Illu Illalu Pillalu Serial Today Episode ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా మారుతోంది.
ఈ రోజు(సెప్టెంబర్ 3న) ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేం లేచిపోతాం..
తిరుపతి తనకి సుకన్యకి పెళ్లి చేయమని ప్రేమ, ధీరజ్లను అడుగుతాడు. ప్రేమ సుకన్యతో పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. ఇంట్లో విషయం చెప్పేస్తా అని అంటుంది. ధీరజ్ ప్రేమని ఆపి మామయ్య కోరిన ఓకే ఒక కోరిక ఇది.. అది కూడా మనం కాదు అంటే ఎలా అని అంటాడు. దానికి ప్రేమ వేరే అమ్మాయి అయితే నేను ఏం మాట్లాడే దాన్ని కాదురా.. కానీ ఇది ఆ వల్లీ కుటుంబం.. ఆ వల్లీ వల్ల మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందో తెలీదు.. ఇప్పుడు దానికి ఇది తోడయితే వీళ్లిద్దరూ కలిసి మన ఇంటిని సర్వ నాశనం చేసేస్తారు. నేను అస్సలు ఒప్పుకోను అని ప్రేమ అంటుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే తిరుపతి ఆపి మీరు గొడవ పడుతూ ఉండండి.. మేం లేచిపోతాం అని అంటాడు. ధీరజ్ ఆపి ప్రేమతో సుక్కు కూడా మారుతుందిలే.. అని చెప్పి పెళ్లి చేద్దాం అని అంటాడు. ఇద్దరూ కలిసి సాయంత్రం తిరుపతి పెళ్లి చూపులు చెడగొట్టాలి అని అనుకుంటారు.
ఎవరి మీద అయినా అనుమానం ఉందా..
నర్మద రైస్మిల్లులో పోయిన 6 లక్షలు గురించి ఆలోచిస్తూ చందుతో ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడుగుతుంది. లేదు అని చందు అనడంతో తనకి మాత్రం వల్లీ వాళ్ల మీద అనుమానం ఉందని చెప్తుంది. వాళ్లు వచ్చారు కానీ వాళ్లకి మన దగ్గర డబ్బు ఉందనే విషయం తెలీదు.. డబ్బు కూడా నా దగ్గరే ఉందని చందు అంటాడు. వాళ్లే తీశారు అని మన దగ్గర ఆధారం లేదు కదా.. ఏమని అడుగుతాం.. అయినా డబ్బు ఓ వ్యసనం కదా.. ఆ దొంగలు మళ్లీ రారా.. మనకి చిక్కరా అప్పుడు చెప్తా అని చందు అంటాడు. నర్మద మనసులో మీరు నమ్మినట్లు వాళ్లని నేను నమ్మను.. ఆ దొంగలముఠా సంగతి చెప్తా అనుకుంటుంది.
ధీరజ్, ప్రేమలకు కొత్త సమస్య..
ధీరజ్, ప్రేమలకు తిరుపతికి పిల్లనిస్తానని చెప్పిన వాళ్ల ఇంటి అడ్రస్ విశ్వక్ ఇవ్వడంతో ఇద్దరూ అక్కడికి వెళ్తారు. వెళ్లడం వెళ్లడమే ధీరజ్, ప్రేమలకు రౌడీలు కత్తులతో బెదిరిస్తారు. ఇంతలో పెళ్లి కూతురు బాలామణి తల్లి వచ్చి ధీరజ్, ప్రేమల్ని పలకరిస్తుంది. ఇద్దరినీ కూర్చొపెట్టి మాట్లాడుతుంది. తిరుపతి అప్పులు చేస్తుంటాడని.. పెద్ద రొమాంటిక్ కింగ్ అని.. చాలా ఎఫైర్లు ఉన్నాయి అని.. పెళ్లిలో ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇది మూడో పెళ్లి అని మొదటి ఆవిడ అరటి పండు తొక్క మీద కాలు వేసి చనిపోయింది.. రెండు ఆవిడ ఉయ్యాల కడుతూ దానికే వేలాడి చనిపోయిందని పెళ్లి వాళ్లని భయపెట్టేసి పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారు. తర్వాత ప్రేమ ధీరజ్ నువ్వుకుంటారు.
Hima Gowda: 'కుస్తీ కళ్యాణి' సీరియల్ హీరోయిన్ హిమా గౌడ.. రియల్ లైఫ్ ఆసక్తికర విశేషాలు!
బావిలో బల్లి..
నర్మద వల్లీ పుట్టింటికి వెళ్లి ఓ బోర్డు మీద బావిలో బల్లి అని హెడ్డింగ్ పెట్టి దాని కింద 1. ధీరజ్ ప్రేమలను విడగొట్టడం.. 2.. రైస్మిల్లులో డబ్బు కొట్టేయడం.. 3.. తిరుపతి దగ్గర నుంచి గోల్డ్ చైన్ కొట్టేయడం.. 4.. తిరుపతి బాబాయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అని రాస్తుంది. ఇవి నర్మద.. సుకన్య, వల్లీ, ఇడ్లీబాబాయ్, భాగ్యానికి చెప్తుంది. ఈ కథ పేరు బావిలో బల్లి.. అనగనగా ఒక అడవిలో ఒక బల్లి ఉండేది అడవిలో బల్లి ఏంటి అనుకుంటున్నారా? ఇది రాక్షస బల్లిలే.. అది పేరుకు బల్లేనా గుంటనక్కుకున్నన్ని తెలివితేటలు ఉన్నాయి.. ఆ బల్లి తనకి ఆశ్రయం ఇచ్చిన ఇంటిని నాశనం చేయాలని ఒక ముగ్గురు మోసళ్లతో చేతులు కలిపింది.. ప్లాన్లు మీద ప్లాన్లు వేసి ఆ పనులు మోసళ్లకి అప్పజెప్పింది పాపం ఆ మోసళ్లు బుర్ర వాడలేకపోవటంతో అడ్డంగా దొరికిపోయారు ఆ మోసళ్ల మూతి పగలగొట్టి అడిగితే అసలు విలన్స్ మేము కాదు మీ ఇంట్లో ఉండే బల్లి సారీ.. సారీ.. ఆ బల్లి అని నిజం కక్కాయన్నమాట.. ఎలా ఉంది కథ? చెప్పు కన్యా కథ ఎలా ఉంది? బాగుంది కదా ఈ కథలో బల్లి ఎవరో తెలుసా అని నర్మద అంటుంది. దానికి వల్లీ.. ఏంటి చెల్లాయ్.. ఏం చేయాలో తోచకా.. ఇలాంటి దిక్కుమాలిన కథలు చెప్తున్నావా అని అడుగుతుంది. అవునక్కా.. ఇంత కష్టపడి మరీ నువ్వు చిక్కుముడి వేశావు దాన్ని విప్పకపోతే ఎలా? అని నర్మద అంటుంది. నేనేం చేశాను? అని వల్లీ అంటే అక్కా నువ్వేమైనా అనుకో నువ్వు గాని సినిమాల నటిస్తే నీకు పక్కా నంది వచ్చేది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Author : Jhanshi Balleda

