Dailyhunt
Kabir Singh Duhan: విలన్ నుంచి హీరోగా... 'ది రెడ్ బ్యాగ్'లో మెయిన్ లీడ్‌!

Kabir Singh Duhan: విలన్ నుంచి హీరోగా... 'ది రెడ్ బ్యాగ్'లో మెయిన్ లీడ్‌!

ABP దేశం 1 week ago

టాలీవుడ్ విలన్స్‌లో కబీర్ దుహన్ సింగ్ (Kabir Duhan Singh) ఒకరు. ఆయన నార్త్ ఇండియన్. కానీ తెలుగు సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టారు.

మ్యాచో స్టార్ గోపీచంద్ 'జిల్' ఆయన మొదటి సినిమా. అక్కడ నుంచి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'అఖండ 2 తాండవం' వరకు... పలు సినిమాల్లో పవర్ ఫుల్ & స్టైలిష్ విలన్ రోల్స్ చేశారు. ఇప్పుడీ యాక్టర్ విలన్ నుంచి హీరోగా ప్రమోషన్ తీసుకున్నారు. కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలో 'ది రెడ్ బ్యాగ్' రూపొందుతోంది.

మోడ్రన్ & యూత్ కల్చర్ చూపించేలా...
కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'ది రెడ్ బ్యాగ్' (The Red Bag Movie). యూట్యూబ్ సిరీస్, అలాగే కొన్ని సినిమాల్లో నటించిన ప్రసాద్ బెహరా మరొక ప్రధాన పాత్రధారి. అందాల భామలు రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫిమేల్ లీడ్స్. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'ది రెడ్ బ్యాగ్'లో కబీర్ దుహాన్ సింగ్ లుక్ చూపించలేదు. కానీ, నలుగురు అమ్మాయిల లుక్స్ చూపించారు. 'ప్లే బ్యాక్' సినిమాలో హీరో దినేష్ తేజ్, ఆ చిత్ర దర్శక రచయిత హరి ప్రసాద్ 'ది రెడ్ బ్యాగ్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Also Read: Trisha: త్రిష ప్రేమ పలుకులు... విజయ్ కోసమా? సంగీతకు కౌంటరా?

బ్యాగ్ చుట్టూ కథంతా... అందులో ఏముంది?
'ది రెడ్ బ్యాగ్' చిత్రాన్ని హరికృష్ణ సోమిశెట్టి నిర్మించగా... రవి కుమార్ సీరపు కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

'ది రెడ్ బ్యాగ్'లో ఓ బ్యాగ్ కీలక పాత్ర పోషిస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ... ''డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మాది మాంచి కంటెంట్ బేస్డ్ సినిమా. అందరికీ నచ్చుతుంది. నిర్మాణంలో రాజీ పడలేదు. త్వరలో థియేటర్లలోకి సినిమాను తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

Also Read: Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు ఫిక్స్‌ కానీ ట్విస్ట్ ఉంది గురూ

కబీర్ దుహాన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రియేష్ గురుసామి, రచన: విక్రమ్ రాజా, కూర్పు: శివ శర్వాని - శశి, పోరాటాలు: జాషువా - డ్రాగన్ ప్రకాష్, సాహిత్యం: కాసర్ల శ్యాం - తిరుపతి, కొరియోగ్రఫీ: జేడీ - స్నేహ భజంత్రి, సంగీతం: శేఖర్ మోపురి, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: రవికుమార్ శీరపు, నిర్మాత: హరికృష్ణ సోమిశెట్టి.

Also Read: TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్

Author : S Niharika

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam