Comedian Satya Jetlee Latest Movie Jetlee Twitter Review In Telugu: కమెడియన్ సత్య హీరోగా నటించిన సినిమా 'జెట్లీ'. ఆయనతో 'మత్తు వదలరా' సినిమాల్లో ఫుల్ కామెడీ చేయించిన రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు.
'వెన్నెల' కిశోర్ మరో కీలక పాత్ర చేయగా... రియా సింఘా కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి టాక్ ఎలా ఉందంటే?
ఫస్టాఫ్ అంతా ఫన్... సెకండాఫ్ సాగదీత?
'జెట్లీ' సినిమాలో ఫస్టాఫ్ అంతా ఫన్ ఉందని ఓవర్సీస్ టాక్. సత్యతో పాటు 'వెన్నెల' కిశోర్ కామెడీతో బాగా ముందుకు వెళ్లిందట. కానీ, సెకండాఫ్ వచ్చేసరికి సాగదీత వ్యవహారం ఉందని వినబడుతోంది.
రితేష్ రాణా టెంప్లేట్ సినిమా... అంతా ఫ్లైటులో!
దర్శకుడు రితేష్ రాణాకు ఒక స్టైల్ ఉంది. 'మత్తు వదలరా' రెండు పార్టులు, ఆ మధ్యలో తీసిన 'హ్యాపీ బర్త్ డే' చూస్తే... కామెడీ సీన్లు తీయడంలో ఆయనకు ఓ మార్క్ ఉంది. 'జెట్లీ' సైతం ఆ రితేష్ రాణా టెంప్లేట్, ఫార్మాటులో సాగుతుందట.
సినిమాలో చిరంజీవి రిఫరెన్సులు బావున్నాయ్!
'జెట్లీ' సినిమాలో చిరంజీవి రిఫరెన్సులు బాగా ఉన్నాయని టాక్. మెగాస్టార్ 'స్వయం కృషి', ఇంకా 'న్యాయం కావాలి' వంటివి చూపించారట.
ఓటీటీలో రిపీట్ షోస్ ఉండొచ్చు... థియేటర్లలో ఏవరేజ్?
ఓవరాల్ సినిమా చూస్తే ఫస్టాఫ్ ఏవరేజ్ అని, సెకండాఫ్ పద వినోదం & రిఫరెన్సులు తప్ప సినిమాలో ఏమీ లేవని టాక్ వినబడుతోంది. ఏవరేజ్ సినిమా అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఓటీటీలో సినిమా వచ్చాక కొన్ని సీన్లు బాగా పేలతాయని అంటున్నారు.

