని అంటుంది. రేపే పంపిస్తా అని భాగ్యం అంటుంది. ఇక వల్లీ ఇంట్లో జరిగిన గొడవ మొత్తం చెప్తుంది. ఓసేయ్ భాగ్యం అమ్మడు కడుపుతో ఉన్నాను అని చాలా హ్యాపీగా ఉంది.. అది అబద్ధం అని తెలిస్తే చాలా బాధ పడుతుందే.. నీ అబద్ధాలతో తన జీవితం ఎందుకే ఇబ్బంది పెడతావ్ అని ఇడ్లీబాబాయ్ అడుగుతాడు. దానికి భాగ్యం నేను ఏం చేసినా లోకకల్యాణం కోసమే అని అంటుంది.

చందు వల్లీ దగ్గరకు వచ్చి ఎవరు ఫోన్లో అని అడుగుతాడు. మా అమ్మ అని వల్లీ అంటే ఇంట్లో గొడవ చెప్పావా అని అంటాడు. ఆ చెప్పా అని వల్లీ అంటే నువ్వు ఇక మారావా.. మా ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా మేం కలిసే ఉంటాం.. నువ్వు మీ అమ్మ మాటలు పట్టుకొని కాపురం కూల్చేవరకు తెచ్చుకున్నావ్,, ఈ సారి ఆ పరిస్థితి తెచ్చుకోకు అని అంటాడు. నర్మద సాగర్ దగ్గరకు వెళ్లి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అన్న ఆలోచన నీది కాదు మా నాన్నది అంతే కదా అని అంటుంది. ఓ మంచి సలహా ఎవరు ఇస్తే ఏంటి అని సాగర్ అంటాడు. ఏంటి మంచి సలహా ఆనందంతో ఉన్న ఇంటిని ముక్కలు చేయడం మంచి సలహానా.. మీ అమ్మకి మీ నాన్నకి కడుపు కోత పెట్టడం మంచి సలహానా.. అని అడుగుతుంది. బయట నుంచి ధీరజ్, ప్రేమ, వేదవతి, రామరాజు నర్మద, సాగర్ల మాటలు వింటుంటారు. నువ్వు మోసం చేసి జాబ్ కొన్నావు అన్న బాధ తప్ప నీ మీద ఇంకేం కోపం లేదు.. నువ్వు మా నాన్న మాటలు విని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావ్ అని నర్మద అంటుంది. బాగు పడటానికి కొత్త దారి వెతుక్కుంటున్నాను.. మీ మామయ్య కంటే మా మామయ్యే మంచోడు. 5 లక్షలు ఇస్తాను ఈ నరకం నుంచి బయట పడతా అని అంటాడు. ప్రేమ ఏడుస్తుంటే ధీరజ్ వెళ్లి నీకు ప్రాణమైన మీ నర్మద అక్కని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపితే థ్యాంక్స్ చెప్పకుండా ఏడుస్తావేంటే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam