Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janhvi Kapoor: అతిలోకసుందరి కూతురు కేవలం అందాల ప్రదర్శనకేనా?

Janhvi Kapoor: అతిలోకసుందరి కూతురు కేవలం అందాల ప్రదర్శనకేనా?

ABP దేశం 4 days ago

 జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో పెద్ద సినిమాల్లోనే అవకాశాలొచ్చాయ్.. శ్రీదేవి కూతురు కావడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది...కానీ ఆ రెండు సినిమాల వల్ల ఆమెకు కలిసొచ్చింది శూన్యం

 పెద్ది మూవీలో అచ్చియ్యమ్మగా నటించిన జాన్వీ కపూర్ అందాల ప్రదర్శనకు తప్ప..ఈ మూవీలో ఈమె ఎందుకు ఉందో అర్థంకావడం లేదంటున్నారు థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు

ఉప్పెన మూవీలో కృతి శెట్టి పాత్ర అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ బుచ్చిబాబు. సినిమాకు ఆమె అందం, నటన రెండూ ప్లస్ గానే నిలిచాయ్. జాన్వి కపూర్ కి కూడా అలాంటి అవకాశం వచ్చి ఉంటుందనుకున్నారంతా. కానీ పెద్ది సినిమా చూసినవారంతా..ఐటెమ్ గాళ్ కన్నా ఆమె పాత్ర ఘోరం అనేశారు..

అంతకుముందు తెలుగులో నటించిన దేవరలో ఏమైనా మంచి పాత్ర చేసిందా అంటే అదీ లేదు.. తంగం క్యారెక్టర్లో గ్లామర్ షో చేసిందంతే. పాటలకు, రొమాంటిక్ సీన్లకు పరిమితం అయింది.

ఆమెకు నటన రాదా అంటే.. ఇప్పటివరకూ ఆమె బాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ Gunjan Saxena, Mili, Mr & Mrs Mahi పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ వే. కానీ తెలుగులో నటించే అవకాశం రాలేదు

తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ..శ్రీదేవి కూతురు కావడంతో తెలుగు ప్రేక్షకులు త్వరగా ఓన్ చేసుకున్నారు..కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడంతో జాన్వీ కపూర్ ఫెయిలైందనే చెప్పాలి..అందుకు కారణం ఆమె ఎంచుకున్న పాత్రలు..

తెలుగు ఇండస్ట్రీపై మంచి అభిప్రాయం ఉందని చెప్పిన జాన్వీ కపూర్ కి తర్వాత వచ్చే ప్రాజెక్టుల్లో అయినా నటనకు ఆస్కారం ఉండే పాత్ర దక్కుతుందమో వెయిట్ అండ్ సీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam