Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

ABP దేశం 4 months ago

IMAX Hyderabad Return: హైదరాబాద్ సినిమా ప్రేమికులు 12 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. నగరానికి ఐమాక్స్(IMAX Hyderabad) తిరిగి వస్తున్నట్టు ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిట్ ఏషియన్ సునీల్ నారంగ్ స్పష్టం చేశారు.

సిటీ సినిమా అంటే ఒక క్రేజ్. ఆ క్రేజ్కు కేరాఫ్ అడ్రస్ ఐమాక్స్.ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన స్క్రీన్గా రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఐమాక్స్ వైభవం మళ్లీ మొదలు కాబోతోంది. దాదాపు 12 ఏళ్లుగా కేవలం మల్టీప్లెక్స్ అనుభవంతో సరిపెట్టుకుంటున్న సినీ ప్రియులకు ఇది ఒక మంచి శుభవార్తే. ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ ఏషియన్ సునీల్ నారంగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో హైదరాబాద్ సోషల్ మీడియా ఇప్పుడు ఐమాక్స్ జపంతో హోరెత్తిపోతోంది.

హైదరాబాద్ ఐమాక్స్ రీ-ఎంట్రీ: ఏషియన్ సునీల్ నారంగ్ వెల్లడించిన వివరాలు

హైదరాబాద్లో ఐమాక్స్ స్క్రీన్ తిరిగి రాబోతోందని ఏషియన్ సునీల్ నారంగ్ ఒక ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు. ఆయనకు చెందిన ఒక ప్రాపర్టీలోనే ఈ అత్యాధునిక ఐమాక్స్ స్క్రీన్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికార ప్రకటన మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో వెలువడనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వారంలోనే ఒక క్లారిటీ రాబోతోంది.

Also Read : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

కొత్త ఐమాక్స్ థియేటర్ ఎక్కడ రాబోతోంది?

సునీల్ నారంగ్ ప్రస్తుతం లొకేషన్ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకున్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల్లో , సోషల్ మీడియాలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. హకీంపేటలో రాబోతున్న ప్రతిష్టాత్మక AMB సినిమాస్ ప్రాజెక్టులో భాగంగానే ఈ ఐమాక్స్ స్క్రీన్ను నిర్మిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ముద్ర పడాల్సి ఉంది. ఒక వేళ ఇదే నిజమైతే హైదరాబాద్లోనే అత్యంత విలాసవంతమైన స్ట్రాంగ్ టెక్నాలజీ సినిమా హబ్గా హకీంపేట అవతరిస్తుంది.

ప్రసాద్స్ ఐమాక్స్ (Prasads IMAX History) ఒక ఎమోషన్.. ఎందుకు దూరం అయింది?

హైదరాబాద్ వాసులకు ఐమాక్స్ అనేది కేవలం ఒక సినిమా థియేటర్ మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. 2003 జులై 25న ఎల్వీ ప్రసాద్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రసాద్ ఐమాక్స్ దేశంలోనే మూడో ఐమాక్స్ స్క్రీన్గా చరిత్ర సృష్టించింది. ఆ భారీ 70mm తెరపై సినిమాలు చూస్తుంటే వచ్చే అనుభూతే వేరు. కానీ 2014లో సాంకేతిక కారణాల వల్ల ఒరిజినల్ ఐమాక్స్ 70mm ప్రొజెక్టర్ను తొలగించారు. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఇంటర్స్టెల్లార్ ఆ ఫార్మాట్లో ప్రదర్శించిన చివరి సినిమా. ఆ తర్వాత ప్రసాద్ స్క్రీన్ ఉన్నప్పటికీ అది ఐమాక్స్ బ్రాండింగ్ను కోల్పోయింది. అప్పటి నుంచి హైదరాబాద్ సినీ ప్రేక్షకులు ఒక రియల్ ఐమాక్స్ అనుభవం కోసం పరితపిస్తూనే ఉన్నారు.

టాప్ ట్రెండింగ్లో ఉన్న సైన్స్ వార్తలు మిస్ అవ్వొద్దు

1

భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

2

వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?

3

నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

4

బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్ హెల్మెట్ మంచిదా? ఫుల్ హెల్మెట్ పెట్టుకుంటే బెటరా?

5

6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

గత పదేళ్లలో టెక్నాలజీ ఎంతో మారింది. ఇటీవల హైదరాబాద్లో ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమా స్క్రీన్లు అల్లు సినిమాస్ వంటి వాటిలో అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఐమాక్స్కు ఉన్న ప్రత్యేకమైన యాస్పెక్ట్ రేషియో, సౌండ్ క్వాలిటీని సినీ ప్రేమికులు మిస్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు సునీల్ నారంగ్ తీసుకురాబోతున్న ఐమాక్స్ అత్యాధునిక లేజర్ ప్రొజక్షన్ టెక్నాలజీతో ఉంటుందని అంచనా. ఇది పాత ఐమాక్స్ కంటే మెరుగైన విజువల్స్, సౌడ్ను అందిస్తుంది.

హైదరాబాద్ అంటేనే ఇండియన్ సినిమాకు హబ్. ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకులు తమ సినిమాలకు ఐమాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల చేస్తున్నారు నగరంలోనే ఐమాక్స్ స్క్రీన్ అందుబాటులోకి వస్తే హాలీవుడ్ భారీ చిత్రాలను వాటి అసలు సిసలు క్వాలిటీతో చూసే అవకాశం కలుగుతుంది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ల పాన్ ఇండియా సినిమాలకు ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తే ఇక్కడి ప్రేక్షకులు ఆ అద్భుతాన్ని అనుభవించవచ్చు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఈ ఐమాక్స్ ఫార్మాట్లోనే షూట్ చేస్తున్నారు. అందుకే ఆ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లబోతోంది.

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam