Jr NTR And TVK Vijay : తమిళనాడులో పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసాధారణమైన విజయం సాధించారు విజయ్. టీవీకే ప్రభంజనంలో చాలా మంది ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, మాజీ మంత్రులు కొట్టుకుపోయారు.

Jr NTR And TVK Vijay : తమిళనాడులో పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసాధారణమైన విజయం సాధించారు విజయ్. టీవీకే ప్రభంజనంలో చాలా మంది ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, మాజీ మంత్రులు కొట్టుకుపోయారు.
ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ నాయకత్వ మార్పు దిశగా సాగుతోంది. ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నప్పటికీ తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్‌కు అప్పగించే పని జరుగుతోంది. మొన్నీ మధ్య లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం ఆసక్తిగా మారింది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పార్టీ పెట్టిన రెండేళ్లలోపే విజయ్ సీఎం కాబోతున్నారని, అంతకంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉండి, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి పార్టీ పెడితే కచ్చితంగా సంచలనాలు నమోదు అవుతాయని ఫ్యాన్స్ అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై ఎప్పటికప్పుడే చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం జూనియర్ ఎప్పుడూ నోరు తెరవలేదు. 2009 ఎన్నికల్లో మహాకూటమికి మద్దతుతో ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఆ క్రమంలో ఆయన ప్రమాద బారిన కూడా పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని మహా కూటమి ఓడిపోయింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
అప్పుడు ఎన్టీఆర్... ఆ తర్వాత ఎంజీఆర్... ఇప్పుడు విజయ్ - పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే!
ఒకసారి రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు తన లైఫ్ మొత్తం సినిమాలపై ఆధారపడి ఉందని, వాటిపైనే ఫోకస్ పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. రాజకీయాలపై చర్చించే తీరిక, సమయం లేదని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, క్లిష్ట దశలో ఉన్నప్పుడు కూడా జూనియర్ స్పందించలేదు. రాజకీయాలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన ఫ్లెక్సీలతో రావాలని రిక్వస్ట్ చేసినా ఆయన పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం విజయ్ సాధించిన విజయంతో ఫ్యాన్స్ మరోసారి ఎన్టీఆర రాజకీయాలపై చర్చ లేవనెత్తారు.
Author : K