Dailyhunt
IPL 2026 playoffs venue date: ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్, వేదికలు ఫిక్స్.. మే 31న ఫైనల్

IPL 2026 playoffs venue date: ఐపీఎల్ ప్లేఆఫ్ షెడ్యూల్, వేదికలు ఫిక్స్.. మే 31న ఫైనల్

ABP దేశం 4 days ago

IPL 2026 playoffs Schedule | ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ లీగ్ స్టేజీ మ్యాచులు త్వరలో పూర్తి కానున్నాయి. దాంతో కీలకమైన ప్లేఆఫ్ రేసు మొదలవుతుంది.

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను అధికారికంగా ఖరారు చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 31న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ధర్మశాల, న్యూ చండీగఢ్‌లలో నిర్వహించనున్నారు.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ షెడ్యూల్ (IPL 2026 Playoffs Schedule)

క్వాలిఫైయర్-1: మే 26 - హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం, ధర్మశాల

ఎలిమినేటర్: మే 27 - న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్

క్వాలిఫైయర్-2: మే 29 - న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్

ఫైనల్: మే 31 - నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.

ధర్మశాల, న్యూ చండీగఢ్‌లో ప్లే ఆఫ్స్ మ్యాచులు
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ బుధవారం నాడు ఖరారైంది. మే 26న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుండగా, మే 27న ఎలిమినేటర్, మే 29న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీనితో ఐపీఎల్ 19వ సీజన్ ముగియనుంది.

టేబుల్ టాపర్‌గా పంజాబ్ కింగ్స్..

-PBKS (పంజాబ్ కింగ్స్): 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 ఓటములు, 1 ఫలితం తేలని మ్యాచ్‌తో 13 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది.

- RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: 1.420)

- SRH (సన్‌రైజర్స్ హైదరాబాద్): 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లు సాధించి మూడవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: 0.644)

- RR (రాజస్థాన్ రాయల్స్): 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లు సాధించి నాలుగవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: 0.510)

- GT (గుజరాత్ టైటాన్స్): 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్లు సాధించి ఐదవ స్థానంలో ఉంది. (నెట్ రన్ రేట్: -0.147)

- CSK (చెన్నై సూపర్ కింగ్స్): 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 5 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఆరవ స్థానంలో ఉంది.

- DC (ఢిల్లీ క్యాపిటల్స్): 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 6 ఓటములతో 8 పాయింట్లు సాధించి ఏడవ స్థానంలో ఉంది.

- KKR (కోల్‌కతా నైట్ రైడర్స్): 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 5 ఓటములు, 1 ఫలితం తేలని మ్యాచ్‌తో 7 పాయింట్లు సాధించి ఎనిమిదవ స్థానంలో ఉంది.

- MI (ముంబై ఇండియన్స్): 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములతో 6 పాయింట్లు సాధించి తొమ్మిదవ స్థానంలో ఉంది.

- LSG (లక్నో సూపర్ జెయింట్స్): 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు, 7 ఓటములతో 4 పాయింట్లు సాధించి పదవ స్థానంలో నిలిచింది.

Author : Shankar Dukanam<

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam