Dailyhunt
Jabardasth Dorababu: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ దొరబాబు... గృహ ప్రవేశం వీడియోలు చూశారా?

Jabardasth Dorababu: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ దొరబాబు... గృహ ప్రవేశం వీడియోలు చూశారా?

ABP దేశం 1 week ago

బర్దస్త్ ఆర్టిస్టుల్లో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాడు దొరబాబు. ఇక ఆ షోని గమనిస్తే దొరబాబు మీద వేసే సెటైర్లు, పంచ్‌లు బట్టి ఆయన మీద ఇక ఇంప్రెషన్ ఏర్పడుతుంది.

పైగా ఆయన వైజాగ్‌లో రైడింగ్‌లో దొరికిపోవడం, ఆయన్ను బయటకు తీసుకు రావడానికి హైపర్ ఆది పడిన కష్టం అందరికీ తెలిసిందే. ఇక ఆది మళ్లీ తన టీంలోనే పెట్టుకుని ఛాన్స్‌లు ఇవ్వడం అందరికీ తెలిసిందే. అలా దొరబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ టైంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.

Also Read: SA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

వైజాగ్ ఘటన తరువాత దొరబాబు మళ్లీ అలాంటి స్థితికి వెళ్లలేదు. బుద్దిగా తన షోలు, తన ఈవెంట్లు అంటూ తన పనిలో నిమగ్నైపోయాడు. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, సినిమాలు అంటూ తన బిజీలో ఉండిపోయాడు. తాజాగా దొరబాబు ఓ గుడ్ న్యూస్‌ని అందరితో పంచుకున్నాడు. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు. అతని కొత్త ఇల్లు, గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మొత్తానికి దొరబాబు బుల్లితెర షోలతో బాగానే సంపాదించి ఓ ఇంటి వాడు అయ్యాడనిపిస్తోంది.

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

జబర్దస్త్ ఆర్టిస్టుల్లో చాలా మంది ఇప్పటికే బాగా సెటిల్ అయ్యారన్న సంగతి తెలిసిందే. నాగబాబు కూడా ముందు నుంచి తన ఆర్టిస్టులకు డబ్బు సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ గురించి సలహాలు ఇస్తుండేవాడన్న సంగతి తెలిసిందే. ముందుగా ఇంటిని కొనే ప్లాన్ పెట్టుకోండని చెబుతుంటాడేవాడట. ఇక అందరిలోనూ చమ్మక్ చంద్ర మనీ ఇన్వెస్ట్మెంట్, ప్లానింగ్ గురించి నాగబాబు ఎక్కువగా చెబుతుంటాడు. అలా జబర్దస్త్ ఆర్టిస్టుల్లో చాలా మంది ఇప్పటికే హైద్రాబాద్‌లో ఫ్లాట్స్, ఇల్లులు కొనేసుకుని సెటిల్ అయ్యారు. వారిలో ఇప్పుడు దొరబాబు కూడా చేరిపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam