Dailyhunt
IPL 2026 RR VS MI Result Update: రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘన విజయం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్యవంశీ.. పట్టికలో టాప్ ప్లేస్ కు రాయల్స్

IPL 2026 RR VS MI Result Update: రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘన విజయం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్యవంశీ.. పట్టికలో టాప్ ప్లేస్ కు రాయల్స్

ABP దేశం 1 week ago

IPL 2026 RR Beat Mi News: ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జోరు చూపిస్తోంది. వరుసగా మూడో విజయం సాధించి, గెలుపు హ్యాట్రిక్ సాధించింది. మంగళవారం గువాహటిలో జరిగిన మ్యాచ్ లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ పై 27 పరుగులతో ఘనవిజయం సాధించింది.

వర్షం ఆటంకం కలిగించడంతో చాలా లేటుగా మ్యాచ్ ప్రారంభమైంది. 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు సరిగ్గా 150 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (32 బంతుల్లో 77 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచి, ఆరెంజ్ క్యాంప్ ను కూడా సొంతం చేసుకున్నాడు. బౌలర్లలో అల్లా గజన్ ఫర్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్ లో 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ముంబై ఘోర పరాజయం పాలైంది. నమన్ ధీర్, షేర్ఫాన్ రూథర్ ఫర్డ్ చెరో 25 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. బౌలర్లలో నాండ్రే బర్గర్, సందీప్ శర్, రవి బిష్ణోయ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. బుధవారం జరిగే లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

ధనాధన్ ఆటతీరు..
ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కు ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39, 1 ఫోర్, 5 సిక్సర్లు) అద్భుత ఆరంభాన్నిచ్చారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన జైస్వాల్.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించాడు. మరోవైపు వైభవ్ కేవలం సిక్సర్లతోనే డీల్ చేయడంతో 3.2 ఓవర్ల పవర్ ప్లేలో రాజస్థాన్ 59 పరుగులను పిండుకుంది. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో వైభవ్ ఔటైనా.. జైస్వాల్ మాత్ర జోరు కొనసాగించాడు. కేవలం 23 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి, ముంబైపై తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. చివర్లో కెప్టెన్ రియాగ్ పరాగ్ (20) కూడా ధాటిగా ఆడటంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది.

టపాటపా..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైని బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. మంచి సిక్సర్ కొట్టిన ర్యాన్ రికెల్టన్ (8) ను జోఫ్రా ఆర్చర్ బోల్తా కొట్టించాడు. రోహిత్ శర్మ (5), సూర్య కుమార్ యాదవ్ (6) కూడా త్వరగా ఔటవడంతో ముంబై పీకల్లోతూ కష్టాల్లోపడింది. పవర్ ప్లేలో కేవలం 30 పరుగులు మాత్రమే సాధించింది. తిలక్ వర్మ (14)తో సహా మిగతా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెనుదిరగడంతో ముంబై ఛేజింగ్ సాఫీగా సాగలేదు. చివర్లో నమన్, రూథర్ ఫర్డ్ కాసేపు పోరాడి పరుగుల అంతరాన్ని తగ్గించారు. ఇక ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక విజయం, రెండు పరాజయాలతో ముంబై ఏడోస్థానంలో నిలిచింది.

Author : Ayesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam