Dailyhunt
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన లక్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ కు పరాజయం

IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన లక్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ కు పరాజయం

ABP దేశం 2 weeks ago

IPL 2026 SRH VS LSG Latest Updates: సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కు చుక్కెదురైంది. ఆదివారం రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. బ్యాటర్ల వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది.

విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (41 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను లక్నో సునాయసంగానే ఛేదించింది. 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి ఈజీ విక్టరీని అందుకుంది. రిషభ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో హర్ష్ దూబేకు రెండు వికెట్లు దక్కాయి. తాజా విజయంతో టోర్నీలో లక్నో తొలి విజయం సాధించినట్లు అయింది. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలిచి జోరు మీదున్న సన్ దూకుడుకు అడ్డుకట్ట పడినట్లు అయింది.

ఆదుకున్న మార్క్రమ్..
కాస్త ఈజీ టార్గెట్ తోనే బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన మిషెల్ మార్ష్ (14)ను ఇషాన్ మలింగ పెవిలియన్ కు చేర్చాడు. ఈ దశలో ఐడెన్ మార్క్రమ్ (27 బంతుల్లో 45, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి పంత్ జట్టును ముందుండి నడిపించాడు. ఒక ఎండ్ లో మార్క్రమ్ దూకుడుగా ఆడగా, పంత్ అతనికి సహాకారం అందించాడు. దీంతో పవర్ ప్లేలో లక్నో 53 పరుగులు సాధించింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 40 పరుగులు జోడించాక మార్క్రమ్ ఔటవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.

తడబడిన లక్నో..
మార్క్రమ్ వెనుదిరిగినా పంత్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. చిన్న చిన్న పార్ట్నర్ షిప్ లను నమోదు చేస్తూ, చివరికంటా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంత్ బ్యాటింగ్ జోరుతో ఓ దశలో 102-2తో విజయం వైపు దూసుకెళుతున్న లక్నో జోరుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. స్వల్ప వ్యవధిలో ఆయుష్ బదోనీ (12), నికోలస్ పూరన్ (1) ఔటవడంతో మ్యాచ్ లో ఉత్కంఠ స్థితి నెలకొంది. అయితే ఓ ఎండ్ లో పాతుకు పోయిన పంత్ మాత్రం 43 బంతుల్లో ఫిఫ్టీ చేసి, జట్టుకు విజయాన్ని అందించాడు. మధ్యలో అబ్దుల్ సమద్ (16) కీలక పరుగులు జత చేసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Author : Ayesha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam