Dailyhunt
IPL 2026 GT VS RCB Result Update: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్టరీ.. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్షద్, రషీద్, ఆర్సీబీకి షాక్

IPL 2026 GT VS RCB Result Update: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్టరీ.. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్షద్, రషీద్, ఆర్సీబీకి షాక్

ABP దేశం 2 weeks ago

IPL 2026 GT VS RCB Latest Update:ఐపీఎల్ 2026 సీజన్ లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపింది. వరుసగా రెండో విజయాన్ని సాధించి, ప్లే ఆఫ్స్ ఆవకాశాన్ని మెరుగుపర్చుకుంది.

అంతకుముందు సొంతగడ్డ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలేంజర్స్ బెంగళూరుపై 4 వికెట్లతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. బ్యాటింగ్ వైఫల్యంతో 19.1 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (24 బంతుల్లో 40, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అర్షద్ ఖాన్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ను జీటీ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 15.5 ఓవర్లలోనే 6 వికెట్లకు 158 పరుగులు చేసి విజయం సాధించింది. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 43, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు సాధించి, పర్పుల్ క్యాప్ ను మరోసారి సాధించాడు. ఈ విజయంతో జీటీ ఐదో స్థానాన్ని పటిష్టం చేసుకోగా, ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.

గిల్ విశ్వరూపం..
చిన్నటార్గెట్ తో బరిలోకి దిగిన జీటీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ సాయి సుదర్శన్ (6)ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత పవర్ ప్లే ఫాయిదాను అందుకుంటూ బౌండరీలు, సిక్సర్లతో గిల్ రెచ్చిపోయాడు. మరో ఎండ్ లో జోస్ బట్లర్ (39) కూడా అతనికి చక్కని సహాకారం అందించాడు. మరోవైపు గిల్ జోరుతో ఐదు ఓవర్లు ముగిసే సరికి 57 పరుగులు చేసింది. గిల్ ఔటైన తర్వాత బట్లర్ గేర్ మార్చాడు. నాలుగు సిక్సర్లతో సత్తా చాటాడు. అయితే కీలకదశలో భువీ అతడిని ఔట్ చేయడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.

IPL 2026:ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్‌ అవుట్?

వికెట్లు టపాటపా..
మిడిలార్డర్ బ్యాటర్లు సత్తా చాటలేక పోతున్న బలహీనతను జీటీ మరోసారి బయట పెట్టుకుంది. బట్లర్ ఔటయ్యేసరికి 7.3 ఓవర్లలో 93/2 తో ఈజీ ఛేజింగ్ దిశగా కనిపించిన జీటీ.. ఆ తరవాత అనూహ్యంగా తడబడింది. వరుసగా విఫలమవుతున్న హిట్టర్ షారూఖ్ ఖాన్ (8) అనవసర భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. అంతకుముందు నుంచి కాస్త అసౌకర్యంగా కనిపించిన వాషింగ్టన్ సుందర్ (12)ను రొమారియో షెఫర్డ్ బోల్తా కొట్టించాడు. జాసన్ హోల్డర్ (12) కూడా విఫలమవడంతో ఒక దశలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఎక్స్ పీరియన్స్డ్ రాహుల్ తెవాటియా (27 నాటౌట్) తన అనుభవన్నాంత రంగరించి, నాలుగు ఫోర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రషీద్ ఖాన్ (7 నాటౌట్) అతనికి చక్కని సహాకారం అందించాడు. గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam